తెలుగు ఇండస్ట్రీలో ఎప్పుడూ బోర్ కొట్టని టాపిక్ అనుష్క పెళ్లి. ఈమె మ్యారేజ్ గురించి చాలా రోజులుగా వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. కానీ సరైన సమాధానం మాత్రం రావడం లేదు. ఈ భామ పెళ్లి గురించి ఎప్పటికప్పుడు వార్తలు వస్తున్నా కూడా ఇప్పటి వరకు కన్ఫ్యూజన్ తప్ప క్లారిటీ రాలేదు. 2019 నవంబర్ 7తో 38 వసంతాలు పూర్తి చేసుకుని.. 40కి చేరవవుతుంది అనుష్క. రోజు రోజుకి రూమర్లు ఎక్కువైపోతుంటే అనుష్క పెళ్లిపై రోజుకో వార్త బయటికి వస్తుంటే అభిమానుల్లో కూడా కంగారు పెరిగిపోతుంది. ఇంతకీ ఈ భామ ఇప్పట్లో పెళ్లి చేసుకుంటుందా లేదా అనే అనుమానాలు కూడా వస్తున్నాయి.
పైగా ప్రభాస్‌తో కొన్నాళ్లుగా అనుష్క డేటింగ్ చేస్తుందనే వార్తలు కూడా ఉన్నాయి. దీనిపై అటు ప్రభాస్.. ఇటు అనుష్క నో అనే సమాధానాలే చెప్పారు. అయినా కూడా వీళ్ల మధ్య రూమర్స్ ఆగడం లేదు. ఇక ఇప్పుడు వీటన్నింటికీ సమాధానాలు వస్తున్నాయి. కాకపోతే కాస్త మెల్లగా వస్తున్నాయంతే.. ఇప్పుడు ఇండస్ట్రీలో జరుగుతున్న ప్రచారాన్ని బట్టి చూస్తుంటే అనుష్క పెళ్లి ఇప్పట్లో లేనట్లే అని తెలుస్తుంది. ప్రస్తుతం జేజమ్మ మనసు అంతా సినిమాలపైనే ఉంది. ప్రస్తుతం కోన వెంకట్ నిర్మాణంలో ‘నిశ్శబ్ధం’ సినిమా చేస్తుంది ఈ భామ. ఇందులో రంగస్థలంలో రామ్ చరణ్ చేసినట్లు ఛాలెంజింగ్ పాత్ర ఇది. ఈ చిత్రం ఓటిటిలో విడుదల కానుందని తెలుస్తుంది.
మరోవైపు నిశ్శబ్ధం తర్వాత సినిమాలు ఒప్పుకోవడం లేదు అనుష్క. అలాగని పెళ్లి ఊసు కూడా కనిపించడం లేదు. ఇదిలా ఉంటే తన పెళ్లి ఇప్పట్లో ఉండదని మరోసారి క్లారిటీ ఇచ్చింది అనుష్క. అయితే ఇప్పుడు మాత్రం అనుష్క పెళ్ళిపై మరో వార్త బయటికి వచ్చింది. టీమిండియన్ క్రికెటర్‌తో అనుష్క పెళ్లి జరగబోతుందనే కొత్త ప్రచారం జరిగింది. అయితే దీనిపై అనుష్క చాలా సీరియస్‌గా స్పందించిందని తెలుస్తుంది. కనీసం చెప్పేవరకు కూడా ఆగలేరా అంటూ మీడియాపై కూడా ఆమె సీరియస్ అయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతానికి ఈమె ఫోకస్ అంతా సినిమాలపైనే ఉంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Anushka Shetty, Telugu Cinema, Tollywood