నాచురల్ స్టార్ నాని (Nani) హీరోగా రూపొందుతున్న కొత్త సినిమా 'అంటే సుందరానికీ' (Ante Sundaraniki). వివేక్ ఆత్రేయ (Vivek Athreya) దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందించారు. ఈ మూవీ జూన్ 10వ తేదీన విడుదల కాబోతున్న నేపథ్యంలో చిత్ర ప్రమోషన్స్‌పై స్పెషల్ ఫోకస్ పెట్టారు మేకర్స్. ఈ మేరకు ప్రమోషన్స్‌తో బిజీ అయిన హీరో నాని.. పలు ఇంటర్వ్యూల్లో పాల్గొంటూ ఈ సినిమా విశేషాలతో పాటు అనేక ఆసక్తికర విషయాలు బయటపెడుతున్నారు. ఈ క్రమంలోనే గత రాత్రి ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకకు ముఖ్య అతిథిగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) విచ్చేసి వేదికపై ఆసక్తికర విషయాలు ప్రస్తావించారు. ముఖ్యంగా నాని వ్యక్తిత్వం గురించి ఆయన చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
వేదికపై నాని గురించి పవన్ కళ్యాణ్ మాట్లాడుతుంటే ఈలలతో వేదిక ప్రాంగణమంతా మారుమోగిపోయింది. ఈ వేడుకకు విశిష్ట అతిథులు మీరే.. ఈ వేడుకకు వచ్చిన అభిమానులకు ధన్యవాదాలు అంటూ స్పీచ్ ప్రారంభించిన పవన్.. హీరో నానిపై పాజిటివ్ కామెంట్స్ చేశారు. నాని గారి నటనే కాకుండా ఆయన వ్యక్తిత్వం తనకు చాలా ఇష్టం అని చెప్పారు పవన్. ఆయన బలంగా నిలబడే వ్యక్తి అని, భగవంతుడు నానికి గొప్ప విజయాలు ఇవ్వాలని పవన్ కోరుకున్నారు. ముందు ముందు నాని అద్భుతమైన విజయాలు సాధించాలని అన్నారు. హీరోయిన్గా నటించిన నజ్రియా నజీంకి, నరేష్ వీకే, నదియా, రోహిణికి, నజ్రియా ఇతర నటీనటులందరికీ ధన్యవాదాలు చెప్పారు పవన్ కళ్యాణ్.
ఇకపోతే టాలీవుడ్(Tollywood) ఇండస్ట్రీ ఏ ఒక్కరి సొత్తు కాదని, ఇది అందరిదీ అని చెబుతూ భావోద్వేగ పూరిత కామెంట్స్ చేశారు పవన్ కళ్యాణ్. ఇక్కడ అనేక రకాల వ్యక్తులు కలిసి పనిచేస్తారని, టాలీవుడ్ ఓ కుటుంబానిది కాదని ఆయన పేర్కొనడం సర్వత్రా చర్చనీయాంశం అయింది. అదేవిదంగా ఎవరి సినిమా అయినా బావుండాలని పవన్ కోరకుంటామన్నారు. సినిమాలు వేరు రాజకీయం వేరని ఈ సందర్భంగా పవన్ పేర్కొన్నారు.
రీసెంట్గా శ్యామ్ సింగరాయ్ సినిమాతో పలకరించిన నాని.. ఇప్పుడు 'అంటే సుందరానికి' అంటూ ప్రేక్షకుల ముందుకొచ్చారు. అలాగే దసరా అనే మరో సినిమాతో త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు నాని. ఇప్పటికే ఈ మూవీ షూటింగ్ కంప్లీట్ కావడంతో రిలీజ్ డేట్ వేట కొనసాగిస్తున్నారు. అతి త్వరలో ఈ దసరా ఎప్పుడనేది ప్రకటించనున్నారట మేకర్స్.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Ante sundaraniki, Hero nani, Pawan kalyan