Anu Emmanuel: అను ఇమ్యాన్యుయేల్ ఆ హీరోతో డేటింగ్ చేస్తుందా అంటే ఔననే అంటున్నారు చెన్నై ఫిల్మ వర్గాలు. టాలీవుడ్లో పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్ వంటి అగ్ర హీరోల సరసన నటించిన ఈ అమ్మడికి అంతగా కలిసి రాలేదనే చెప్పాలి. తెలుగు ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా టాప్ రేంజ్‌కు చేరుకుంటుందుకున్న ఈ భామకు కాలం కలిసి రాలేదునే చెప్పాలి. వరుస పరాజయాలు ఈ అమ్మడి కెరీర్‌ను దెబ్బ తీసాయి. దీంతో తెలుగులో ఈ ముద్దుగుమ్మను స్టార్ హీరోలు పట్టించుకోవడం లేదు. అయితే కోలీవుడ్‌లో అప్పుడప్పుడూ ఛాన్సులు అందుకుంది ఈ ముద్దుగుమ్మ. ప్రతీ సినిమాలో అందాలను ఎక్కువగా ఆరబోసి అవకాశాలు అందుకోవాలని చూస్తుంది ఈ బ్యూటీ. తెలుగులో సక్సెస్ కాలేకపోయిన అను ఇమ్మాన్యుయేల్... తమిళంలో పాగా వేయాలని చూస్తుంది. ఈ మధ్యే ఈమె బెల్లంకొండ సరసన నటించిన అల్లుడు అదుర్స్ కూడా డిజాస్టర్ అయింది. ఆ సంగతి పక్కన పెడితే.. ఈ భామ గత కొన్నేళ్లుగా ప్రముఖ నిర్మాత ఏ.ఎం.రత్నం కుమారుడు జ్యోతి కృష్ణతో డేటింగ్లో ఉంది. జ్యోతి కృష్ణ .. 2017లో గోపిచంద్‌తో హీరోగా నటించిన ‘ఆక్సిజన్’ సినిమాను డైరెక్ట్ చేసాడు.
ఈ సినిమాలో ఓ హీరోయిన్గా అను ఇమ్యాన్యుయేల్ నటించింది. ఆ సినిమా నుంచి వీరిద్దరు చాలా క్లోజ్ అయ్యారు. ఆ స్నేహం కాస్తా రిలేషన్ షిప్‌గా మారిందనేది కోలీవుడ్ వర్గాల కథనం. దర్శకుడు జ్యోతి కృష్ణ.. 7/G బృందావన్ కాలనీ హీరో రవికృష్ణ బ్రదర్. ఈ డేటింగ్ విషయమై ఇద్దరు మాత్రం స్పందించడం లేదు. ఆ సంగతి పక్కన పెడితే.. అను ఇమ్మాన్యుయేల్ ..అజయ్ భూపతి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ‘మహా సముద్రం’లో నటిస్తోంది. ఈ సినిమాపై అను .. చాలా ఆశలే పెట్టుకుంది.
Published by:Kiran Kumar Thanjavur
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.