హోమ్ /వార్తలు /సినిమా /

Ante Sundaraniki:అంటే సుందరానికి సినిమా టీం.. ఆ హీరోయిన్ మరిచిపోయారా ?

Ante Sundaraniki:అంటే సుందరానికి సినిమా టీం.. ఆ హీరోయిన్ మరిచిపోయారా ?

Photo Twitter

Photo Twitter

అంటే సుందరానికి సినిమాలో అనుపమ పరమేశ్వరన్ కూడా నటించింది. దాదాపు 15 నిమిషాల పాటు ఆమె సినిమాలో కనిపించింది. అయితే ఈ విషయం సినిమా టీం ఎక్కడా చెప్పలేదు.

న్యాచుర‌ల్ స్టార్ నాని, మలయాళీ న‌జ్రియా న‌జీమ్ జంటగా నటించిన సినిమా  అంటే సుందరానికి. ఈ సినిమాను రొమాంటిక్ కామెడీ ఎంట‌ర్‌టైన‌ర్‌‌గా యువ దర్శకుడు వివేక్ ఆత్రేయ డైరెక్ష‌న్‌ చేశారు. ఈ చిత్రంను మైత్రీ మూవీ మేకర్స్‌ బ్యానర్‌పై నవీన్‌ యెర్నేని, వై రవిశంకర్‌లు సంయుక్తంగా నిర్మించారు. జూన్‌ 10న తెలుగు, తమిళ్, మలయాళం భాషల్లో 'అంటే సుందరానికి' ప్రేక్షకుల ముందుకు వచ్చింది, రిలీజ్ అయినప్పటి నుంచి ఈ సినిమా మంచి టాక్ తెచ్చుకుంది.

మరోవైపు ఈ సినిమా కోసం ప్రమోషన్లు కూడా బాగానే చేశారు. ఇక ప్రిరిలీజ్ ఈవెంట్‌కు పవర్ స్టార్ పవన్ కళ్యాన్ కూడా వచ్చారు. అయితే తాజాగా సినిమా విడుదల అయిన తర్వాత ఈ సినిమా టీంపై పలురకాల విమర్శలు వస్తున్నాయి.  ‘అంటే సుందరానికి’లో అనుపమ పరమేశ్వరన్‌  కూడా నటించింది. అయితే ఈ  పాత్రను సినిమా టీం ఎవరూ కూడా రివీల్ చేయలేదు. ఎక్కడా కూడా మరో హీరోయిన్ ఉందని చెప్పలేదు. సినిమా విడుదలకు ముందు ఆమె గురించి ఎక్కడా ఏ ఒక్కరూ ప్రస్తావించలేదు. అంతేకాదు సినిమా విడుదల తర్వాత కూడా ఆమె పేరు అంటే సుందరానికి టీంకు చెందిన ఏ ఒక్కరు కూడా కనీసం చెప్పడం లేదు. 

దీంతో నాని అండ్ టీం పై అనేక రకాల ప్రశ్నలు తలెత్తెతున్నాయి. అనుపమ పరమేశ్వరన్‌ తెలుగులో ఎవరికీ తెలియని హీరోయిన్‌ ఏం కాదు. ఆమె ఎన్నో సినిమాల్లో కూడా నటించింది.ఒక వేళ యూఎస్‌పీ కోసం అనుపమ పరమేశ్వరన్ సినిమాలో ఉంది అన్న విషయాన్ని దాచి పెట్టినా... తర్వాత అయిన రివీల్ చేయలి కదా... సినిమా విడుదలయ్యాక జరిగిన, జరుగుతున్న ప్రెస్‌ మీట్స్‌లో ఎందుకు అనుపమ పరమేశ్వరన్‌ పేరును ప్రస్తావించడం లేదనేది అర్థం కావడం లేదు.

అనుపమ పరమేశ్వరన్

అంటే  సుందరానికి సినిమాలో నాని సహోద్యోగి పాత్రలో అనుపమ సినిమాలో కనిపించింది. అయితే సినిమాలో ఆమె కనిపించేది సుమారు 15 నిమిషాలే కావొచ్చు.కానీ అనుపమ పాత్ర కీలకమే. అలాంటి పాత్ర గురించి పోస్ట్‌ రిలీజ్‌ ప్రమోషన్స్‌లో వాడటం లేదు అనేది తెలియడం లేదు. అయితే ఈ సినిమా కోసం ఆమె సుమారు వారం కాల్‌షీట్లు ఇచ్చింది. అందుకోసం నిర్మాతల నుండి సుమారు రూ. 30 లక్షల నుండి రూ. 40 లక్షల వరకు తీసుకుందని అంటున్నారు. మరి అనుపమను ఎందుకు సినిమా మేకర్ ప్రచారానికి వాడుకోలేదని అనుమానాలు వస్తున్నాయి. మరి ముందు ముందు జరగనున్న ప్రెస్ మీట్లలో అయిన అనుపమ పేరును వాడుతారో లేదో చూడాలి.

First published:

Tags: Ante sundaraniki, Ante Sundaraniki Shooting, Anupama Parameswaran, Hero nani

ఉత్తమ కథలు