Anushka Shetty Miss Shetty Mr Polishetty : అనుష్క శెట్టి, నవీన్ పోలిశెట్టి ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’.పి మహేష్ కుమార్ డైరెక్ట్ చేసిన ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్ బ్యానర్ రూపొందించింది. ఉగాది పండగ సందర్భంగా ఈ చిత్రం నుంచి ఫస్ట్ లిరికల్ సాంగ్ నువిడుదల చేశారు. రధన్ సంగీత అందించిన ఈ గీతాన్ని అనంత్ శ్రీరామ్ రాయగా.. ఎమ్ఎమ్ మానసి ఆలపించారు. ‘పుత్తడి బొమ్మ కోవెల కొమ్మ.. పెద్ద అడుగే వేసిందే.. పద్ధతులన్నీ సంకెళలంటూ తెంచుకుంటూ నడిచిందే.. సన్నాయే వద్దంటా.. మంత్రాలొద్దంటా..పేరంటాలే పడదంటా..’ అంటూ సాగే ఈ గీతం హీరోయిన్ క్యారెక్టరైజేషన్ ను తెలియజేసేలా ఉంది. స్నేహం, మోహం, బంధం, అనుబంధం ఏవీ వద్దనుకునేలాంటి పాత్రలో అనుష్కశెట్టి నటిస్తోందని ఈ పాట చూస్తే అర్థం అవుతోంది. అటు రధన్ అందించిన ట్యూన్ కూడా చాలా క్యాచీగా వినగానే ఆకట్టుకునేలా ఉంది. ఆ ట్యూన్ అంతే అందంగా పాడింది ఎమ్ఎమ్ మానసి. పాటను బట్టి చూస్తే హీరోయిన్ పై సాగే మాంటేజ్ సాంగ్ అని తెలుస్తోంది.
ఇక ఈ వేసవి బరిలో తెలుగుతో పాటు తమిళ్, మళయాల, కన్నడ భాషల్లో విడుదల కాబోతోన్న ఈ మూవీ ప్రమోషన్స్ ను ఈ పాట ఓ కొత్త ఊపుతో మొదలుపెట్టింది. త్వరలోనే రిలీజ్ డేట్ అనౌన్స్ చేసి ప్రమోషన్స్ లో దూకుడు పెంచబోతున్నారు. భాగమతి వంటి బ్లాక్ బస్టర్ తర్వాత యూవీ క్రియేషన్స్ లో అనుష్క శెట్టి నటించిన సినిమాగానూ.. స్వీటీ గ్యాప్ తర్వాత నటించిన చిత్రం కావడంతో మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టిపై మంచి అంచనాలే ఉన్నాయి.
Status: Single and loving it! ????
The anthem for every single woman is out now! Anvitha ravali shetty says #NoNoNo... What about you?#MissShettyMrPolishetty Tamil - https://t.co/PvdqnFmJYs@MsAnushkaShetty @NaveenPolishety @filmymahesh @radhanmusic #NiravShah pic.twitter.com/RTWlQVf2m7 — UV Creations (@UV_Creations) March 22, 2023
ఇక మరోవైపు ఏజెంట్ సాయిశ్రీనివాస ఆత్రేయ, జాతిరత్నాలు సినిమాలతో యువతరంతో పాటు అన్ని వర్గాల ప్రేక్షకుల చేత మంచి నటుడుగా ప్రశంసలు అందుకున్న నవీన్ పోలిశెట్టి కూడా కాస్త గ్యాప్ తర్వాత వస్తోన్న సినిమా ఇది. ఇక టైటిల్ తోనే భారీ అంచనాలు పెంచిన ఈ చిత్రం ఈ వేసవికి తెలుగుతో పాటు తమిళ్, కన్నడ, మళయాల భాషల్లో విడుదల కాబోతోంది.
ఇక ఓ మంచి పాటతో మెప్పించిన మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టిలోని ఈ గీతాన్ని కంపోజ్ చేసింది : రధన్, లిరిక్స్ : అనంత శ్రీరామ్, సింగర్ : ఎమ్ఎమ్ మానసి, ర్యాప్ పర్ఫార్మెన్స్ : లేడీ కాష్.బ్యానర్ : యూవీ క్రియేషన్స్ ప్రొడక్షన్ డిజైనర్ : రాజవీన్, విఎఫ్ఎక్స్ సూపర్ వైజర్ : రాఘవ్ తమ్మారెడ్డి సంగీతం : రధన్ సినిమాటోగ్రఫీ : నీరవ్ షా పిఆర్వో : జీఎస్కే మీడియా నిర్మాతలు : వంశీ - ప్రమోద్ - విక్రమ్ రచన, దర్శకత్వం : పి. మహేష్ కుమార్.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.