KGF-2 Teaser: కెజిఎఫ్-2 టీంకు షాక్.. టీజర్ ను బ్యాన్ చేయాలంటూ నిరసనలు..

KGF-2 Teaser: కెజిఎఫ్-2 చిత్ర టీజర్ ను బ్యాన్ చేయాలని.. ఆ టీజర్ ను యూట్యూబ్ నుంచే గాక ఇతర ప్లాట్ ఫాం ల నుంచి కూడా తీసేయాలని కర్నాటక స్టేట్ యాంటీ టొబాకో సెల్ డిమాండ్ చేసింది.

news18
Updated: January 14, 2021, 8:30 PM IST
KGF-2 Teaser: కెజిఎఫ్-2 టీంకు షాక్.. టీజర్ ను బ్యాన్ చేయాలంటూ నిరసనలు..
రాకింగ్ స్టార్ యశ్
  • News18
  • Last Updated: January 14, 2021, 8:30 PM IST
  • Share this:
దేశవ్యాప్తంగా అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన కెజిఎఫ్-2 టీజర్ ఇటీవలే విడుదలై సంచలనాలు సృష్టిస్తున్న విషయం తెలిసిందే. బాహుబలి తర్వాత ఆ రేంజ్ అంచనాలతో ఈ సినిమా విడుదలవుతున్నది. అందుకు తగ్గట్టుగానే టీజర్ లో సీన్స్ ఉన్నాయి. 2.16 నిమిషాల నిడివి ఉన్న టీజర్ లో తాను ఏం చూపించబోతున్నాడో ప్రేక్షకులకు క్లారిటీ ఇచ్చేశాడు డైరెక్టర్ ప్రశాంత్ నీల్. ఇక టీజర్ రెస్పాన్స్ కూడా మామూలుగా లేదు. టీజర్ విడుదలైన 48 గంటల్లోపే 100 మిలియన్ వ్యూస్ దక్కించుకున్న చిత్రంగా కెజిఎఫ్ రికార్డులు నెలకొల్పింది. కానీ ఇప్పుడు చిత్ర దర్శక నిర్మాతలకు కొత్త తలనొప్పులు మొదలయ్యాయి.

కెజిఎఫ్-2 చిత్ర టీజర్ ను బ్యాన్ చేయాలని.. ఆ టీజర్ ను యూట్యూబ్ నుంచే గాక ఇతర ప్లాట్ ఫాం ల నుంచి కూడా తీసేయాలని కర్నాటక స్టేట్ యాంటీ టొబాకో సెల్ డిమాండ్ చేసింది. ఈ మేరకు ఈ చిత్ర దర్శక నిర్మాతలతో పాటు హీరో యశ్ కు కూడా నోటీసులు జారీ చేశారు.



యాంటీ టొబాకో సెల్ సభ్యుల ప్రధాన ఆరోపణ ఏమిటంటే.. ఈ సినిమాలో చివర్లో వచ్చే సీన్ లో నిబంధనలు పాటించలేదని అంటున్నారు. అందులో హీరో యశ్.. ఓ భారీ గన్ తో తన ముందున్న వాహనాలను షూట్ చేసి.. ఆ తుపాకీ గొట్టం నుంచి వచ్చే మంటతో సిగరెట్ ముట్టించుకుంటాడు. అయితే ఆ సీన్ ప్రేక్షకులకు చూపించే సమయంలో ‘యాంటీ స్మోకింగ్ వార్నింగ్’ వేయలేదని సదరు సభ్యులు ఆరోపిస్తున్నారు.

కెజిఎఫ్ తో యశ్ రేంజ్ అందనంత ఎత్తుకు వెళ్లిన విషయం తెలిసిందే. ఇక కెజిఎఫ్-2 విడుదల కాకముందే అతడు దేశవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నాడు. ఈ నేపథ్యంలో ప్రజాధరణ ఎక్కువ ఉన్న నటులు ఏం చేసినా అభిమానులు దానిని అనుకరిస్తారని.. తమ హీరో సిగరెట్ తాగుతున్నాడని వాళ్లు కూడా తాగితే అది లేని పోని అనర్థాలకు కూడా దారి తీస్తుందని వాళ్లు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఇంతకుముందు కెజిఎఫ్-1 విడుదల సందర్భంగా కూడా ఈ చిత్రంలోని పలు దృశ్యాలపై సభ్యులు అభ్యంతరాలు వ్యక్తం చేసినా తమ విన్నపాన్ని దర్శక నిర్మాతలు పట్టించుకోలేదని వారు తెలిపారు.
Published by: Srinivas Munigala
First published: January 14, 2021, 8:30 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading