బాహుబలితో దేవసేనగా ప్రపంచం వ్యాప్తంగా తిరుగులేని గుర్తింపు తెచ్చుకున్న స్వీటీ బ్యూటీ అనుష్క (Anushka Shetty), మోస్ట్ టాలెంటెడ్ అనిపించుకున్న జాతిరత్నం నవీన్ పోలిశెట్టి (Naveen Polishetty) జంటగా నటించిన సినిమా "మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి" (Miss Shetty Mr Polishetty). సినిమా కథకు సరిపోయేలా చాలా క్యాచీగా ఈ టైటిల్ కన్ఫర్మ్ చేసిన మేకర్స్.. ఎప్పటికప్పుడు సరికొత్త అప్ డేట్స్ ఇస్తూ సినిమాపై ఆసక్తి పెంచేస్తున్నారు. యూవీ క్రియేషన్స్ బ్యానర్ లో రూపొందిన ఈ చిత్రానికి పి. మహేష్ కుమార్ దర్శకుడు. రీసెంట్ గా విడుదల చేసిన ఈ మూవీ టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్ కు మంచి స్పందన వచ్చింది. ఇక ఈ చిత్రం నుంచి ఫస్ట్ లిరికల్ సాంగ్ ను ఉగాది పండగ సందర్భంగా విడుదల చేస్తున్నారు.
ఇందుకు సంబంధించి దర్శకుడు పి మహేష్ కుమార్ వాట్సాప్ నుంచి నోనో నో అంటూ సాగే క్యాచీ పదాలను విడుదల చేశారు. వీటిని చూడగానే ఇది ఓ మంచి పెప్పీ డ్యాన్స్ నంబర్ సాంగ్ గా అనిపిస్తోంది. ఫుల్ సాంగ్ ను ఉగాది కానుకగా విడుదల చేయబోతున్నారు. ఈ చిత్రంపై ఇండస్ట్రీ వర్గాలతో పాటు ప్రేక్షకుల్లో కూడా భారీ అంచనాలున్నాయి. తెలుగుతో పాటు తమిళ్, కన్నడ, మళయాల భాషల్లో ఈ విడుదల కాబోతోంది. అతి త్వరలో రిలీజ్ డేట్ ప్రకటించనున్నారు.
ఈ సినిమాలో నవీన్, సిద్ధు పోలిశెట్టి అనే స్టాండప్ కమెడియన్ గా, అనుష్క అన్విత రవళిశెట్టి అనే చెఫ్ పాత్రలో నటిస్తున్నారు. యూవీ క్రియేషన్స్ బ్యానర్ లో గతంలో అనుష్క ప్రధాన పాత్రలో నటించిన భాగమతి బాక్సాఫీస్ ను షేక్ చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు రాబోతోన్న ఈ "మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి" చిత్రాన్ని కూడా అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చేలా రూపొంచించాడు దర్శకుడు పి. మహేష్ బాబు. నిశ్శద్ధం చిత్రంలో అద్భుత నటనతో ఆకట్టుకున్న అనుష్క.. తన ఇమేజ్ కు తగ్గట్టుగా అద్బుతమైన స్క్రిప్ట్ కావడంతో కొంత గ్యాప్ తర్వాత ఈ పాత్రకు ఓకే చెప్పింది.
మరోవైపు ఏజెంట్ సాయిశ్రీనివాస ఆత్రేయ, జాతిరత్నాలు సినిమాలతో యువతరంతో పాటు అన్ని వర్గాల ప్రేక్షకుల చేత మంచి నటుడుగా ప్రశంసలు అందుకున్న నవీన్ పోలిశెట్టి కూడా కాస్త గ్యాప్ తీసుకొని ఈ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. అనుష్క, నవీన్ పోలిశెట్టి కలిసి నటిస్తుండటంతో ఈ మూవీపై ప్రేక్షకుల్లో అంచనాలు నెలకొన్నాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Anushka Shetty, Naveen polishetty, Tollywood