కరోనా మహమ్మారి కారణంగా ఏర్పడ్డ లాక్ డౌన్‌తో సినిమా షూటింగ్స్‌తో పాటు థియేటర్స్ కూడా మూత పడ్డాయి. అయితే ఈ లాక్ డౌన్ తొలగించిన కూడా జనాలు సినిమా థియేటర్స్‌కు వచ్చి సినిమా చూసే పరిస్థితి ఎంతవరకు ఉంటుందో తెలియదు. అయితే ఓ సినిమా అనుకున్న సమయానికి విడుదల కాకపోతే తీవ్ర నష్టాలను ఎదుర్కోవాల్సీ వస్తుంది. దీంతో ఈ నష్టాల నుంచి.. ఈ పరిస్థితి నుంచి ఎలా గట్టెక్కాలా అని ఫిలిం మేకర్స్ తీవ్రంగా ఆలోచిస్తున్నారు. అదే సమయంలో ఓటీటీ ప్లాట్ ఫామ్ లు పుంజుకున్నాయి. ఈ లాక్ డౌన్ కారణంగా ఓటీటీ సంస్థలకు భారీగా సబ్ స్క్రైబర్ల సంఖ్య పెరుగుతోంది. దీనికి తోడు అంతకుమించిన భారీ వ్యూయర్ షిప్ అందుతోంది. ఈ సంస్థలు కూడా ఓ సినిమాకు మంచి ఆదరణ ఉంటుందని భావిస్తే మంచి ఆఫర్‌ను నిర్మాత ముందుంచుతున్నారు. అందులో భాగంగా తెలుగులో ప్రస్తుతం చాలా సినిమాలు ఓటీటీలో విడుదలవుతున్నాయి. అందులో భాగంగా నాని, సుధీర్ బాబు నటించిన వి ఓటీటీలో విడుదలకానుంది. ఈ సినిమా ఈనెల 5న అమెజాన్ ప్రైమ్ లో విడుదలకానుంది. ఇప్పుడు ఇదే బాటలో తెలుగులో చాలా సినిమాలు ఓటీటీలో విడుదలకానున్నాయి. అందులో భాగంగా అనుష్క ప్రధాన పాత్రలో నటించిన నిశ్శబ్దం సినిమాకు కూడా డీల్ కుదిరిందని.. త్వరలోనే ఈ సినిమా కూడా అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమ్ కానుందని సమాచారం.
హేమంత్ మధుకర్ దర్శకత్వంలో అనుష్క ప్రధాన పాత్రధారిగా ఈ చిత్రాన్ని ప్రముఖ రచయిత కోన వెంకట్ నిర్మించాడు. అయితే అనుకున్న షెడ్యూల్ ప్రకారం ఈ సినిమా ఏప్రిల్ నెలలోనే విడుదల కావాల్సింది. కానీ లాక్ డౌన్ వల్ల థియేటర్లు మూతబడడంతో విడుదల ఆగిపోయింది. ఇక ఇప్పట్లో థియేటర్లు తెరుచుకోవడం అయ్యేపనికాదన్న విషయం తేలిపోవడంతో, ఇన్నాళ్లూ ఆగిన నిర్మాత ఇటీవలే అమెజాన్ ప్రైమ్ వీడియోస్ కి చిత్రాన్ని స్ట్రీమింగ్ కోసం ఇచ్చేసినట్టు తెలుస్తోంది. ఈ సినిమాను అమోజాన్ ప్రైమ్ దాదాపు 25 కోట్ల పెట్టి స్ట్రీమింగ్ రైట్స్ దక్కించుకుందని సమాచారం అందుతోంది. దీనికి సంబందించిన పూర్తి వివరాలు అతి త్వరలో వెల్లడికానున్నాయి.
Published by:Suresh Rachamalla
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.