హోమ్ /వార్తలు /సినిమా /

అంతేలే కథ అంతేలే.. తనీష్ హీరోగా డిఫరెంట్ లైనప్‌తో స్టోరీ రెడీ

అంతేలే కథ అంతేలే.. తనీష్ హీరోగా డిఫరెంట్ లైనప్‌తో స్టోరీ రెడీ

Anthele Katha Anthele News 18

Anthele Katha Anthele News 18

డిఫరెంట్ కాన్సెప్ట్ చిత్రం "అంతేలే కథ అంతేలే". రిధిమ క్రియేషన్స్ పతాకంపై తనీష్, వికాస్ వశిష్ట (సినిమాబండి) సహర్ కృష్ణన్ (హీరోయిన్) , శ్రీనివాస్ నటీనటులుగా ఎమోషన్ ప్యాక్డ్ మూవీగా ఈ సినిమాను రూపొందిస్తున్నారు.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

అనంతపురం బ్యాక్‌డ్రాప్‌లో రాబోతున్న డిఫరెంట్ కాన్సెప్ట్ చిత్రం "అంతేలే కథ అంతేలే" (Anthele Katha Anthele). రిధిమ క్రియేషన్స్ పతాకంపై తనీష్ (Taneesh), వికాస్ వశిష్ట (Vikas Vashishta) (సినిమాబండి), సహర్ కృష్ణన్ (Sahar Krishnan) (హీరోయిన్), శ్రీనివాస్ నటీనటులుగా ఎమోషన్ ప్యాక్డ్ మూవీగా ఈ సినిమాను రూపొందిస్తున్నారు. శ్రీ M నివాస్ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ చిత్రానికి సంబంధించి సెప్టెంబర్‌లో షూటింగ్ ప్రారంభం చేయబోతున్నారు. ఈ సందర్బంగా చిత్ర యూనిట్ పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేసింది.


ఈ సమావేశంలో చిత్ర దర్శకుడు శ్రీ యం నివాస్ మాట్లాడుతూ.. రిధిమ క్రియేషన్స్ పతాకంపై నా డైరెక్షన్ లో అంతేలే కథ అంతేలే సినిమా నిర్మిస్తున్నాము. సినిమా బండితో అందరినీ మెప్పించిన నటుడు వికాస్ వశిష్ట ఇంకా తనీష్ హీరోలుగా, సెహర్ కృష్ణన్ హీరోయిన్ గా నటిస్తున్నారు. వచ్చే నెలలో షూటింగ్ వెళుతున్న ఈ సినిమా రాయలసీమ ప్రాంతంలోని ఒక మారుమూల గ్రామంలో జరిగే కథ, అనేక భావోద్వేగాలు ఈ కథలో మిళితమై ఉంటాయి అన్నారు.


హీరో తనీష్ మాట్లాడుతూ.. ఇలాంటి సినిమాలు చాలా తక్కువ మంది అటెంప్ట్ చేస్తారు. అయితే ఇలాంటి సినిమాలు తక్కువ వచ్చినా ప్రేక్షకులు అదరిస్తారు. ఇప్పటి వరకు నాకున్న ఇమేజ్, నేను చేసిన పాత్రల నుంచి బయటకు వచ్చి చేస్తున్న అద్భుతమైన ఎమోషన్స్ తో కూడిన పాత్ర ఇది.ఇందులో హ్యూమన్ రిలేషన్స్ చాలా కొత్తగా ఉంటాయి. ఈ సినిమా చూసి బయటకు వచ్చే ప్రేక్షకులు గుండెలు బరువెక్కుతాయి. మంచి కథతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా మంచి విజయం సాధించాలి అన్నారు


మరో హీరో వికాస్ వశిష్ట మాట్లాడుతూ.. సినిమా బండి తరువాత చేస్తున్న ఈ సినిమా టైటిల్ లోనే కథ ఉంది. ఇందులో మంచి ఎమోషన్ ఉంటుంది. మంచి టీం దొరికింది. నివాస్ గారు ఈ కథ చెప్పినపుడు చాలా నచ్చింది. ఇందులో ఎక్కువ మాటలు ఉండవు కానీ ఎమోషన్ కథను క్యారీ చేస్తుంది. ఈ సినిమాను కూడా నాకు మంచి పేరు తీసుకువస్తుందని ఆశిస్తున్నాను అన్నారు.


హీరోయిన్ సహార్ కృష్ణన్ మాట్లాడుతూ.. నా యాక్టింగ్ చూడకుండానే నన్ను ఇంత ఎమోషన్ ఉన్న పాత్రకు సెలెక్ట్ చేసుకున్న దర్శక, నిర్మాతలకు ధన్యవాదములు. నా కిచ్చిన పాత్రను 100% ప్రేక్షకులను మెప్పించేలా పోసిస్తాను అన్నారు. నటుడు శ్రీనివాస్ మాట్లాడుతూ.. సీనియర్ నటి గీతాంజలి రామకృష్ణ గారి అబ్బాయిని. ఇంతకుముందు నేను కొన్ని సినిమాలు చేశాను. ఈ సినిమాలో నాకు మంచి గుర్తింపు వచ్చే పాత్ర దొరికింది అన్నారు.


First published:

Tags: Tollywood, Tollywood actor, Tollywood Cinema

ఉత్తమ కథలు