Home /News /movies /

ANU EMANNUEL CHEATED BY PRODUCER IN REGARDS TO REMUNERATION FULL DETAILS FOR YOU MHN

Anu Emmanuel: అను ఇమ్మాన్యుయేల్‌కి రెమ్యునరేషన్ ఇవ్వకుండా షాక్ ఇచ్చిన నిర్మాత... . పూర్తి వివరాలు మీకోసం

Anu Emannuel cheated by producer in regards to remuneration, Full details for you

Anu Emannuel cheated by producer in regards to remuneration, Full details for you

Anu Emmanuel: హీరో అను ఇమ్మాన్యుయేల్ నటించిన అల్లుడు అదుర్స్ సినిమా విషయంలో రావాల్సిన రెమ్యునరేషన్ పూర్తిగా రాలేదని, నిర్మాత అను ఇమ్మాన్యుయేల్‌కు పెండింగ్ అమౌంట్ ఇవ్వడం లేదని టాక్

    మ‌జ్ను చిత్రంతో తెలుగు ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకున్న మ‌ల‌యాళ కుట్టి అను ఇమ్మాన్యుయేల్ అయితే స్టార్ హీరోయిన్‌గా మార‌డానికి అను ఇమ్మాన్యుయేల్‌కు మంచి బ్రేక్ ద‌క్క‌లేదు. అయితే అను ఇమ్మాన్యుయేల్ మాత్రం త‌న ప్ర‌య‌త్నాల‌ను మానుకోలేదు. ఈ ఏడాది సంక్రాంతికి అల్లుడు అదుర్స్‌తో స‌క్సెస్ వ‌స్తుందేమోన‌ని భావించిన‌ప్ప‌టికీ అను ఇమ్మాన్యుయేల్‌కు నిరాశ త‌ప్ప‌లేదు. అయితే ఇక్క‌డ ప్ర‌స్తావించాల్సిన విష‌యం ఏంటంటే.. అల్లుడు అదుర్స్ విష‌యంలో వ్ర‌తం చెడ్డా కూడా ఫ‌లితం ద‌క్క‌లేదు.

    ఇంత‌కీ అస‌లు అల్లుడు అదుర్స్ విష‌యంలో అను ఇమ్మాన్యుయేల్‌కు ఎదురైన చేదు అనుభ‌వం ఏంటి? అనే వివ‌రాల్లోకి వెళితే, ఈ సినిమా కోసం అను ఇమ్మాన్యుయేల్‌ను మాట్లాడే స‌మ‌యంలో డెబ్బై ఐదు ల‌క్ష‌ల రూపాయ‌ల రెమ్యున‌రేష‌న్ ఇస్తాన‌ని అన్నార‌ట‌. అందుకు అను పాప.. ఓకే అంది. సినిమా నిర్మాణ స‌మ‌యంలో ముప్పై ల‌క్ష‌ల రూపాయ‌ల రెమ్యునరేష‌న్ మాత్ర‌మే ఇచ్చార‌ట‌. మిగిలిన న‌ల‌బై ఐదు ల‌క్ష‌ల రూపాయ‌ల రెమ్యున‌రేష‌న్ ఇవ్వ‌లేద‌ట‌. అను ఇమ్మాన్యుయేల్ మేనేజ‌ర్ నిర్మాత‌ల‌ను ఎంత సంప్ర‌దించిన‌ప్ప‌టికీ వారి సైడ్ నుండి ఎలాంటి రెస్పాన్స్ లేద‌ట‌. ఇప్పుడేం చేయ‌లో తెలియ‌క అను ఇమ్మాన్యుయేల్ తెగ బాధ‌ప‌డుతోంద‌ట‌.

    ప్ర‌స్తుతం అను ఇమ్మాన్యుయేల్ అజ‌య్ భూప‌తి ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుత‌న్న మ‌హా స‌ముద్రంలో ఇద్ద‌రు హీరోయిన్స్‌లో ఓ హీరోయిన్‌గా న‌టిస్తుంది. శ‌ర్వానంద్‌, సిద్ధార్థ్ హీరోలుగా న‌టిస్తున్న ఈ చిత్రంలో అదితిరావు హైద‌రి, అను ఇమ్మాన్యుయేల్ హీరోయిన్స్‌గా న‌టిస్తున్నారు. ఎ.కె.ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్‌పై నిర్మిత‌మ‌వుతున్న‌ ఈ చిత్రాన్ని ఆగ‌స్ట్ 19న విడుద‌ల చేయ‌డానికి నిర్మాత అనీల్ సుంక‌ర ప్లాన్ చేస్తున్నారు.
    Published by:Anil
    First published:

    Tags: Alludu Adhurs, Anu emmanuel

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు