హోమ్ /వార్తలు /సినిమా /

Ante Sundaraniki Day 1 Collections: మొదటి రోజు అంటే సుందరానికీ పరిస్థితి ఎలా ఉందంటే!

Ante Sundaraniki Day 1 Collections: మొదటి రోజు అంటే సుందరానికీ పరిస్థితి ఎలా ఉందంటే!

Photo Twitter

Photo Twitter

Ante Sundaraniki Collections: నాచురల్ స్టార్ నాని (Nani) హీరోగా రూపొందిన కొత్త సినిమా 'అంటే సుందరానికీ' (Ante Sundaraniki). వివేక్ ఆత్రేయ (Vivek Athreya) దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ (Mytri Movie Makers) బ్యానర్‌పై ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందించారు. ఈ సినిమా తొలిరోజు ఏ మేర వసూళ్లు రాబట్టిందో చూద్దామా..

ఇంకా చదవండి ...

నాచురల్ స్టార్ నాని (Nani) హీరోగా రూపొందిన కొత్త సినిమా 'అంటే సుందరానికీ' (Ante Sundaraniki). వివేక్ ఆత్రేయ (Vivek Athreya) దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ (Mytri Movie Makers) బ్యానర్‌పై ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందించారు. చిత్రంలో నాని సరసన నజ్రియా నజీం (Nazriya Nazim) హీరోయిన్‌గా నటించగా.. నదియా, హర్ష వర్ధన్, రోషిని ఇతర ముఖ్యపాత్రలు పోషించారు. నేడు (జూన్ 10) ఈ మూవీ గ్రాండ్‌గా విడుదలైంది. విడుదలకు ముందు ఈ సినిమా నుంచి వదిలిన అప్‌డేట్స్ భారీ హైప్ తీసుకొచ్చాయి. తొలిరోజు ఈ సినిమాకు మిశ్రమ స్పందన లభించింది. మరి ఫస్ట్ డే ఈ సుందరానికి ఎంత వసూళ్లు వచ్చాయో చూద్దామా..

అమెరికాలో అంటే సుందరానికీ చిత్రానికి సంబంధించి 302 లొకేషన్లలో ప్రీమియర్లు వేశారు. ఈ ప్రీమియర్స్ ద్వారా 237k డాలర్లు, అలాగే తొలి రోజున 198k డాలర్లు వసూలయ్యాయి. దాంతో మొత్తంగా తొలి రోజు ముగిసే సమయానికి 435k డాలర్లు రాబట్టాడు ఈ సుందరం. ఇండియన్ కరెన్సీలో చూస్తే ఈ సినిమాకు 3.4 కోట్ల రూపాయలు వచ్చాయి.

రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా వసూళ్లు ఫర్వాలేదనిపించాయి. నైజాంలోని పలు ప్రాంతాల్లో చెప్పుకోదగిన కలెక్షన్లను సాధించింది ఈ అంటే సుందరానికి మూవీ. తొలి రోజున అన్ని ప్రాంతాల్లో కలిపి ఈ చిత్రం నైజాంలో 3.5 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. రెండో రోజు కూడా ఈ సినిమాకు అంతంత మాత్రంగానే అడ్వాన్స్ బుకింగ్ వచ్చాయని తెలుస్తోంది. నైజాం, ఆంధ్రాలో కలిపి 4 కోట్ల గ్రాస్ వసూళ్లను నమోదు చేసింది ఈ మూవీ. ప్రపంచవ్యాప్తంగా చూస్తే ఈ సినిమాకు తొలి రోజున 7.5 కోట్ల గ్రాస్ వసూలైందని ట్రేడ్ వర్గాల రిపోర్ట్స్ చెబుతున్నాయి.


సినిమా విడుదలకు ముందు ఈ అంటే సుందరానికీ మూవీ ప్రీ రిలీజ్ వేడుకను ఘనంగా నిర్వహించగా.. ఈ వేడుకకు ముఖ్య అతిథిగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ విచ్చేసి వేదికపై ఆసక్తికర విషయాలు ప్రస్తావించారు. ముఖ్యంగా నాని వ్యక్తిత్వం గురించి ఆయన చేసిన కామెంట్స్ వైరల్ అయ్యాయి. ఈ అంటే సుందరానికీ సినిమా సూపర్ సక్సెస్ కావాలని, నాని ఇంకా ఎన్నో విజయాలు అందుకోవాలని పవన్ కళ్యాణ్ కోరుకున్నారు.

First published:

Tags: Ante sundaraniki, Hero nani, Tollywood

ఉత్తమ కథలు