Nishabdham Trailer : అనుష్క శెట్టి ప్రధాన పాత్రలో నటిస్తోన్న చిత్రం 'నిశ్శబ్దం'. ఇటు తెలుగుతో పాటు తమిళ్లో కూడా తెరకెక్కుతోన్న ఈ సినిమా ట్రైలర్ తాజాగా విడుదలైంది.
Nishabdham Trailer : అనుష్క శెట్టి ప్రధాన పాత్రలో నటిస్తోన్న చిత్రం 'నిశ్శబ్దం'. ఈ సినిమా ఇటు తెలుగుతో పాటు తమిళ్లో కూడా తెరకెక్కుతోంది. ‘భాగమతి’ తర్వాత అనుష్క శెట్టి చేస్తోన్న ఈ సినిమాపై మంచి అంచనాలున్నాయి. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ఫస్ట్ లుక్కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమా తెలుగులో ‘నిశ్శబ్ధం’తో తెరకెక్కుతుండగా.. మిగిలిన భాషల్లో ‘సైలెన్స్’ పేరుతో తెరకెక్కింది. కాగా తాజాగా ఈ సినిమాకు సంబందించిన ట్రైలర్ విడుదలైంది. అనుష్క ఈ సినిమాలో సాక్షి అనే మూగ ఆర్టిస్ట్ పాత్రలో నటిస్తోంది. ఈ సినిమాను మంచు విష్ణుతో ‘వస్తాడు నారాజు’ సినిమా రూపొందించిన హేమంత్ మధుకర్ డైరెక్ట్ చేసాడు. పేరుకు తగ్గట్టుగానే ఈ సినిమా ఓ సైలెన్స్ థ్రిల్లర్గా వస్తోంది. ట్రైలర్లో విజువల్స్.. అదిరాయి. సైగలతో అనుష్క చేసే నటన ఆకట్టుకుంటోంది. ఈ సినిమాలో అనుష్క శెట్టితో పాటు తమిళ నటుడు మాధవన్, హాలీవుడ్ నటుడు మ్యాడ్సన్... ‘అర్జున్ రెడ్డి’ ఫేమ్ షాలినీ పాండే, హీరోయిన్ అంజలి, అవసరాల శ్రీనివాస్ వంటి తారలు నటిస్తున్నారు. 'నిశ్శబ్దం' పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, కోన ఫిలిం కార్పొరేషన్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. మొదటిసారి అనుష్క మూగ పాత్రలో నటిస్తుండటం, మాధవన్ వంటి మోస్ట్ టాలెంటెడ్ యాక్టర్ ఓ పాత్రను పోషించడంతో నిశ్శబ్దంపై అంచనాలు పెరిగాయి. పూర్తిగా అమెరికాలో చిత్రీకరంచిన తొలి సినిమాగా రికార్డులు క్రియేట్ చేయడంతో అంచనాలు ఓ రేంజ్లో ఉన్నాయి. ఏప్రిల్ రెండున ప్రపంచ వ్యాప్తంగా విడుదలకానుంది.
Published by:Suresh Rachamalla
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.