అనుపమ షాకింగ్ నిర్ణయం.. ఇక పై వాటికి గుడ్ బై అంటున్న ప్రేమమ్ బ్యూటీ..

Anupama parameswaran | అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ నిర్ణయం తీసుకుందా  ? అంతేకాదు త్వరలోనే టాలీవుడ్ ఇండస్ట్రీకి గుడ్ బై చెప్పనుందా అంటే ఔననే అంటున్నాయి సినీ వర్గాలు.

news18-telugu
Updated: March 20, 2020, 8:41 AM IST
అనుపమ షాకింగ్ నిర్ణయం.. ఇక పై వాటికి గుడ్ బై అంటున్న ప్రేమమ్ బ్యూటీ..
అనుపమపరమేశ్వరన్ Instagram/anupamaparameswaran96
  • Share this:
అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ నిర్ణయం తీసుకుందా  ? అంతేకాదు త్వరలోనే టాలీవుడ్ ఇండస్ట్రీకి గుడ్ బై చెప్పనుందా అంటే ఔననే అంటున్నాయి సినీ వర్గాలు. చూసి చూడంగానే పక్కింటి అమ్మాయిలా కనిపించే అనపమ పరమేశ్వరన్ త్వరలోనే సినిమాలను విడిచిపెట్టాలనే నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం. అనుపమ పరమేశ్వన్ ముందు నుంచి పర్ఫామెన్స్ ఓరియెంటెడ్‌గా నటించింది. కానీ ఎక్స్‌పోజింగ్ మాత్రం ఈ భామ దూరం అందుకే ఈమెకు సరైన అవకాశాలు రాలేదని చెప్పొచ్చు. దాదాపు ఐదేళ్ల క్రితం మలయాళ సూపర్ హిట్ ‘ప్రేమమ్’ సినిమాతో కథానాయికగా పరిచయం అయింది అనుపమ పరమేశ్వరన్. తెలుగులో త్రివిక్రమ్ తెరకెక్కించిన ‘అ..ఆ’ సినిమాతో పరిచయమైంది. మరోవైపు మలయాళ సూపర్ హిట్ ప్రేమమ్ సినిమాలో చేసిన పాత్రను తెలుగులో అనుపమ పరమేశ్వర్ చేసి తెలుగు ప్రేక్షకుల మదిని దోచుకుంది. ఆ తర్వాత ‘శతమానం భవతి’ వంటి హాట్రిక్ సక్సెస్‌లతో అనుపమకు తిరుగుండని అందరు అనుకున్నారు. కానీ అనూహ్యంగా ఆ తర్వాత అనుపమ పరమేశ్వరన్ నటించిన ‘ఉన్నది ఒకటే జిందగీ’, ‘తేజ్ ఐ లవ్ యూ’, ‘కృష్ణార్జున యుద్ధం’ వంటి పరాజయాలు అనుపమను వెనక్కి లాగాయి. మరోవైపు ప్రతి సినిమాలో పక్కింటి అమ్మాయి తరహా పాత్రలే పలకరించడంతో ప్రేక్షకులకు ఆమెను చూసి బోర్ కొట్టినట్టు ఉంది. ఇలాంటి టైమ్‌లో వరుస పరాజయాలు తోడు కావడంతో అనుపమకు అవకాశాలు తగ్గాయి.

anupama parameshwaran shocking decision to Quit movies here are the details,anupama parameswaran,anupama parameswaran hot,anupama parameswaran photos,anupama hot photos,hot photos,anupama parameswaran movies,anupama parameswaran songs,anupama,anupama parameswaran photoshoot,anupama parameswaran images,anupama parameswaran telugu movies,anupama parameswaran hot navel,anupama parameshwaran,anupama parameswaran hot photos,anupama parameswaran latest photoshoot,anupama parameswaran pics
అనుపమ పరమేశ్వరన్ (Instagram/Photo)


గతేడాది బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా నటించిన ‘రాక్షసుడు’ సినిమాతో సక్సెస్ అందుకున్న అనుపమ పరమేశ్వరన్‌కు ఒరిగిందేమి లేదు. దీంతో అవకాశాలు లేక అటు గ్లామర్ ప్రదర్శన చేయలేక.. ముఖ్యంగా టాలీవుడ్‌కు గుడ్ బై చెప్పే ఆలోచన చేస్తున్నట్టు సమాచారం. ఇక నుంచి తమిళ, మలయాళ చిత్రాలనే చేయాలనే ఆలోచనలో ఉన్నట్టు సమాచారం. ఏది ఏమైనా ఒక సినిమాలో నటించామా లేదా అని కాకుండా తన పాత్రకు తానే డబ్బింగ్  చెప్పుకునే అనుపమ పరమేశ్వరన్ వంటి టాలెంటెడ్ హీరోయిన్‌కు ఇలాంటి పరిస్థితి దాపురించడం కాస్త బాధ కలిగించే విషయమనే చెప్పాలి.
First published: March 20, 2020, 8:41 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading