Home /News /movies /

ANUSHKA SHETTY SENSATIONAL DECISION OVER HER FILM NISHABDHAM TO RELEASE ON OTT PLATFORM DURING CORONA LOCKDOWN TA

అనుష్క శెట్టి అనూహ్య నిర్ణయం.. లాక్‌డౌన్ కారణంగా నిశ్శబ్ధంగా ఆ పని..

అది పూర్తిగా ఆమె వ్యక్తిగత విషయమని స్పష్టం చేసింది జేజమ్మ. అలాగే అమ్మాయిలు ఎక్కడైనా పేరు ప్రతిష్టలు తెచ్చుకోవాలంటే ఈజీ వేతో పాటు కష్టమైన దారి కూడా ఉంటుందని.. తాను కఠినమైన దారిలోనే వచ్చానని చెప్పింది ఈమె.

అది పూర్తిగా ఆమె వ్యక్తిగత విషయమని స్పష్టం చేసింది జేజమ్మ. అలాగే అమ్మాయిలు ఎక్కడైనా పేరు ప్రతిష్టలు తెచ్చుకోవాలంటే ఈజీ వేతో పాటు కష్టమైన దారి కూడా ఉంటుందని.. తాను కఠినమైన దారిలోనే వచ్చానని చెప్పింది ఈమె.

కరోనా కారణంగా ఏర్పడ్డ లాక్ డౌన్‌తో సినిమా  షూటింగ్స్ అన్నీ ఎక్కడి కక్కడ ఆగిపోయాయి. వైరస్ వ్యాప్తిని నిరోధించే భాగంగా ఇప్పటికే  థియేటర్స్  మూత పడ్డాయి. తాజాగా అనుష్క శెట్టి తన నిశ్శబ్ధం సినిమా విషయంలో మాత్రం అనూహ్య నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం.

ఇంకా చదవండి ...
    కరోనా కారణంగా ఏర్పడ్డ లాక్ డౌన్‌తో సినిమా  షూటింగ్స్ అన్నీ ఎక్కడి కక్కడ ఆగిపోయాయి. వైరస్ వ్యాప్తిని నిరోధించే భాగంగా ఇప్పటికే  థియేటర్స్  మూత పడ్డాయి. ఈ లాక్ డౌన్ ఎప్పటివరకు కొనసాగుతుందో తెలియని పరిస్థితి. ఒకవేళా లాక్ డౌన్ తొలగించిన కూడా జనాలు సినిమా థియేటర్స్‌కు వచ్చి సినిమా చూసే పరిస్థితి ఎంతవరకు ఉంటుందో తెలియదు. అయితే ఓ సినిమా అనుకున్న సమయానికి విడుదల కాకపోతే తీవ్ర నష్టాలను ఎదుర్కోవాల్సీ వస్తుంది. దీంతో ఈ నష్టాల నుంచి.. ఈ పరిస్థితి నుంచి ఎలా గట్టెక్కాలా అని ఫిలిం మేకర్స్ తీవ్రంగా ఆలోచిస్తున్నారు. అదే సమయంలో ఓటీటీ ప్లాట్ ఫామ్‌లు ఆగిపోయిన సినిమాలను విడుదల చేస్తామని ముందుకొస్తున్నాయి. అంతేకాదు ఆయా సినిమాలకు ఓటీటీలో విడుదలకు అంగీకరిస్తే.. భారీ మొత్తంలో ఇవ్వడానికి వెనకాడటం లేదు. ఇప్పటికే హిందీలో అమితాబ్, ఆయుష్మాన్ ఖురానాలు నటించిన ‘గులాబో సితారో’ సినిమాను జూన్ 12న విడుదల చేయనున్నారు. ప్రముఖ నటుడు నవాజుద్దీన్‌ సిద్ధిఖి నటించిన గూమ్‌కేతు మే 22న జీ5లో విడుదల కాబోతుంది. వీటికి తోడు సిద్ధార్థ్‌ మల్హోత్రా, కియారా అద్వానీ నటించిన శ్రేషా, విద్యాబాలన్ ప్రధానపాత్రలో నటించిన శకుంతలా దేవి చిత్రాలు కూడా డైరెక్ట్‌గా డిజిటల్‌లో విడుదల కాబోతున్నట్లు తెలుస్తోంది. మరోవైపు అక్షయ్ కుమార్ హీరోగా నటించిన లక్ష్మీ బాంబ్, సూర్య వంశీ చిత్రాలు డిజిటల్‌లో విడుదల చేయడానిక సన్నాహాలు మొదలయ్యాయి.

    Amitabh bachchan gulabo sitabo,OTT Release news, Keerthy Suresh penguin release, Keerthy Suresh penguin,Laxmi bomb ott release, anushka shetty news, nishabdam movie on ott, Akshay kumar Laxmi bomb, Akshay kumar, Laxmi bomb, Laxmi bomb release, disney hotstar, డిస్నీ హాట్ స్టార్‌, లక్ష్మీబాంబ్, అక్షయ్ కుమార్,nishabdham to release on ott platform, కీర్తి సురేష్ సినిమా,పెంగ్విన్,
    అమితాబ్, అక్షయ్, కీర్తి సురేష్, కియారా Photo : Twitter


    అక్షయ్ కుమార్ నటించిన సినిమాలను ఒక్కొక్కటిని ఓటీటీలో రిలీజ్ చేయడానికి రూ. 200 కోట్లు చెప్పున మొత్తంగా రూ. 400 కోట్ల ఆఫర్ చేసినట్టు సమాచారం. తాజాగా అనుష్క ప్రధాన పాత్రలో నటించిన నిశ్శబ్ధం సినిమాను కూడా ఓటీటీలో విడుదల చేయడానికి అన్ని కార్యక్రమాలు పూర్తైయినట్టు సమాచారం. కొందరు నిర్మాతలకు ఓటీటీ ఫ్లాట్‌ఫామ్స్ ఇచ్చే ఆఫర్స్ ఆకర్షణీయంగా కనబడుతున్నా.. ఆ సినిమాలలో నటించిన హీరోలు, హీరోయిన్స్ మాత్రం ససేమిరా  అంటున్నారు. ఓటీటీ ద్వారా తమ సినిమాలు రిలీజైతే తమ పాపులారిటీ తగ్గిపోతుందనేది బడా హీరోలు అభిప్రాయ పడుతున్నారు. థియేటర్ రిలీజ్ వైపే హీరోలు మొగ్గు చూపుతున్నారు. ప్రస్తుతం నిశ్శబ్ధం కూడా ఇలాంటి పరిస్థితి ఫేస్ చేస్తోంది.

    Anushka shetty nishabdham trailer,nishabdham trailer released,anushka shetty nishabdham,anushka shetty nishabdham first look released,anushka shetty sye raa narasimha reddy,anushka shetty silence,anushka shetty silence first look released,anushka shetty bahubali,anushka shetty bhagamathi,anushka shetty instagram,anushka shetty twitter,anushka shetty facebook,anushka shetty age,anushka shetty hot sexy,anushka shetty hot sexy,anushka shetty movies,anushka shetty new movie,anushka movies,anushka nishabdham movie,anushka,nishabdam anushka,anushka shetty latest movie news,nishabdham teaser,anushka shetty songs,anushka shetty latest movie,anushka shetty silence,అనుష్క శెట్టి,అనుష్క నిశ్శబ్ధం ట్రైలర్,హీరోయిన్ అనుష్క, టాలీవుడ్ సినిమా, బాహుబలి హీరోయిన్, భాగమతి, అనుష్క కొత్త సినిమా నిశ్శబ్దం,అనుష్క నిశ్శబ్ధం ఫస్ట్ లుక్ రిలీజ్,నిశ్శబ్ధం,సైలెన్స్,అనుష్క శెట్టి సైలెన్స్ ఫస్ట్ లుక్ రిలీజ్
    OTT లో విడుదల కానున్న నిశ్శబ్దం Photo : Twitter


    ఈ నేపథ్యంలో 'నిశ్శబ్దం' సినిమాకి అమెజాన్ నుంచి భారీ ఆఫర్ వచ్చిందట. ఏప్పుడో విడుదలకావాల్సిన సినిమా అనుకున్న సమయానికి విడుదల కాకపోయేసరికి నెలకి లక్షల్లో వడ్డీలు కట్టుకుంటున్నారట నిర్మాతలు. కారణం అమెజాన్‌కు ఈ సినిమాను అమ్మాలంటే అనుష్క అనుమతి కూడా కావాలట. కానీ ఆమె మాత్రం డిజిటల్‌లో విడుదలకు అంగీకరించడం లేదట. దాంతో వడ్డీలు కట్టుకోలేక ఇబ్బందులు పడుతున్నారట నిర్మాతలు. మరోవైపు చిత్ర నిర్మాతలు అమెజాన్‌కు మరో కండిషన్ పెట్టారట. ఓటీటీలో ఈ సినిమాను  ప్రదర్శించినా.. లాక్‌డౌన్ తర్వాత థియేటర్స్‌లో కూడా రిలీజ్ చేసుకునేలా అనుమతి ఇవ్వాలని షరతు పెట్టారట. ఒకసారి ఓటీటీలో రిలీజైన తర్వాత థియేటర్స్‌లో సినిమాలు విడుదలైన ప్రేక్షకులు చూస్తారా అనే డౌటు కూడా  ఉంది. మొత్తానికి నిశ్శబ్ధం చిత్రం విషయంలో నిర్మాతలు అనుకున్నది సాధిస్తారా అనేది చూడాలి.  మరోవైపు మెగా హీరో వైష్ణవ్ తేజ్ నటించిన ‘ఉప్పెన’ చిత్రాన్ని కూడా ఓటీటీలో రిలీజ్ చేయడానికి అంతా సిద్దం అయినట్టు సమాచారం. మొత్తానికి కరోనా కారణంగా విడుదల ఆగిపోయిన చిత్రాలకు ఇపుడు ఓటీటీ ఫ్లాట్‌ఫామ్స్ పెద్ద దిక్కుగా మారింది.
    Published by:Kiran Kumar Thanjavur
    First published:

    Tags: Aha OTT Platform, Amazon prime, Anushka Shetty, Bollywood, Nishabdham Movie, Tollywood

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు