అనుష్క ‘సైరా’ అంటుందా.. చిరంజీవి రుణం తీర్చుకుంటుందా ?

సైరా సినిమాకు ఇంట్రో వాయిస్ ఇచ్చే విషయంలో అందాల భామ అనుష్క ఎటూ తేల్చడం లేదని టాలీవుడ్ సర్కిల్స్‌లో ప్రచారం జరుగుతోంది.

news18-telugu
Updated: April 23, 2019, 12:05 PM IST
అనుష్క ‘సైరా’ అంటుందా.. చిరంజీవి రుణం తీర్చుకుంటుందా ?
అనుష్క శెట్టి(ఫైల్ ఫోటో)
  • Share this:
మెగా అభిమానులు, టాలీవుడ్ మూవీ లవర్స్ ఎంతగానో ఎదురుచూస్తున్న సైరా సినిమా షూటింగ్ జెడ్ స్పీడ్‌గా సాగుతోంది. ఈ సినిమాను ఎలాగైనా ఈ ఏడాది దసరాకు విడుదల చేయాలనే పట్టుదలతో ఉన్న నిర్మాత రామ్ చరణ్... ఈ మేరకు దర్శకుడు సురేందర్ రెడ్డిపై ఒత్తిడి తీసుకొస్తున్నారనే వార్తలు కూడా కొంతకాలంగా వినిపిస్తున్నాయి. సురేందర్ రెడ్డి సైతం దసరాకు సినిమా విడుదల చేసేలా షూటింగ్‌ను ప్లాన్ చేసుకున్నారని తెలుస్తోంది. అయితే ఈ సినిమాకు వాయిస్ ఇచ్చే విషయంలో అందాల భామ అనుష్క ఎటూ తేల్చడం లేదని సినీవర్గాల్లో చర్చ జరుగుతోంది.

సినిమా కథను ఆడియెన్స్‌కు పరిచయం చేసే నరేటర్‌గా అనుష్కను ఎంచుకున్న చిత్ర దర్శకనిర్మాతలు... ఈ మేరకు ఆమెతో చర్చలు కూడా జరిపారని సమాచారం. అయితే ఇప్పటివరకు ఇందుకు సంబంధించి ఆమె నుంచి ఎలాంటి గ్రీన్ సిగ్నల్ రాలేదని గుసగుసలు వినిపిస్తున్నాయి. నరేటర్‌గా వాయిస్ ఇవ్వడంతో పాటు మధ్యలో ఒక చిన్న పాత్రను కూడా మూవీ మేకర్లు అనుష్కకు ఆఫర్ చేశారనే ప్రచారం జరుగుతోంది. గతంలో అనుష్క ప్రధాన పాత్రలో నటించిన రుద్రమదేవి సినిమాకు చిరంజీవి వాయిస్ ఇచ్చారు. ఆ సినిమాకు అది కొంతమేర కలిసొచ్చింది కూడా. మరి... అప్పట్లో తన సినిమాకు మెగాస్టార్ చేసిన సాయానికి మంగళూరు ముద్దుగుమ్మ రుణం తీర్చుకుంటుందా లేక సైరా వాయిస్ ఆఫర్‌ను లైట్ తీసుకుంటుందా అన్నది టాలీవుడ్‌లో సస్పెన్స్‌గా మారింది.
First published: April 23, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...