హోమ్ /వార్తలు /సినిమా /

నయనతార ప్లేస్ కొట్టేసిన అనుష్క.. స్వీటీ అప్పుడు ఎందుకు కాదంది..?

నయనతార ప్లేస్ కొట్టేసిన అనుష్క.. స్వీటీ అప్పుడు ఎందుకు కాదంది..?

అనుష్క శెట్టి ఫైల్ ఫోటో

అనుష్క శెట్టి ఫైల్ ఫోటో

ఫేమస్ డైరెక్టర్ మణిరత్నం మూవీలో అనుష్క ఫిక్స్ అయినట్లు కోలీవుడ్ కోడై కూస్తోంది. ‘పొన్నియన్ సెల్వన్’ అనే బుక్ ఆధారంగా సినిమా తీయాలని ఇప్పటికే ప్లాన్ చేస్తున్నాడు మణి.

కెరీర్ పరంగా ఆచితూచి అడుగులు వేస్తున్న జేజేమ్మ మరో ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్‌కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మణిరత్నం డైరెక్షన్‌లో వస్తున్న ఓ క్రేజీ మూవీలో ఫైనల్ అయింది. ‘పొన్నియన్ సెల్వన్’ పుస్తకం ఆధారంగా సినిమా తెరకెక్కించేందుకు మణి సిద్ధమయ్యాడు. భారీ మల్టీస్టారర్‌గా కోలీవుడ్, టాలీవుడ్, మాలీవుడ్, బాలీవుడ్ నటులంతా ఈ మూవీలో సందడి చేయబోతున్నారు. అమితాబ్ బచ్చన్, విక్రమ్, ఐశ్వర్యరాయ్, విజయ్ సేతుపతి, జయం రవి, కీర్తిసురేష్ మెయిన్ లీడ్ పోషిస్తున్న ఈ మూవీకి ఏ ఆర్ రెహ్మాన్ మ్యూజిక్ అందిస్తున్నాడు. మద్రాస్ టాకీస్, లైకా ప్రొడక్షన్ సంస్థలు ఈ సినిమాను నిర్మిస్తున్నాయి.


అయితే, ముందుగా ఇందులో ఓ పాత్ర కోసం నయనతారను అనుకున్నారు. అందుకు తగ్గ ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. అయితే.. అదే టైమ్‌లో విజయ్, రజనీకాంత్ సినిమా షూటింగ్‌లు ఉండడం, డేట్స్ కుదరకపోవడంతో ఈ మూవీ నుంచి నయన్ తప్పుకుంది. దీంతో ఆ క్యారెక్టర్ కోసం అనుష్కని మణిరత్నం సంప్రదించారని.. స్వీటీ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని తెలుస్తోంది. నిజానికి ఈ క్యారెక్టర్ కోసం ముందుగా అనుష్కనే కలిశారు. కానీ.. ఆ సమయంలో అనుష్క ఒప్పుకోలేదు. కాబట్టి నయన్‌కి ఆ ప్రాజెక్ట్‌లో అవకాశం వచ్చింది. ఇప్పుడు ఆమె తప్పుకోవడంతో మళ్లీ అనుష్క చేతికే ఆ ప్రాజెక్ట్ వచ్చింది.


ప్రజెంట్ ‘సెలైన్స్’ చిత్రంలో చేస్తున్న అనుష్క.. త్వరలోనే మణిరత్నం మూవీ షూటింగ్‌లో పాల్గొనున్నట్లు తెలుస్తోంది.

First published:

Tags: Anushka, Anushka Shetty, Kollyood News, Kollywood Cinema, Maniratnam, Tamil Cinema, Tamil Film News, Tollywood, Tollywood Cinema

ఉత్తమ కథలు