
అనుపమ పరమేశ్వరన్ (Image:Twitter)
ఈ బొద్దుగుమ్మ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటుంది. అందమైన ఫొటోలు తన సోషల్ మీడియా అకౌంట్లలో పోస్ట్ చేస్తుంటుంది.
టాలీవుడ్లో వెరైటీ సినిమాలు సెలక్ట్ చేసుకుంటూ తనకంటూ ప్రత్యేక ఇమేజ్ను క్రియేట్ చేసుకున్న హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్. ఈ బొద్దుగుమ్మ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటుంది. అందమైన ఫొటోలు, ఫొటో షూట్లకు సంబంధించిన వివరాలు తన సోషల్ మీడియా అకౌంట్లలో పోస్ట్ చేస్తూ.. అభిమానులతో రెగ్యులర్ టచ్లో ఉంటుంది. అలాంటి అనుపమ పరమేశ్వరన్.. తాజాగా ఓ ఫోటో పోస్ట్ చేసింది. దానికి ‘మై విస్కీ బాయ్’ అని కామెంట్ పెట్టింది. అయితే, ఆ ఫొటోలో ఏముందనే విషయం చాలా మందికి అర్థం కాలేదు. ఓ కుక్కపిల్ల జుట్టుకు రిబ్బన్ పెట్టి.. పిలక వేసినట్టుగా ఆ ఫొటోలో కనిపిస్తోంది.
అనుపమ తెరపై చివరగా కనిపించిన సినిమా రాక్షసుడు. బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా వచ్చిన ఈ క్రైమ్ థ్రిల్లర్లో హీరోయిన్గా నటించింది. ‘మనియరాయిలే అశోకన్’ అనే మలయాళ సినిమాలో నటిస్తోంది. ఆ సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్గా కూడా పనిచేస్తోంది.
పెళ్లిలో డీజే గొడవ.. కొట్టుకున్న బంధువులు
Published by:Ashok Kumar Bonepalli
First published:November 01, 2019, 15:50 IST