హోమ్ /వార్తలు /సినిమా /

Ante Sundaraniki: అంటే సుందరానికి ఓటీటీ డేట్ ఫిక్స్.. ఎందులో వస్తుందంటే?

Ante Sundaraniki: అంటే సుందరానికి ఓటీటీ డేట్ ఫిక్స్.. ఎందులో వస్తుందంటే?

అంటే సుందరానికి ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్

అంటే సుందరానికి ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్

ఈ సినిమా జూన్ 10న థియేటర్లో విడుదల అయ్యింది. ఈ సినిమా రొమాంటిక్ ఎంటర్ టైనర్ డిజిటల్ రైట్స్ ను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌‌ఫ్లీక్స్ సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది.

న్యాచురల్ స్టార్ నాని(Nani), మలయాళ బ్యూటీ నజ్రియా ఫహద్ జంటగా వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో తెరకెక్కిన ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ “అంటే సుందరానికీ”(Ante Sundaraniki). జూన్‌ 10న తెలుగు, తమిళ్, మలయాళం భాషల్లో 'అంటే సుందరానికి' ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇదిలా ఉంటే ఈ సినిమా థియేటర్లలో విడుదల కాకముందే అప్పుడే ఓటీటీ స్ట్రీమింగ్ (OTT Streaming) గురించి వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమా జూన్ 10న థియేటర్లో విడుదల అయ్యింది. ఈ సినిమా రొమాంటిక్ ఎంటర్ టైనర్ డిజిటల్ రైట్స్ ను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌‌ఫ్లీక్స్(Netflix) సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది.

రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా వస్తున్న 'అంటే సుంద‌రానికి' సినిమా ఓటీటీ హక్కులను నెట్‌ఫ్లిక్స్ సొంత చేసుకున్నట్లు నిర్మాతల్లో ఒకరు తన ఇన్‌స్టాగ్రామ్‌లో పేర్కొన్నారు. దీన్ని బట్టి చూస్తుంటే నాని సినిమా విడుదలైన మూడు వారాల్లోనే ఓటీటీ లో స్ట్రీమింగ్ అవుతుంది అని వార్తలు వినిపిస్తున్నాయి. వచ్చేనెల ఒకటవ తేదీనే అంటే సుందరానికి సినిమా ఓటీటీలో రిలీజ్ అవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇదే నిజమైతే నాని సినిమా విడుదలైన 20 రోజులకే ఓటీటీలో వచ్చేస్తుందన్నమాట. మరోవైపు ఈ సినిమా ఓటీటీలో అంత త్వరగా విడుదల కాదని చెప్పటం విశేషం. ఇటీవల కాలంలో టాప్ హీరోల సినిమాలు రెండు వారాలకే ఓటీటీలలోకి వచ్చేస్తున్నాయి. దాంతో థియేటర్లలో ప్రేక్షకులు కరువయ్యారు.

ఇది గమనించిన హీరో నాని ‘అంటే సుందరానికి’ మూవీ రెండు నెలల వరకూ ఓటీటీలో విడుదల చేయవద్దని నిర్మాతలను కోరినట్లు తెలుస్తోంది. అయితే ఓటీటీ రిలీజ్ అగ్రిమెంట్ ఇదివరకే జరిగి ఉంటే.. హీరో నాని అభ్యర్థనను నిర్మాతలు పెద్దగా పట్టించుకోకపోవచ్చు. ఇక సినిమా రిలీజ్ అయిన తర్వాత పాజిటివ్ టాక్ వస్తే.. నాని సూచనను పరిగణనలోకి తీసుకునే అవకాశం ఉంది. ఒకవేళ నెగటివ్ టాక్ వస్తే మాత్రం వెంటనే ఓటీటీలోకి విడుదల అయ్యే అవకాశం ఉంది. ఇటీవలి కాలంలో విడుదలైన భీమ్లా నాయక్, రాధేశ్యామ్, ఆచార్య, గని సినిమాలు అనుకున్న తేదీ కంటే.. ముందుగానే ఓటీటీలో వచ్చిన విషయం తెలిసిందే. మరి నాని తాజా సినిమా అంటే సుందరానికి ఎన్నిరోజుల్లో ఓటీటీలో వచ్చే అవకాశం ఉందో వేచి చూడాల్సిందే.

First published:

Tags: Ante sundaraniki, Hero nani, Ott realease, Tollywood

ఉత్తమ కథలు