సైరా షూటింగ్‌లో అనుష్క శెట్టికి గాయం... స్పందించిన స్వీటి

నటి అనుష్క శెట్టి... ‘సైరా నరసింహారెడ్డి’ చిత్రంలో కీలక పాత్రను పోషిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ జ‌రుగుతున్న స‌మ‌యంలో అనుష్క గాయ‌ప‌డింద‌నే వార్త‌లు..అప్పట్లో హల్ చల్ చేసిన సంగతి తెలిసిందే. దీనిపై అనుష్క తాజాగా సోషల్‌ మీడియా ద్వారా స్పందించారు.

news18-telugu
Updated: June 28, 2019, 11:26 AM IST
సైరా షూటింగ్‌లో అనుష్క శెట్టికి గాయం... స్పందించిన స్వీటి
హీరోలతో సమానమైన క్రేజ్ సంపాదించుకున్న ఈ భామ.. ఇప్పుడు సంచలన నిర్ణయం తీసుకుందని తెలుస్తుంది.
  • Share this:
నటి అనుష్క శెట్టి... మెగాస్టార్‌ చిరంజీవి ప్రధాన పాత్రలో నటిస్తున్న ‘సైరా నరసింహారెడ్డి’ చిత్రంలో కీలక పాత్రను పోషిస్తున్నారు. ఈ సినిమాను స్వయంగా రామ్ చరణ్ నిర్మిస్తుంటే సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. అయితే..ఈ సినిమా షూటింగ్ జ‌రుగుతున్న స‌మ‌యంలో అనుష్క గాయ‌ప‌డింద‌నే వార్త‌లు..అప్పట్లో హల్ చల్ చేసిన సంగతి తెలిసిందే. ఆ సినిమాలోని కొన్ని ముఖ్యమైన సీన్స్‌ను చిత్రీకరిస్తున్న సమయంలో అనుష్క కాలికి గాయాలయ్యాయని..దీంతో ఆమెకు చికిత్స చేసిన వైద్యులు కొన్ని వారాలపాటు విశ్రాంతి తీసుకోవాలని సూచించినట్లు వార్తలు చక్కర్లు కొట్టాయి. దీనిపై అనుష్క తాజాగా సోషల్‌మీడియా ద్వారా స్పందించారు. ఆమె తన సోషల్ మీడియా ఇన్‌స్టాగ్రామ్‌లో రాస్తూ.. ‘నేను ఆరోగ్యంగానే ఉన్నాను. అంతేకాదు సియాటిల్‌లో సంతోషంగా షూటింగ్‌లో పాల్గొంటున్నాను..అని తెలిపారు అనుష్క.








View this post on Instagram





😘😘


A post shared by Anushka Shetty (@anushkashettyofficial) on





అనుష్క.. ప్రస్తుతం ‘సైలెన్స్‌’ అనే మరో  సినిమా కూడా చేస్తున్నారు. ఈ సినిమాకు హేమంత్‌ మధుకర్‌ దర్శకత్వం వహిస్తున్నారు. నటుడు మాధవన్‌ కూడా ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. ప్రస్తుతం..ఈ సినిమా అమెరికాలోని సియాటిల్‌లో చిత్రీకరణ జరుపుకుంటోంది.
Published by: Suresh Rachamalla
First published: June 28, 2019, 11:11 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading