హోమ్ /వార్తలు /సినిమా /

యూట్యూబ్‌లో కనిపించని ‘ది యాక్సిడెంటల్ ప్రైమ్ మినిష్టర్’ ట్రైలర్..మండిపడుతున్న అనుపమ్ ఖేర్

యూట్యూబ్‌లో కనిపించని ‘ది యాక్సిడెంటల్ ప్రైమ్ మినిష్టర్’ ట్రైలర్..మండిపడుతున్న అనుపమ్ ఖేర్

‘ది యాక్సిడెంటల్ ప్రైమ్ మినిష్టర్’

‘ది యాక్సిడెంటల్ ప్రైమ్ మినిష్టర్’

మాజీ ప్రధాన మంత్రి, ఆర్థిక వేత్త మన్మోహన్ సింగ్ ...ప్రధాని కావాడానికి దారి తీసిన పరిస్థితులపై బాలీవుడ్‌లో ‘ యాక్సిడెంటల్ ప్రైమ్ మినిష్టర్’ సినిమా తెరకెక్కింది. ఈ సినిమాలో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ పాత్రలో బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ నటించాడు. దీంతో విడుదలకు ముందే ఈ మూవీపై వివాదాలు ముసురు కుంటున్నాయి. తాజాగా ‘ది యాక్సిడెంటల్ ప్రైమ్ మినిష్టర్’ ట్రైలర్ యూట్యూబ్‌లో కనిపించడంలో లేదంటూ ఈసినిమా ముఖ్యపాత్రధారి అనుపమ్ ఖేర్ తన అసంతృప్తిని వ్యక్తం చేశాడు.

ఇంకా చదవండి ...

మాజీ ప్రధాన మంత్రి, ఆర్థిక వేత్త మన్మోహన్ సింగ్ ...ప్రధాని కావాడానికి దారి తీసిన పరిస్థితులపై బాలీవుడ్‌లో ‘ యాక్సిడెంటల్ ప్రైమ్ మినిష్టర్’ సినిమా తెరకెక్కింది. ఈ సినిమాలో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ పాత్రలో బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ నటించాడు.

ఈ చిత్రాన్ని ప్రముఖ పాత్రికేయుడు అప్పటి ప్రధాని మీడియా సలహాదారు సంజయ్ బారు రాసిన ‘ది యాక్సిడెంటల్ ప్రైమ్ మినిష్టర్’ అనే పుస్తకం ఆధారంగా విజయ్ రత్నాకర్ డైరెక్ట్ చేసాడు. రీసెంట్‌గా విడుదలైన ‘ది యాక్సిడెంటల్ ప్రైమ్ మినిష్టర్’ ట్రైలర్ కాంగ్రెస్ పార్టీలోనే కాదు..దేశ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. 2004 నుంచి 2014 మధ్యలో మన్మోహన్ సింగ్‌ను కీలుబొమ్మగా చేసి సోనియా, రాహుల్ గాంధీలు ఎలా ఈ దేశాన్ని పరిపాలించారనేది ఈ మూవీ ట్రైలర్‌లో చూపించారు.

దీంతో విడుదలకు ముందే ఈ మూవీపై వివాదాలు ముసురు కుంటున్నాయి. తాజాగా ‘ది యాక్సిడెంటల్ ప్రైమ్ మినిష్టర్’ ట్రైలర్ యూట్యూబ్‌లో కనిపించడంలో లేదంటూ ఈసినిమా ముఖ్యపాత్రధారి అనుపమ్ ఖేర్ తన అసంతృప్తిని వ్యక్తం చేశాడు.

నిన్నమొన్నటి వరకు ‘ది యాక్సిడెంట్ ప్రైమ్ మినిష్టర్’ ట్రైలర్ యూట్యూబ్‌ ట్రెండింగ్స్‌లో ఫస్ట్ ప్లేస్‌లో ఉండే. ఇపుడు చూస్తే కనీసం 50వ స్థానంలో కూడా లేదంటూ యూట్యూబ్ తీరుపై అనుపమ్ ఖేర్ మండిపడ్డారు. మరోవైపు అభిమానులకు కోసం మరోసారి ఈ సినిమా ట్రైలర్ లింక్‌ను పోస్ట్ చేశారు.

ఇప్పటి వరకు ఈ చిత్ర ట్రైలర్‌ను 37 మిలియన్ మందికి పైగా వీక్షించారు. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ వాళ్లు ఈ సినిమా విడుదలకు ముందు తమకు చూపించాలని పట్టుపడుతున్నారు. ఒక వేళ మన్మోహన్ సింగ్ కోరితే ఆయన కోసం స్పెషల్‌గా షో వేస్తామని ఈ చిత్ర నిర్మాతలు ప్రకటించారు. ‘ది యాక్సిడెంటల్ ప్రైమ్ మినిష్టర్’ ఈ నెల 11న విడుదల కానుంది.

హెబ్బా పటేల్ లేటెస్ట్ ఫోటోస్

ఇది కూడా చదవండి 

ప్ర‌భాస్ కేస్ లో కీల‌క మ‌లుపు.. అధికారుల‌పై కోర్ట్ సీరియ‌స్..

మరో అరుదైన రికార్డు సొంతం చేసుకున్న యశ్ ‘కేజీఎఫ్’

రాజశేఖర్‌ 'కల్కి' ఫస్ట్‌లుక్‌ అదుర్స్

First published:

Tags: Anupam Kher, Bollywood

ఉత్తమ కథలు