వాళ్లిద్దరికీ ఎప్పటికీ నా మదిలో చోటు.. అనుష్క శెట్టి..

సూపర్ నుంచి సింగం దాకా.. అరుంధతి నుంచి రుద్రమ దేవి దాకా.. ఏ పాత్ర అయినా.. అందులో చక్కగా ఒదిగిపోయే నటి  అనుష్క. ఇక ఆమె మదిలో వాళ్లిద్దరికీ ఎప్పటికీ చోటు ఉంటుందని చెప్పడం కొసమెరుపు.

Kiran Kumar Thanjavur | news18-telugu
Updated: November 7, 2019, 1:16 PM IST
వాళ్లిద్దరికీ ఎప్పటికీ నా మదిలో చోటు.. అనుష్క శెట్టి..
(Image : Twitter)
  • Share this:
సూపర్ నుంచి సింగం దాకా.. అరుంధతి నుంచి రుద్రమ దేవి దాకా.. ఏ పాత్ర అయినా.. అందులో చక్కగా ఒదిగిపోయే నటి  అనుష్క. అంతేకాదు ఆయా పాత్రలకు తన నటనతో నిండుదనం తెస్తుంది. ఇక రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా తెరకెక్కిన  ‘బాహుబలి’ సినిమాతో ఇండియా వైడ్‌గా ఫేమస్ అయింది.నటిగా 14 ఏళ్లు కంప్లీట్ చేసుకొని పదిహేనో ఏట అడుగుపెట్టింది. ఈ రోజు అనుష్క శెట్టి బర్త్ డే. ఈ సందర్భంగా ఆమె ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. కథానాయికగా ఎదగే క్రమంలో తనకు తోడ్పాటు అందించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపింది. అంతేకాదు  ముఖ్యంగా తనను వెండితెరకు పరిచయం చేసిన నాగార్జునతో పాటు, దర్శకుడు పూరీ జగన్నాథ్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపింది. ఇకపూరీ జగన్నాథ్ దర్శకత్వంలో నాగార్జున హీరోగా నటించిన ‘సూపర్’ సినిమాతో సూపర్‌గా ఎంట్రీ ఇచ్చి టాలీవుడ్‌లో ఆమెకంటూ ఒక ఐడెంటిటీ ఏర్పరుచుకుంది స్పీటీ శెట్టి ఉరఫ్ అనుష్క శెట్టి. ‘భాగమతి’ తర్వాత సినిమాలకు బ్రేక్ ఇచ్చిన ఈ భామ..హేమంత్ మధుకర్ దర్శకత్వంలో ‘నిశ్శబ్ధం’ సినిమా చేస్తోంది. ఈ సినిమా త్వరలో విడుదల కానుంది.

 

First published: November 7, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>