• HOME
  • »
  • NEWS
  • »
  • MOVIES
  • »
  • ANUSHKA SHARMA CONDEMNS RAPE OF THREE YEAR OLD GIRL IN JAMSHEDPUR I AM SHAKING IN ANGER MS

బాలికపై హత్యాచారం.. పట్టరాని కోపంతో ఊగిపోయిన అనుష్క శర్మ..

బాలికపై హత్యాచారం.. పట్టరాని కోపంతో ఊగిపోయిన అనుష్క శర్మ..

అనుష్క శర్మ(File)

Anushka Sharma : జులై 25న జంషెడ్‌పూర్‌లోని టాటానగర్ రైల్వే స్టేషన్‌లో తల్లిదండ్రుల పక్కన నిద్రించిన మూడేళ్ల ఓ చిన్నారి అపహరణకు గురైంది. దుండగులు ఆ చిన్నారిని రేప్ చేసి.. తల నరికి హత్య చేశారు.

  • Share this:
    జార్ఖండ్‌లోని జంషెడ్‌పూర్‌లో 3 ఏళ్ల చిన్నారిపై జరిగిన హత్యాచారంపై బాలీవుడ్ నటి అనుష్క శర్మ స్పందించారు.ఇది అత్యంత అమానవీయమైన ఘటన అని.. వింటుంటేనే పట్టరాని కోపంతో ఊగిపోతున్నానని అన్నారు.మరొకరు ఇలాంటి చర్యలకు పాల్పడకుండా ఉండాలంటే నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఈ ఘటనలో బాధితులకు సత్వర న్యాయం జరగాలని.. నిందితులను ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టవద్దని వరుస ట్వీట్స్ చేశారు.కాగా,జులై 25న జంషెడ్‌పూర్‌లోని టాటానగర్ రైల్వే స్టేషన్‌లో తల్లిదండ్రుల పక్కన నిద్రించిన మూడేళ్ల ఓ చిన్నారి అపహరణకు గురైంది. దుండగులు ఆ చిన్నారిని రేప్ చేసి.. తల నరికి హత్య చేశారు. మంగళవారం రాత్రి టెల్కో పోలీస్ స్టేషన్ ప్రాంతంలో చిన్నారి మృతదేహం లభ్యమైంది. నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు.


    Published by:Srinivas Mittapalli
    First published:

    అగ్ర కథనాలు