అనుష్క శెట్టి చాలా ఏళ్ల తర్వాత ‘భాగమతి’ తర్వాత సైలెంట్‌గా ‘నిశ్శబ్ధం’ సినిమా చేస్తోంది. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ఫస్ట్ లుక్, టీజర్ అన్నింటికి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమాను తెలుగులో ‘నిశ్శబ్ధం’తో తెరకెక్కుతుండగా.. మిగిలిన భాషల్లో ‘సైలెన్స్’ పేరుతో తెరకెక్కింది. ఈ సినిమాలో అనుష్క శెట్టి సాక్షి అనే మూగ ఆర్టిస్ట్ పాత్రలో నటిస్తోంది. ఈ సినిమాను మంచు విష్ణుతో ‘వస్తాడు నారాజు’ సినిమా రూపొందించిన హేమంత్ మధుకర్ డైరెక్ట్ చేసాడు. పేరుకు తగ్గట్టుగానే ఈ సినిమా ఓ సైలెన్స్ థ్రిల్లర్. మూకీ సినిమాగా ‘నిశ్శబ్దం’ రూపొందబోతోంది. పరిస్థితులు బాగుంటే ఇప్పటికే ఈ సినిమా విడుదలయ్యేది. కానీ కరోనా మహామ్మారి కారణంగా ప్రస్తుతం థియేటర్స్ బంద్ కొనసాగుతోంది. ప్రస్తుతం నెలకొన్న భయానక పరిస్థితుల నేపథ్యంలో ఈ సినిమా ఎపుడు విడుదలవుతుందో చెప్పడం కాస్త కష్టమే. ఒకవేళ లాక్డౌన్ ముగిసి అంతా కుదురుకున్నాకా.. ప్రజలు థియేటర్స్ వైపు చూసే అవకాశాలు ఎక్కువగా లేవు. ఈ సినిమాను థియేటర్స్‌లో కాకుండా డైరెక్ట్‌గా ఓటీటీ ఫ్లాట్‌పామ్‌లో ప్రదర్శించబోతున్నారంటూ వార్తలు సోసల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. దీనిపై చిత్ర హీరోయిన్ అనుష్కతో పాటు చిత్ర యూనిట్ స్పందించింది.
ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ ద్వారా విడుదల చేయనున్నట్టు వస్తున వార్తల్లో ఎలాంటి వాస్తవం లేదు. అలాంటి వార్తలను నమ్మవద్దు అంటూ అధికారికంగా తెలియజేసారు. ఈ చిత్రం మొదలైనప్పటి నుంచి సినిమాకు పనిచేసిన ప్రతి ఒక్కరూ ఎంతగానే సపోర్ట్ అందించారు. ముఖ్యంగా అనుష్క అందించిన సహకారం మరవలేనిదంటూ చిత్ర యూనిట్ పేర్కొంది. ఒకవేళ ఈ సినిమాపై మేము ఏదైనా నిర్ణయం తీసుకుంటే మాత్రం ఖచ్చితంగా అధికారికంగా తెలియజేస్తామన్నారు. మేము చెప్పే వరకు ఎలాంటి రూమర్స్ నమ్మవద్దని రిక్వెస్ట్ చేసారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Anushka Shetty, Bollywood, Tollywood