అనుపమ.. ఆ కల నెరవేరేది ఎప్పుడో.. ఆశగా ఎదురు చూస్తున్న ప్రేమమ్ బ్యూటీ..

Anupama Parameswaran : ఈ కేరళ కుట్టి.. 'ప్రేమమ్' అనే  సినిమాతో మలయాళ వెండితెరకు పరిచయమై.. తెలుగులో  త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన 'అ ఆ'తో తెలుగు తెరకు పరిచయమైంది. అది అలా ఉంటే ప్రస్తుతం ఈ భామ.. ఓ విషయం గురించి తెగ ఆలోచన చేస్తోంది. అంతేకాదు ఎప్పుడూ దాని గురించే కలలు కంటోందట.

news18-telugu
Updated: August 25, 2019, 10:08 AM IST
అనుపమ.. ఆ కల నెరవేరేది ఎప్పుడో.. ఆశగా ఎదురు చూస్తున్న ప్రేమమ్ బ్యూటీ..
Instagram.com/anupamaparameswaran96
  • Share this:
Anupama Parameswaran : ఈ కేరళ కుట్టి.. 'ప్రేమమ్' అనే  సినిమాతో మలయాళ వెండితెరకు పరిచయమైంది. ఆ సినిమా కేరళలో సూపర్ హిట్‌‌ అవ్వడంతో  ఈ భామకు తెలుగులో  త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన 'అఆ'లో అవకాశం వచ్చింది. ఆ సినిమాలో గడుసు పిల్లగా అదరగొట్టిన సంగతి తెలిసిందే. ఆ సినిమా హిట్  తర్వాత వరుసగా తెలుగులో సినిమాలు చేస్తూనే ఉందీ ఈ మలయాళీ భామ. అది అలా ఉంటే.. ఆ మధ్య ఈ భామ, టీమిండియా క్రికెటర్ జస్‌ప్రిత్ బుమ్రాలు లవ్‌లో ఉన్నారని... నెట్టింట్లో ఈ వార్త  తెగ చక్కర్లు కొట్టింది.  ఈ విషయం పై స్పందించిన అనుపమ.. అలాంటిదేమి లేదని తేల్చేసింది. ఈ భామ తెలుగులో నటించిన తాజా సినిమా 'రాక్షసుడు' ఇటీవల విడుదలై  విజయవంతంగా ప్రదర్శించబడుతోంది. 

View this post on Instagram
 

Yessss... tired and tanned...but pleasant and proud ♥️ @sbkphotography__ 📸 #adkedi


A post shared by anupamaparameswaran (@anupamaparameswaran96) on

అది అలా ఉంటే.. ఓ సందర్బంగా అనుపమ మాట్లాడుతూ.. కేవలం నటనే కాకుండా, ఇంకా తనకు చాలా కలలు ఉన్నాయని.. ఎప్పుడూ వాటి గురించి కలలు కంటుంటానని అంటోంది. అంతేకాదు వాటిని సాకారం చేసుకొనేందుకు కావాల్సీన కసరత్తులు కూడా చేస్తుంటాని చెబుతోంది ఈ ముద్దుగుమ్మ. ఆమె మాట్లాడుతూ.. నేను ఈ తరం అమ్మాయిని.. ఏదో ఒక పనికి కాకుండా.. లేదో ఒక వ్యాపకానికో పరిమితం కావడం ఈ నవతరం వారికి ఇష్టం ఉండదు అంటూ.. ఒకే సమయంలో రెండు మూడు పనులు చేయడం ఇష్టం అంటోంది అనుపమ. అందులో భాగంగానే.. చదువుకుంటూనే సినిమాల్లో నటించానని... కానీ ఎప్పుడూ ఇబ్బందిగా అనిపించలేదు. ఇప్పుడు కూడా నటిగా కొనసాగుతూనే.. చాలా విషయాలపైకి మనసు మళ్లుతుంటుంది.  అందువల్లనే సెట్‌లో ఉన్నప్పుడు కూడా ఒక చోట కూర్చోకుండా.. కెమెరా  వెనకాల ఏం జరుగుతుంది.. వాటీ కష్టాలు ఎలా ఉంటాయి మొదలగు విషయాలను తెలుసుకుంటానని అంటోంది. ఈ భామ మాట్లాడుతూ.. ప్రస్తుతానికైతే తరచూ కనే కల మాత్రం దర్శకత్వం గురించేనని చెబుతోంది. అందులో భాగంగా అనుపమ ప్రస్తుతం ఓ మలయాళీ సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్‌గా పని చేస్తోన్న సంగతి తెలిసిందే.
First published: August 25, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>