Anushka Shetty : అనుష్క నవీన్‌ల సినిమా ఆగిపోయిందా.. కారణం ఆమెనా..

Anushka Naveen-Polishetty Photo : Instagram

Anushka Shetty : నవీన్ పొలిశెట్టి ఈ పేరును ఇప్పుడు కొత్తగా పరిచయం చేయాల్సిన పనిలేదు. ఏజెంట్‌ సాయి శ్రీనివాస ఆత్రేయ, జాతి రత్నాలు సినిమాలతో తెలుగువారికి చాలా దగ్గరయ్యారు.

  • Share this:
    నవీన్ పొలిశెట్టి ఈ పేరును ఇప్పుడు కొత్తగా పరిచయం చేయాల్సిన పనిలేదు. ఏజెంట్‌ సాయి శ్రీనివాస ఆత్రేయ, జాతి రత్నాలు సినిమాలతో తెలుగువారికి చాలా దగ్గరయ్యారు. నవీన్ జాతిరత్నాలు సినిమా తర్వాత యూవీ క్రియేషన్స్’లో అనుష్క సరసన ఓ సినిమాను చేస్తున్నట్లు ఇటీవల ఓ సినిమా వార్త హల్ చల్ చేసిన సంగతి తెలిసిందే. చాలా రోజులకు అనుష్క ఈ సినిమా చేస్తుందని.. ఇది ఆమె కమ్ బ్యాక్ సినిమా అవుతుందని అన్నారు. అనుష్క ప్రభాస్ సరసన రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ‘బాహుబలి’ సిరీస్‌ తర్వాత ‘భాగమతి, నిశ్శబ్దం’ సినిమాలను చేసింది. ఈ సినిమాల తర్వాత ఎటువంటి సినిమాలను ఒప్పుకోలేదు. ఇన్నాళ్లకు ఆమె నవీన్‌తో ఓ సినిమాను ఓకే చేసిందని టాక్ వచ్చింది. కథ కూడా సిద్ధంగా ఉందని.. ఈ సినిమాకు ఇద్దరి పేర్లు కలిసొచ్చేలా ‘మిస్. శెట్టి.. మిస్టర్.. పోలిశెట్టి’ అనే టైటిల్ నిర్ణయించారని వార్తలు రాగా ఈ సినిమా ఆగిపోయిందని తెలుస్తోంది. ఈ సినిమాని యూవీ క్రియేషన్స్ నిర్మించాల్సి ఉండగా.. ప్రస్తుతం ఈ సినిమాను హోల్డ్ చేశారని అంటున్నారు.

    ప్రయోగాత్మక చిత్రంగా వస్తున్న ఈ సినిమాను కొంత పరిమిత బడ్జెట్లో నిర్మించాలి అని అనుకున్నారట దర్శక నిర్మాతలు. అయితే.. అనుష్క ఈ సినిమాకు కాస్తా భారీ పారితోషికాన్ని డిమాండ్ చేయడం ఒక అంశం కాగా.. నవీన్ పొలిశెట్టి కూడా వరుస సినిమాలతో బిజీగా ఉండడంతో.. ఈ సినిమా ఇప్పట్లో మొదలు అయ్యే అవకాశం లేదని.. అంటున్నాయి ఇండస్ట్రీ వర్గాలు.. చూడాలి మరి ఈ వార్తల్లో నిజం ఎంతో..




    ఇక నవీన్ పొలిశెట్టి విషయానికి వస్తే.. జాతిరత్నాలు సినిమాతో బంపర్ హిట్ కొట్టిన ఈ యువ హీరో ప్రస్తుతం టాలీవుడ్‌లో ఇప్పుడో హాట్ కేక్‌గా మారారు. ఈ సినిమాతో పాటు నవీన్ స్టార్ ప్రోడ్యూసర్ దిల్‌ రాజు ప్రొడక్షన్స్‌లో ఓ సినిమాను చేయనున్నారని తెలుస్తోంది. ఈ సినిమాను అనుదీప్ దర్శకత్వం వహించనున్నారట. ఈ రెండు సినిమాలతో పాటు నవీన్ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌లో ఓ సినిమాను చేయబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. నవీన్ సూపర్ స్టార్ మహేష్ బ్యానర్‌లో ఓ సినిమాకు సై అన్నట్లు టాక్ నడుస్తోంది. ఈ విషయంలో అధికారిక ప్రకటన విడుదలకావాల్సి ఉంది.
    Published by:Suresh Rachamalla
    First published: