హోమ్ /వార్తలు /సినిమా /

అనుష్క కొత్త సినిమా రిలీజ్‌కు లైన్ క్లియర్ ?

అనుష్క కొత్త సినిమా రిలీజ్‌కు లైన్ క్లియర్ ?

అనుష్క శెట్టి: వయసు 40 వరకు వచ్చినా కూడా అనుష్క కూడా పెళ్లి టాపిక్ తీయట్లేదు.

అనుష్క శెట్టి: వయసు 40 వరకు వచ్చినా కూడా అనుష్క కూడా పెళ్లి టాపిక్ తీయట్లేదు.

అనుష్క నయా మూవీ నిశ్శబ్దం విడుదలపై ఓ క్లారిటీ వచ్చినట్టు సినీవర్గాల్లో టాక్ వినిపిస్తోంది.

అనుష్క ప్రధాన పాత్రలో నటించిన నిశ్శబ్దం సినిమా ధియేటర్లలో విడుదలవుతుందా లేక అంతకంటే ముందే డిజిటిల్ ఫ్లాట్‌ఫాంలో ఆడియెన్స్ ముందుకు వస్తుందా అనే అంశంపై కొంతకాలంగా సస్పెన్స్ కొనసాగుతోంది. చాలా నెలల నుంచి వాయిదా పడుతూ వస్తున్న ఈ సినిమాను ఓటీటీలోనే విడుదల చేసేందుకు నిర్మాతలు ఓకే చెప్పినట్టు తెలుస్తోంది. గతంలో ఈ అంశంపై తర్జనభర్జన పడిన నిర్మాతలు... తాజాగా ఈ సినిమాను అమెజాన్‌లో విడుదల చేయాలని నిర్ణయించుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ చిత్రాన్ని ఆమెజాన్‌లో జూన్‌ నెలలో విడుదల చేయాలని దర్శకనిర్మాతలు భావిస్తున్నారని సమాచారం. ఈ సినమాకు డిజిటల్‌ హక్కులను ఆమెజాన్‌ రికార్డ్ స్థాయి రేటుకు కొనగోలు చేసిందని టాలీవుడ్‌లో ప్రచారం జరుగుతోంది. ఇక రిలీజ్ విషయం అధికారికంగా చిత్ర యూనిట్ వెల్లడించాల్సిన అవసరం ఉంది. హేమంత్ మధుకర్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో అంజలి, షాలిని పాండే, సుబ్బరాజు, అవసరాల శ్రీనివాస్ నటించారు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, కేఎఫ్‌సీ ఎంటర్‌టైన్‌మెంట్స్ ఈ సినిమాను నిర్మించింది.

First published:

Tags: Anushka Shetty

ఉత్తమ కథలు