వివేక్ ఆత్రేయ (Vivek Athreya) దర్శకత్వంలో నాచురల్ స్టార్ నాని (Nani) హీరోగా రూపొందిన కొత్త సినిమా 'అంటే సుందరానికీ' (Ante Sundaraniki). మైత్రీ మూవీ మేకర్స్ (Mytri Movie Makers) బ్యానర్‌పై ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందిన ఈ చిత్రంలో నజ్రియా నజీం (Nazriya Nazim) హీరోయిన్గా నటించగా.. నదియా, హర్ష వర్ధన్, రోషిని కీలక పాత్రలు పోషించారు. జూన్ 10వ తేదీన ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదలైంది. తొలిరోజు మిశ్రమ స్పందన తెచ్చుకున్న ఈ సినిమా రెండో రోజు, మూడో రోజు కూడా డీసెంట్ కలెక్షన్స్ రాబట్టింది. మొదటిరోజుతో పోల్చితే రెండో రోజు, మూడో రోజు కలెక్షన్స్‌లో పెద్దగా డ్రాప్ కనిపించలేదు. కానీ నాలుగో రోజుకు వచ్చే సరికి చతికిలపడ్డాడు సుందరం.
రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటివరకు ఈ సుందరం వసూళ్లు చూస్తే..
Day 1: 3.87Cr
Day 2: 3.48Cr
Day 3: 3.05Cr
Day 4: 71L
AP-TG టోటల్: 11.11 కోట్ల నెట్(18.80 కోట్ల రూపాయల గ్రాస్) వసూలైనట్లు ట్రేడ్ వర్గాల రిపోర్ట్స్ చెబుతున్నాయి.
ఇక నాలుగో రోజు ఏరియా వైజ్ డీటెయిల్ రిపోర్ట్ చూద్దామా..
Nizam: 40L
Ceeded: 4L
UA: 10L
East: 5L
West: 3L
Guntur: 3L
Krishna: 4L
Nellore: 2L
AP-TG Total:- 0.71CR నెట్ (1.20CR~ గ్రాస్)
అదేవిధంగా కర్ణాటక, రెస్ట్ ఆఫ్ ఇండియా కలిసి 1.20Cr కోట్లు వసూలు చేసిన అంటే సుందరానికి సినిమా ఓవర్సీస్ లో మరో 3.80Cr కోట్లు రాబట్టింది. దీంతో మొత్తంగా ప్రపంచవ్యాప్తంగా చూస్తే ఈ నాలుగు రోజుల్లో సుందరానికి 16.11CR నెట్ (28.35CR~ గ్రాస్) వసూలైంది.
అంటే సుందరానికి సినిమాకు విడుదలకు ముందు భారీ బజ్ నెలకొంది. ప్రీ రిలీజ్ బిజినెస్ పరంగా చూస్తే ఈ అంటే సుందరానికీ మొత్తం 30 కోట్ల బిజినెస్ చేసి 31 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ పెట్టుకొని బరిలోకి దిగింది. అంటే ఇంకా 14.89Cr కోట్లు రాబడితే ఈ సినిమా బ్రేక్ ఈవెన్ క్రాస్ చేస్తుంది. అయితే సోమవారం రోజు భారీ డ్రాప్ కనిపించడంతో ఈ వారంలో సుందరం హవా ఎలా ఉండనుందనే దానిపై అనుమానాలు షురూ అయ్యాయి. సో.. చూడాలి మరి ఈ వీక్ అంటే సుందరానికి సినిమా పరిస్థితి ఎలా ఉంటుందనేది!.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Ante sundaraniki, Hero nani, Tollywood