Anushka Shetty : చంద్రముఖి సీక్వెల్‌లో అనుష్క శెట్టి.. నవీన్‌ పొలిశెట్టి సినిమా ఆగినట్లేనా..

అనుష్క శెట్టి (Anushka Shetty/ Twitter)

Anushka Shetty : అనుష్క శెట్టి గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. తన అందచందాలతో నటనతో కూడా ఆకట్టుకున్న అందాల తార. అయితే ‘బాహుబలి’ సిరీస్‌ తర్వాత ‘భాగమతి, నిశ్శబ్దం’ వంటి సినిమాల తర్వాత ఆమె ఏ సినిమాను ఓకే చేయలేదు.

  • Share this:
    అనుష్క శెట్టి (Anushka Shetty) గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. తన అందచందాలతో నటనతో కూడా ఆకట్టుకున్న అందాల తార. అనుష్క డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ దర్శకత్వంలో వచ్చిన సూపర్ సినిమాతో తెలుగు సినిమాలకు పరిచయమై అనతి కాలంలోనే దక్షిణాదిలో టాప్ హీరోయిన్ హోదా సంపాదించారు. అనుష్క ఈ మధ్య సినిమాల్లో నటించడం పూర్తిగా తగ్గించేశారు. అనుష్క ప్రభాస్ సరసన రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ‘బాహుబలి’ సిరీస్‌  (Bahubali series) తర్వాత ‘భాగమతి ‘(Bhaagamathie), నిశ్శబ్దం’, వంటి సినిమాలను చేశారు. ఈ సినిమాల తర్వాత ఆమె ఓ సినిమాకు ఓకే చెప్పిన దానికి సంబంధించి అధికారికంగా ప్రకటించలేదు. మరోవైపు ఆమెతో సినిమాలు చేయడానికి నిర్మాతలు ఎంతో మంది సిద్ధంగా ఉన్నా కూడ ఆమె సైన్ చెయ్యట్లేదు. యూవీ క్రియేషన్స్ నిర్మాణంలో ఒక సినిమాను ఒప్పుకున్నా ఇంకా ప్రకటించలేదు. ఇందులో నవీన్ పొలిశెట్టి (Naveen Polishetty) కీలక పాత్ర చేయనున్నాడని మొన్నటి వరకు టాక్ నడిచింది.

    అంతేకాదు ఇన్నాళ్లకు ఆమె నవీన్‌తో ఓ సినిమాను ఓకే చేసిందని టాక్ వచ్చింది. కథ కూడా సిద్ధంగా ఉందని.. ఈ సినిమాకు ఇద్దరి పేర్లు కలిసొచ్చేలా ‘మిస్. శెట్టి.. మిస్టర్.. పోలిశెట్టి’ అనే టైటిల్ నిర్ణయించారని వార్తలు రాగా ఈ సినిమా ఆగిపోయిందని తెలుస్తోంది. ఈ సినిమాని యూవీ క్రియేషన్స్ నిర్మించాల్సి ఉండగా.. ప్రస్తుతం ఈ సినిమాను హోల్డ్ చేశారని అంటున్నారు.

    NTR | Mahesh Babu : ఎన్టీఆర్‌ అడ్డాలో మహేష్ బాబు.. ఇక వారిని అందుకోవడం కష్టమే..

    'చంద్రముఖి' సీక్వెల్‌లో అనుష్క..

    ఇక అది అలా ఉంటే తాజాగా వస్తోన్న సమాచారం మేరకు అనుష్క తమిళ తెలుగు భాషాల్లో రూపోందనున్న ఓ సినిమాకు ఓకే చెప్పిందని అంటున్నారు. వివరాల్లోకి వెళితే.. రజనీకాంత్, జ్యోతిక, నయనతార, ప్రభు ప్రధాన పాత్రల్లో వచ్చిన బ్లాక్ బస్టర్ సినిమా 'చంద్రముఖి' సీక్వెల్‌లో( Chandramukhi sequel) అనుష్క నటించనుందని తెలుస్తోంది. కథ విన్నా అనుష్క ఈ సినిమాను ఓకే చేసిందని అంటున్నారు. ఈ విషయంలో అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.

    Charmme Kaur : హీరోయిన్ ఛార్మి మొదటి పారితోషికం ఎంతో తెలుసా..

    తమిళ మీడియాలో ప్రచారం అవుతున్న కథనాలు ప్రకారం.. అనుష్క ‘చంద్రముఖి’ సీక్వెల్‌లో నటించనుందని అంటున్నారు. ఈ సినిమాలో రజినీకాంత్ నటించట్లేదు. ఆ ప్లేస్‌లో డాన్స్ మాస్టర్ రాఘవ లారెన్స్  (Raghava Lawrence) కనపడనున్నారు. ఈ సినిమాకు ‘చంద్రముఖి’ దర్శకుడు పి.వాసు డైరెక్ట్ చేయనున్నారు. ఈ చిత్రంలో చంద్రముఖి పాత్రను అనుష్క చేయబోతోందని.. సినిమాలో ఆమెదే కీలకమైన పాత్ర అని అంటున్నారు. ఈ సినిమా గురించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
    Published by:Suresh Rachamalla
    First published: