అనుష్క ఖాతాలో మరో రికార్డు.. ఇన్‌స్టాగ్రామ్‌లో జేజమ్మకు పెరిగిన ఫాలోవర్స్..

సూపర్ నుంచి సింగం దాకా.. అరుంధతి నుంచి రుద్రమ దేవి దాకా.. ఏ క్యారెక్టరయినా.. పర్ఫెక్ట్ గా యాక్ట్ చేసే కథానాయిక ఎవరంటే అందరికీ ఠక్కున గుర్తుకు వచ్చే పేరు అనుష్క శెట్టిదే. ఇక నటిగా విభిన్న పాత్రలు చేస్తోన్న అనుష్క శెట్టి తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో 3 మిలియన్ ఫాలోవర్స్ సంపాదించుకుంది.

news18-telugu
Updated: May 6, 2020, 10:53 AM IST
అనుష్క ఖాతాలో మరో రికార్డు.. ఇన్‌స్టాగ్రామ్‌లో జేజమ్మకు పెరిగిన ఫాలోవర్స్..
అనుష్క శెట్టి (Instagram/Photo)
  • Share this:
సూపర్ నుంచి సింగం దాకా.. అరుంధతి నుంచి రుద్రమ దేవి దాకా.. ఏ క్యారెక్టరయినా.. పర్ఫెక్ట్ గా యాక్ట్ చేసే కథానాయిక ఎవరంటే అందరికీ ఠక్కున గుర్తుకు వచ్చే పేరు అనుష్క శెట్టిదే. ఇక నటిగా విభిన్న పాత్రలు చేస్తోన్న అనుష్క శెట్టి తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో 3 మిలియన్ ఫాలోవర్స్ సంపాదించుకుంది. సోషల్ మీడియాలో అంతగా  యాక్టివ్‌గా ఉండని అనుష్క శెట్టికి ఇన్‌స్టాగ్రామ్‌లో ఇంత మంది ఫాలోవర్స్ ఉండటం విశేషం. తాజాగా అనుష్క.. నిశ్శబ్ధం సినిమాలో పెయింటింగ్ వేస్తోన్న ఫోటో షేర్ చేసి తన ఫ్యాన్స్‌కు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపింది. కరోనా మహామ్మారి కోరలు చాస్తున్న ఈ సమయంలో అందరు ఇంట్లోనే ఉండాలని పిలునిచ్చారు అనుష్క శెట్టి. ఈ సినిమాలో అనుష్క శెట్టి సాక్షి అనే మూగ ఆర్టిస్ట్ పాత్రలో నటిస్తోంది. ఈ సినిమాను మంచు విష్ణుతో ‘వస్తాడు నారాజు’ సినిమా రూపొందించిన హేమంత్ మధుకర్ డైరెక్ట్ చేసాడు. పేరుకు తగ్గట్టుగానే ఈ సినిమా ఓ సైలెన్స్ థ్రిల్లర్. మూకీ సినిమాగా ‘నిశ్శబ్దం’ తెరకెక్కింది. ప్రస్తుతం ఈ భామ.. పవన్ కళ్యాణ్, క్రిష్ సినిమాలో హీరోయిన్‌గా నటించేందకు ఓకే చెప్పినట్టు సమాచారం.
 View this post on Instagram
 

Thank you all for the unconditional Love & support always forever❤️ Hope u all stay safe at home and responsible 😊


A post shared by AnushkaShetty (@anushkashettyofficial) on
First published: May 6, 2020, 10:53 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading