• HOME
  • »
  • NEWS
  • »
  • MOVIES
  • »
  • ANUPAMA PARAMESWARAN SENSATIONAL COMMENTS ABOUT RAM CHARAN HERE ARE THE DETAILS TA

Anupama Parameswaran - Ram Charan: రామ్ చరణ్ పై అనుపమ పరమేశ్వరన్‌కు ఈ రేంజ్ కోపం ఉందా.. సాక్ష్యం ఇదిగో..

Anupama Parameswaran - Ram Charan: రామ్ చరణ్ పై అనుపమ పరమేశ్వరన్‌కు ఈ రేంజ్ కోపం ఉందా..  సాక్ష్యం ఇదిగో..

రామ్ చరణ్ పై అనుపమ గుస్సా (File/Photos)

Anupama Parameswaran- Ram Charan:  అనుపమ పరమేశ్వరన్‌కు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పై ఈ రేంజ్ కోపం ఉందా. తాజాగా ఈమె ఇన్‌స్టాగ్రామ్ వేదికగా అభిమానులతో చిట్‌చాట్ చేస్తుండగా ఈ విషయం మరోసారి బయట పడింది. వివరాల్లోకి వెళితే..,

  • Share this:
    Anupama - Ram Charan:  అనుపమ పరమేశ్వరన్‌కు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పై ఈ రేంజ్ కోపం ఉందా. తాజాగా ఈమె ఇన్‌స్టాగ్రామ్ వేదికగా అభిమానులతో చిట్‌చాట్ చేస్తుండగా ఈ విషయం మరోసారి బయట పడింది. వివరాల్లోకి వెళితే.., అనుపమ పరమేశ్వరన్ మలయాళ 'ప్రేమమ్' సినిమాతో ఎంత పాపులర్ అయ్యిందో తెలిసిందే. ఆ సినిమాతో అనుపమకు తెలుగులో కూడా వరుస  సినిమా అవకాశాలోచ్చాయి. తెలుగులో ఈ భామ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో నితిన్ హీరోగా తెరకెక్కిన ‘అ..ఆ’ సినిమాతో పరిచయం అయింది. ఆ తర్వాత ..నాగ చైతన్య హీరోగా నటించిన ‘ప్రేమమ్’ సినిమాతో పలకరించింది. ఈ సినిమా కూడా బాక్సాఫీస్ దగ్గర సూపర్ హిట్‌గా నిలిచింది. ఆ తర్వాత శర్వానంద్ హీరోగా నటించిన ‘శతమానం భవతి’ సినిమాతో హాట్రిక్ హిట్ అందుకుంది. తెలుగులో తొలి మూడు సినిమాలతో హాట్రిక్ హిట్స్ నమోదు చేసిన ఈ భామ.. ఆ తర్వాత అదే జోరును కంటిన్యూ చేయలేకపోయింది. మధ్యలో రామ్ హీరోగా నటించిన ‘హలో గురు ప్రేమ కోసమే’, ‘రాక్షసుడు’ సినిమాలు పర్వాలేదనిపించాయి.

    అంతేకాదు అనుపమ మలయాళీ భామ అయిన తెలుగులో తన పాత్రకు తానే డబ్బింగ్ చెప్పుకుంటుంది. ఎక్స్‌పోజింగ్ దూరంగా సహజంగా నటించడం కూడా ఈమెకు సరైన అవకాశాలు రాకుండా చేశాయని కూడా చెప్పొచ్చు. ఓ దశలో ఈమె టాలీవుడ్‌ను ఓ రేంజ్‌లో ఏలుతుందనే అభిప్రాయం కూడా వ్యక్తం అయింది. ఆ తర్వాత వరుస ఫ్లాపులతో ఈమె కొంచెం సైలెంట్ అయింది. తాజాగా ఈ భామ ‘రౌడీ బాయ్స్’ అనే సినిమాతో పలకరించబోతుంది. ఈ సినమా ప్రమోషన్‌లో భాగంగా ఈమె అభిమానులతో లైవ్ చాట్ చేసింది. ఈ సందర్భంగా ఫ్యాన్స్ అడిగిన పలు ప్రశ్నలకు ఆసక్తికరంగా సమాధానాలు చెప్పింది. ఓ ప్రశ్న దగ్గర మాత్రం అనుపమ మూతి పక్కన పెట్టేసింది. ఇంతకీ అనుపమ మూతి ముడిచుకుపోయిన ఆ ప్రశ్న ఏమిటంటే.. ఓ నెటిజన్.. రామ్ చరణ్‌కు జోడిగా మిమ్మల్ని చూసే అవకాశం వస్తుందా అని అడిగాడు దానికి ఏం ఆన్సర్ ఇవ్వాలో తెలియక మూతి ముడుచుకున్నట్టు వింత ఎక్స్‌ప్రెషన్స్ ఇచ్చింది బ్యూటీ.

    అనుపమ పరమేశ్వరన్, రామ్ చరణ్ (file/Photo)


    ఇపుడీ మ్యాటర్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈమె గతంలో రామ్ చరణ్ హీరోగా నటించిన ‘రంగస్థలం’ ముందుగా అనుపమనే అనుకున్నారు. ఫైనల్‌గా సమంతను ఫిక్స్ చేసారు. ఒకవేళ ఈ సినిమా అనుపమ పరమేశ్వరన్ చేసి ఉంటే... స్టార్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగేదనే చెప్పాలి. మొత్తంగా సోషల్ మీడియాలో అనుపమ చెప్పిన సమాధానం ఇపుడు వైరల్ అవుతోంది
    Published by:Kiran Kumar Thanjavur
    First published: