ANUSHKA SHETTY NISHABDHAM MOVIE TEASER RELEASED AND SWEETY COMING UP WITH SILENT THRILLER PK
అనుష్క శెట్టి ‘నిశ్శబ్ధం’ టీజర్.. ఇచ్చట అందరూ అనుమానితులే..
నిశ్శబ్ధం టీజర్
‘భాగమతి’ తర్వాత అనుష్క శెట్టి చాలా సైలెంట్‌గా ‘నిశ్శబ్ధం’ సినిమా చేస్తోంది. ఈ సినిమాపై పెద్దగా వార్తలు కూడా బయటికి రావడం లేదు. చాలా రోజులు గ్యాప్ తీసుకుని అనుష్క చేస్తున్న సినిమా కావడంతో..
‘భాగమతి’ తర్వాత అనుష్క శెట్టి చాలా సైలెంట్‌గా ‘నిశ్శబ్ధం’ సినిమా చేస్తోంది. ఈ సినిమాపై పెద్దగా వార్తలు కూడా బయటికి రావడం లేదు. చాలా రోజులు గ్యాప్ తీసుకుని అనుష్క చేస్తున్న సినిమా కావడంతో అభిమానులు కూడా నిశ్శబ్ధంపై ఆసక్తి పెరిగిపోతుంది. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక ఇప్పుడు టీజర్ విడుదల చేసారు. నవంబర్ 8న అనుష్క పుట్టిన రోజు సందర్భంగా నిశ్శబ్ధం టీజర్ విడుదల చేసారు దర్శక నిర్మాతలు. ఈ సినిమాను తెలుగులో ‘నిశ్శబ్ధం’తో తెరకెక్కుతుండగా.. మిగిలిన భాషల్లో ‘సైలెన్స్’ పేరుతో తెరకెక్కుతుంది.
తాజాగా ఈ టీజర్లో అనుష్క క్యారెక్టర్‌కు సంబంధించిన కథ అంతా చెప్పేసాడు దర్శకుడు హేమంత్ మధుకర్. సినిమా అంతా అమెరికాలోనే షూటింగ్ జరుపుకుంది. టీజర్లో అనుష్కకు ఏదో యాక్సిడెంట్ అవ్వడం.. అన్ని కారెక్టర్స్ రివీల్ చేయడం.. అందర్ని అనుమానితులుగానే చూపించడం చేసాడు దర్శకుడు. పైగా ఇందులో అనుష్క డెఫ్ అండ్ డమ్ కారెక్టర్ చేస్తుంది. ఇప్పటి వరకు తన కెరీర్లో ఎప్పుడూ చేయని పాత్ర కావడంతో అనుష్క కూడా ఈ సినిమా కోసం ఆసక్తిగా చూస్తుంది. త్వరలోనే విడుదల కానుంది ఈ చిత్రం.
అనుష్క శెట్టితో పాటు ఈ సినిమాలో మాధవన్, హాలీవుడ్ నటుడు మ్యాడ్సన్... ‘అర్జున్ రెడ్డి’ ఫేమ్ షాలినీ పాండే, హీరోయిన్ అంజలి, అవసరాల శ్రీనివాస్, సుబ్బరాజు వంటి స్టార్ నటులు ఈ సినిమాలో కనిపించబోతున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, కోన ఫిలిం కార్పొరేషన్ పతకాలపై ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇప్పటికే ‘వర్ణ’, ‘సైజ్ జీరో’ వంటి ప్రయోగాత్మక చిత్రాల్లో నటించి నటిగా నిరూపించుకున్న అనుష్క... మరోసారి ‘సైలెంట్’గా తన టాలెంట్ చూపించడానికి ముస్తాబవుతుంది.
Published by:Praveen Kumar Vadla
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.