పవన్ కళ్యాణ్‌కు జోడిగా అనుష్క శెట్టి.. మరి బాలీవుడ్ భామ పరిస్థితి..

పవన్ కళ్యాణ్ హీరోగా క్రిష్ దర్శకత్వంలో ఓ పిరియాడిక్ ఫిల్మ్ వస్తోన్న సంగతి తెలిసిందే.

news18-telugu
Updated: April 7, 2020, 9:24 AM IST
పవన్ కళ్యాణ్‌కు జోడిగా అనుష్క శెట్టి.. మరి బాలీవుడ్ భామ పరిస్థితి..
పవన్ కళ్యాణ్, అనుష్క శెట్టి (Pawan Kalyan Anushka Shetty)
  • Share this:
పవన్ కళ్యాణ్ హీరోగా క్రిష్ దర్శకత్వంలో ఓ పిరియాడిక్ ఫిల్మ్ వస్తోన్న సంగతి తెలిసిందే. ఆంగ్లేయుల కాలంతో ముడిపడిన కథ ఇది. ఆంగ్లేయుల కాలంలో పేదల కోసం దోపిడీలు చేసే పాత్రలో పవన్ కనిపించనున్నాడు. ఈ సినిమా కథ రాబిన్ హుడ్ తరహాలో సాగుతుందని సమాచారం. ఈ చిత్రానికి 'విరూపాక్ష' అనే టైటిల్ ప్రచారంలో ఉంది. పాపులర్ ప్రొడ్యూసర్ ఏ ఎమ్ రత్నం భారీ ఎత్తున ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. కీరవాణి సంగీతం అందిస్తున్నాడు. హిందీ హీరోయిన్ జాక్విలిన్ ఫెర్నాండెజ్‌ పవన్ సరసన నటించనుందని మొన్నటి వరకు వార్తలొచ్చాయి. అయితే తాజాగా మరో ఇంట్రెస్టింగ్ వార్త హల్ చల్ చేస్తోంది. ఈ సినిమాలో హీరోయిన్ పాత్రకిగాను మొదట కీర్తి సురేష్ పేరు వినిపించింది. ఆ తరువాత జాక్విలిన్ పేరు తెరపైకి వచ్చింది. తాజాగా అనుష్క శెట్టి పేరు వినిపిస్తోంది. గతంలో క్రిష్ దర్శకత్వంలో అనుష్క 'వేదం' సినిమాలో వేశ్యా పాత్రలో అదరగొట్టిన సంగతి తెలిసిందే. ఆ సినిమాలో ఆపాత్రకు అనుష్కకు మంచి పేరు తెచ్చిపెట్టింది. అది అలా ఉంటే పవన్ సినిమాలో అనుష్క అయితే సరిగ్గా సరిపోతుందని క్రిష్ భావిస్తున్నాడట.

అందులో భాగంగా ఆమెను తీసుకున్నాడని అంటున్నాయి ఇండస్ట్రీ వర్గాలు. కాగా ఇప్పటికే ఓ షెడ్యూల్ పూర్తిచేసుకున్న విరూపాక్ష షూటింగ్ కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా ప్రస్తుతం వాయిదా పడింది. ఇక ఓ ఐటెమ్ సాంగ్‌లో రామ్ చరణ్ బ్లాక్ బస్టర్ సినిమా రంగస్థలంలో ఆది పినిశెట్టికి లవ్ ఇంట్రెస్ట్‌గా చేసిన పూజిత పొన్నాడ కనిపించనుందట. ఓ భారీ సెట్ లో ఇప్పటికే పూజితపై సాంగ్ షూటింగ్ కూడా పూర్తయిందని సమాచారం.
First published: April 7, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading