పాపం అనుపమ... ఆ కోరికను నెరవేర్చుకుంటుందో లేదో...

Anupama Parameswaran : అనుపమ 'ప్రేమమ్' అనే  సినిమాతో మలయాళ వెండితెరకు పరిచయమై.. తెలుగులో త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన 'అ ఆ'లో అదరగొట్టన సంగతి తెలిసిందే.

news18-telugu
Updated: October 20, 2019, 7:36 AM IST
పాపం అనుపమ... ఆ కోరికను నెరవేర్చుకుంటుందో లేదో...
Instagram/anupamaparameswaran96
  • Share this:
Anupama Parameswaran : అనుపమ.. 'ప్రేమమ్' అనే  సినిమాతో మలయాళ వెండితెరకు పరిచయమైంది. ఆ సినిమా కేరళలో సూపర్ హిట్‌‌ అవ్వడంతో  ఈ భామకు తెలుగులో  త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన 'అ ఆ'లో అవకాశం వచ్చింది. ఆ సినిమాలో గడుసు పిల్లగా అదరగొట్టిన సంగతి తెలిసిందే. ఆ  తర్వాత వరుసగా తెలుగులో సినిమాలు చేస్తూనే ఉందీ ఈ మలయాళీ భామ. అది అలా ఉంటే.. ఈ భామ  ఓ సందర్బంగా మాట్లాడుతూ.. కేవలం నటనే కాకుండా, ఇంకా తనకు చాలా కలలు ఉన్నాయని.. తెలిపింది. అంతేకాదు ఎప్పుడూ వాటి గురించే కలలు కంటుంటానని అంటోంది అనుపమ. వాటిని సాకారం చేసుకొనేందుకు కావాల్సీన కసరత్తులు కూడా చేస్తుంటాని అంటోంది.

ఆమె మాట్లాడుతూ.. నేను ఈ తరానికి చెందిన అమ్మాయిని.. ఈ తరం వారికి ఏదో ఒక పనికో లేదా ఒక వ్యాపకానికో పరిమితం కావడం ఇష్టం ఉండదు అంటూ.. ఒకే సమయంలో రెండు మూడు పనులు చేయడం ఇష్టం అంటోంది అనుపమ. అందులో భాగంగానే.. తాను చదువుకుంటూనే సినిమాల్లో నటించానని... అదీ ఎప్పుడూ ఇబ్బందిగా అనిపించలేదు. ప్రస్తుతం కూడా నటిగా కొనసాగుతూనే.. చాలా విషయాలపైకి మనసు మళ్లుతుంటుంది.  అందువల్లనే షూటింగ్‌లో ఉన్నప్పుడు కూడా ఒక చోట కూర్చోకుండా.. కెమెరా వెనకాల ఏం జరుగుతుంది.. వాటీ కష్టాలు ఎలా ఉంటాయి వంటి విషయాల గురించి తెలుసుకుంటానని అంటోంది. కాగా ప్రస్తుతానికైతే తన డ్రీమ్ మాత్రం దర్శకత్వం గురించేనని చెబుతోంది. తనకు ఓ సినిమాను దర్శకత్వం వహించాలని ఉందని అంటోంది. అందులో భాగంగా అనుపమ ఆ మధ్య ఓ మలయాళీ సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్‌గా పని చేసింది. అయితే అనుపమ తన డ్రీమ్‌ను నెరవేర్చుకుంటుందో లేదో చూడాలి మరి. కాగా అనుపమ తెలుగులో నటించిన 'రాక్షసుడు' సినిమా ఇటీవల విడుదలై మంచి విజయాన్ని అందుకుంది.First published: October 20, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>