Home /News /movies /

ANUSHKA NISHABDHAM GET GOOD OFFER FROM AMAZON HERE ARE THE DETAILS

అనుష్క తీరుపై నిర్మాతలు అసహనం.. కుదరదంటోన్న స్వీటీ..

ఈ జాబితాలో ఎవ‌రికీ అంద‌నంత ఎత్తులో ఉంది అనుష్క‌. వ‌య‌సు 35 దాటినా కూడా ఇప్ప‌టికీ అనుష్క అంటే అదే ఇమేజ్ ఉంది. ముఖ్యంగా అనుష్క సినిమాలో ఉంటే హీరోతో ప‌నిలేదు.

ఈ జాబితాలో ఎవ‌రికీ అంద‌నంత ఎత్తులో ఉంది అనుష్క‌. వ‌య‌సు 35 దాటినా కూడా ఇప్ప‌టికీ అనుష్క అంటే అదే ఇమేజ్ ఉంది. ముఖ్యంగా అనుష్క సినిమాలో ఉంటే హీరోతో ప‌నిలేదు.

అనుష్క శెట్టి ప్రధాన పాత్రలో నటించిన చిత్రం 'నిశ్శబ్దం'. ఈ సినిమా ఇటు తెలుగుతో పాటు తమిళ భాషాలోను తెరకెక్కింది. ‘

    అనుష్క శెట్టి ప్రధాన పాత్రలో నటించిన చిత్రం 'నిశ్శబ్దం'. ఈ సినిమా ఇటు తెలుగుతో పాటు తమిళ భాషాలోను తెరకెక్కింది. ‘భాగమతి’ తర్వాత అనుష్క శెట్టి చేస్తోన్న ఈ సినిమాపై మంచి అంచనాలున్నాయి. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ఫస్ట్ లుక్‌‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమా తెలుగులో ‘నిశ్శబ్ధం’తో తెరకెక్కుతుండగా.. మిగిలిన భాషల్లో ‘సైలెన్స్’ పేరుతో తెరకెక్కింది. ఇటీవల ఈ సినిమాకు సంబందించిన ట్రైలర్ విడుదలైంది. అనుష్క ఈ సినిమాలో సాక్షి అనే మూగ ఆర్టిస్ట్ పాత్రలో నటిస్తోంది. ఈ సినిమాను మంచు విష్ణుతో ‘వస్తాడు నారాజు’ సినిమా రూపొందించిన హేమంత్ మధుకర్ డైరెక్ట్ చేసాడు. ఈ సినిమాలో అనుష్క శెట్టితో పాటు తమిళ నటుడు మాధవన్, హాలీవుడ్ నటుడు మ్యాడ్‌సన్... ‘అర్జున్ రెడ్డి’ ఫేమ్ షాలినీ పాండే, హీరోయిన్ అంజలి, అవసరాల శ్రీనివాస్ వంటి తారలు నటిస్తున్నారు. 'నిశ్శబ్దం' పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, కోన ఫిలిం కార్పొరేషన్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. మొదటిసారి అనుష్క మూగ పాత్రలో నటిస్తుండటం, మాధవన్ వంటి మోస్ట్ టాలెంటెడ్ యాక్టర్ ఓ పాత్రను పోషించడంతో నిశ్శబ్దంపై అంచనాలు పెరిగాయి. పూర్తిగా అమెరికాలో చిత్రీకరించిన తొలి సినిమాగా రికార్డులు క్రియేట్ చేయడంతో అంచనాలు ఓ రేంజ్‌ ఉన్నాయి.

    అది అలా ఉంటే ఈ సినిమా ఇప్పటికే ప్రేక్షకుల ముందుకు రావలసింది. కానీ లాక్ డౌన్ కారణంగా ఈ సినిమా థియేటర్స్‌లో విడుదలకాలేకపోయింది. అయితే ఒకవేళా లాక్ డౌన్ ఎత్తేసిన తరువాత సినిమాలను చూడటానికి థియేటర్స్ కి జనాలు ఎంతవరకూ వస్తారనేది కూడా ప్రశ్నార్థకమే. దీంతో కొంతమంది నిర్మాతలు తమ సినిమాలను ఓటీటీ ఫ్లాట్ ఫామ్స్‌కు అమ్మేస్తున్నారు. ఈ నేపథ్యంలో 'నిశ్శబ్దం' సినిమాకి అమెజాన్ నుంచి భారీ ఆఫర్ వచ్చిందట. ఏప్పుడో విడుదలకావాల్సిన సినిమా అనుకున్న సమయానికి విడుదల కాకపోయేసరికి నెలకి లక్షల్లో వడ్డీలు కట్టుకుంటున్నారట నిర్మాతలు. కారణం అమెజాన్‌కు ఈ సినిమాను అమ్మాలంటే అనుష్క అనుమతి కూడా కావాలట. కానీ ఆమె మాత్రం డిజిటల్‌లో విడుదలకు అంగీకరించడం లేదట. దాంతో వడ్డీలు కట్టుకోలేక ఇబ్బందులు పడుతున్నారట నిర్మాతలు. అంతేకాదు ఈ విషయంలో ఆమె తీరు పట్ల నిర్మాతలు కొంత అసహనంతో ఉన్నారని టాక్.
    Published by:Suresh Rachamalla
    First published:

    Tags: Anushka Shetty

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు