మాజీ ప్రధాన మంత్రి, ఆర్థిక వేత్త మన్మోహన్ సింగ్ ...ప్రధాని కావాడానికి దారి తీసిన పరిస్థితులపై బాలీవుడ్‌లో ‘ యాక్సిడెంటల్ ప్రైమ్ మినిష్టర్’ సినిమా తెరకెక్కింది. ఈ సినిమాలో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ పాత్రలో బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ నటించాడు.
ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ట్రైలర్‌పై వివాదాలు ముసురుకున్నాయి. 2004 నుంచి 2014 మధ్యలో మన్మోహన్ సింగ్‌ను కీలుబొమ్మగా చేసి సోనియా, రాహుల్ గాంధీలు ఎలా ఈ దేశాన్ని పరిపాలించారనేది ఈ మూవీ ట్రైలర్‌లో చూపించారు.దీంతో కాంగ్రెస్ పార్టీ ఈ సినిమా దర్శక, నిర్మాతలపై భగ్గుమంటోంది. ఈ చిత్ర నిర్మాణానికి దర్శక, నిర్మాతలు కాంగ్రెస్ పార్టీ నుంచి కానీ మన్మోహన్ అనుమతి తీసుకోలేదని కాంగ్రెస్ పార్టీ చేస్తోంది. అంతేకాదు ఈ సినిమాను నిలుపుదల చేయాలని పలువురు కాంగ్రెస్ నేతలు ఇప్పటికే కోర్డులో కేసులు కూడా వేశారు.
ఐనా ఈ చిత్ర ప్రదర్శనను కోర్డు ఎలాంటి అవాంతరాలు తెలుపలేదు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన తెలుగు ట్రైలర్‌ను విడుదల చేశారు. తెలుగులో ఆయా పాత్రలకు సంబంధించిన డబ్బింగ్ చక్కగా కుదిరింది.
ఐతే..తెలుగు, తమిళ వెర్షన్స్‌ను ఈ నెల 18న విడుదల చేయనున్నారు. ఇక ఈసినిమా ఇంగ్లీష్ వెర్షన్ డేట్‌ను మాత్రం త్వరలో ప్రకటిస్తరాట. ఈ శుక్రవారం విడుదల కానున్న ‘ది యాక్సిడెంటల్ ప్రైమ్ మినిష్టర్’ చిత్రం ఇండియాలో 1300 స్క్రీన్స్, ఓవర్సీస్‌లో 140 స్క్రీన్స్ తో కలిపి మొత్తంగా 1440 స్క్రీన్స్‌లో ఈ సినిమా విడుదల కానుంది.
ఈ చిత్రాన్ని ప్రముఖ పాత్రికేయుడు అప్పటి ప్రధాని మీడియా సలహాదారు సంజయ్ బారు రాసిన ‘ది యాక్సిడెంటల్ ప్రైమ్ మినిష్టర్’ అనే పుస్తకం ఆధారంగా విజయ్ రత్నాకర్ డైరెక్ట్ చేసాడు. మొత్తానికి ట్రైలర్‌తోనే సంచనాలకు వేదికగా నిలిచిన ‘ది యాక్సిడెంటల్ ప్రైమ్ మినిష్టర్’ సినిమా విడుదల తర్వాత ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందో చూడాలి.
ఇవి కూడా చదవండి
‘అర్జున్ రెడ్డి’ తమిళ రీమేక్ ‘వర్మ’ ట్రైలర్.. బాల ఫ్రేమ్ టూ ఫ్రేమ్ దించేసాడుగా..
Petta Telugu Movie Review:‘పేట’ మూవీ రివ్యూ..రజినీ ఫ్యాన్స్‌కు మాత్రమే
రికార్డులు ఎవరికి కావాలి.. రామ్ చరణ్ సంచలన కామెంట్స్..
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Anupam Kher, Bollywood, Hindi Cinema, Manmohan singh