రీసెంట్ గా జాతి రత్నాలు (Jathi Rathnalu) సినిమాతో సూపర్ సక్సెస్ అందుకున్నారు డైరెక్టర్ అనుదీప్ కేవీ (Anudeep Kv). ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించింది. ఇదే జోష్ లో ఇప్పుడు ప్రిన్స్ (Prince) అనే మరో కామెడీ ఎంటర్టైనర్ మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు అనుదీప్. ఈ సినిమాతో తమిళ హీరో శివ కార్తికేయన్ (Sivakarthikeyan) తెలుగు లోకి ఎంట్రీ ఇవ్వడం విశేషం. నేడు (అక్టోబర్ 21) శుక్రవారం ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే ఇప్పటికే ఈ సినిమా యూఎస్ ప్రీమియర్స్, స్పెషల్ షోస్ వేశారు.
తెలుగు, తమిళ భాషల్లో ఏక కాలంలో రూపొందిన ప్రిన్స్ సినిమాను దీపావళి కానుకగా విడుదల చేస్తున్నారు. గత రాత్రి ప్రీమియర్స్ చూసిన ఆడియన్స్ ట్విట్టర్ వేదికగా తమ తమ ఫీలింగ్స్ బయటపెడుతున్నారు. ఇది కంప్లీట్ కామెడీ ఎంటర్టైనర్ మూవీ అని నెటిజన్లు పెడుతున్న ట్వీట్స్‌ని బట్టి తెలుస్తోంది. అనుదీప్ స్టైల్లో ఔట్ అండ్ ఔట్ కామెడీ బాగా వర్కవుట్ అయిందని అంటున్నారు.
ఫస్టాఫ్ చాలా బాగుందని, సెకండాఫ్ యావరేజ్ అని అంటున్నారు. ఇక ఈ సినిమాలో కామెడీ అదిరిపోయిందని, ఇది కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ అని అంటున్నారు. ఈ సినిమాతోనే ఇండియన్ సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన మరియా నటన అదుర్స్ అనే టాక్ రావడం ఈ సినిమాకు ప్లస్ అవుతుందని చెప్పుకోవచ్చు. సత్యరాజ్ ఫెర్ఫార్మెన్స్ సినిమాలో హైలైట్ అంటున్నారు. సాంగ్స్, నేపథ్య సంగీతం సూపర్బ్ అనే టాక్ వచ్చింది. మొత్తంగా చెప్పాలంటే ఇది పండగకు ఫ్యామిలీతో ఎంజాయ్ చేసే సినిమా అని మాత్రం ప్రస్తుతానికి ప్రేక్షకుల అభిప్రాయాలను బట్టి తెలుస్తోంది.
#Prince 1st Half Such a cool intro card for #Sivakarthikeyan ????#Jessica #BimbilikkiPilapi dance????#Anudeep brand of comedy ???? Most one liners Working well Bottleguard Gummuru Tapparu ????#Maria looks and her Tamil is cute ❤️ Silly as well as entertaining so far As expected ✌️
— Raaja (@raajaboss) October 21, 2022
పాండిచ్చేరిలో జరిగిన ఒక తమిళ అబ్బాయి, ఇంగ్లిష్ అమ్మాయి ప్రేమకథే ఈ ప్రిన్స్ సినిమా. శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పి, సురేష్ ప్రొడక్షన్స్, శాంతి టాకీస్ బ్యానర్లపై నారాయణ్ దాస్ నారంగ్ ఆశీస్సులతో సునీల్ నారంగ్, డి.సురేష్ బాబు, పుస్కుర్ రామ్మోహన్ రావు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించారు. శివ కార్తికేయన్ సరసన లండన్ అమ్మాయి మరియా హీరోయిన్ గా నటించగా.. సత్యరాజ్ కీలక పాత్ర పోషించారు. మరి కాసేపట్లో ఈ సినిమా పూర్తి రివ్యూ అందించబోతున్నాం.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Kollywood, Tollywood, Tollywood actor