అనుష్క ఏడుపు బాగా కలిసొచ్చింది.. క్యాష్ రేటింగ్ అదుర్స్..

అనుష్క క్యాష్ ప్రోగ్రామ్ రేటింగ్ (anushka cash)

Anushka Shetty Cash: అనుష్క హీరోయిన్ అయిన తర్వాత ఏ రియాలిటీ షోకు కూడా రాలేదు. పైగా ఛానెల్స్‌లో ప్రసారం అయ్యే కామెడీ షోలకు కూడా రాలేదు. కానీ నిశ్శబ్ధం సినిమా ప్రమోషన్..

  • Share this:
అనుష్క హీరోయిన్ అయిన తర్వాత ఏ రియాలిటీ షోకు కూడా రాలేదు. పైగా ఛానెల్స్‌లో ప్రసారం అయ్యే కామెడీ షోలకు కూడా రాలేదు. కానీ నిశ్శబ్ధం సినిమా ప్రమోషన్ కోసం అన్నీ చేసింది అనుష్క శెట్టి. ఈ మధ్యే ఈటీవీలో ప్రసారం అయిన క్యాష్ షోకు కూడా వచ్చింది. ఈటీవీలో ఎప్పుడూ టాప్ రేటింగ్స్ తీసుకొచ్చే షోలలో ఇది కూడా ఒకటి. ముఖ్యంగా సుమ కనకాల యాంకరింగ్ దీనికి ప్రత్యేకం. ఆమె కోసమే ఈ షో చూసే వాళ్లు ఉంటారు. ఎవరొచ్చినా కూడా తన మాటలతో మాయ చేస్తుంటుంది సుమ. అలాంటిది ఈ షోకు ఏకంగా సౌత్ ఇండియన్ లేడీ సూపర్ స్టార్ అనుష్క వచ్చింది.

అనుష్క క్యాష్ ప్రోగ్రామ్ రేటింగ్ (anushka cash)
అనుష్క క్యాష్ ప్రోగ్రామ్ రేటింగ్ (anushka cash)


దాంతో సాధారణంగానే మంచి రేటింగ్స్ తీసుకొచ్చే ఈ క్యాష్ షో.. జేజమ్మ రాకతో ఒక్కసారిగా టాప్ లేపేసింది. ఇప్పటి వరకు క్యాష్ హిస్టరిలోనే టాప్ 5లో నిలిచింది. ఇప్పటి వరకు ఏ టీవీ షోకు కూడా రాని స్వీటీ మొదటిసారి రావడంతో వాళ్లు కూడా బాగానే ప్రమోట్ చేసారు. దానికితోడు ఆ షోలో అనుష్క ఏడుపు కూడా బాగానే కలిసొచ్చింది. తన కెరీర్ మొత్తాన్ని ఒక్కసారి చూసుకుని.. అలాగే కోడి రామకృష్ణను తలుచుకుని ఏడ్చేసింది స్వీటీ.

ప్రభాస్ అనుష్క ఫైల్ ఫోటోస్ (Prabhas Anushka)
ప్రభాస్ అనుష్క ఫైల్ ఫోటోస్ (Prabhas Anushka)


దాన్ని ప్రోమోస్‌లో కూడా బాగానే కట్ చేసారు. అన్నింటికి మించి ప్రభాస్‌పై కొన్ని ప్రశ్నలు కూడా ప్రోమోలలో కట్ చేసారు. దాంతో యూ ట్యూబ్‌లోనే కాకుండా టీవీలో కూడా రికార్డు స్థాయి వ్యూస్, టిఆర్పీ రేటింగ్స్ తీసుకొచ్చింది క్యాష్ ఎపిసోడ్. మార్చ్ 21న ప్రసారమైన ఈ ఎపిసోడ్‌కు 10.4 TRP వచ్చింది. మరీ భారీ స్థాయి రేటింగ్ కాకపోయినా కూడా ఆ టైమ్‌కు మిగిలిన దాంతో పోలిస్తే మంచి రేటింగ్ అనే చెప్పాలి. మొత్తానికి అనుష్క రాకతో టిఆర్పీ బద్ధలైపోయిందన్నమాట.
Published by:Praveen Kumar Vadla
First published: