హోమ్ /వార్తలు /సినిమా /

Ante Sundaraniki: నాలుగు వారాల్లో ఓటీటీలోకి.. అంటే సుందరానికి సినిమా..!

Ante Sundaraniki: నాలుగు వారాల్లో ఓటీటీలోకి.. అంటే సుందరానికి సినిమా..!

నాని ‘అంటే సుందరానికీ’ మూవీ ఓటీటీ రిలీజ్

నాని ‘అంటే సుందరానికీ’ మూవీ ఓటీటీ రిలీజ్

నాని తాజా సినిమా అంటే సుందరానికి ఓటీటీ రిలీజ్ కేవలం నాలుగు వారాల్లోనే ఉంటుందని అంటున్నారు సినీ వర్గాలు. నాని సినిమా నాలుగు వారాల తర్వాత ఓటీటీ రిలీజ్ చేసేలా నిర్మాతలతో డీల్ సెట్ చేసుకున్నారని సమాచారం.

  నేచురల్ స్టార్ నాని (Nani),నజ్రియా నటిస్తోన్న మరో సినిమా ‘అంటే సుందరానికీ’.. (Ante Sundaraniki) ఈ సినిమాకు వివేక్ ఆత్రేయ దర్శకుడు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించారు. ఈ చిత్రాన్ని తెలుగుతో పాటు తమిళ్, మళయాళ భాషల్లో రిలీజ్ కానుంది. రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్‌గా వస్తోన్న ఈ సినిమా జూన్ 10న థియేటర్లలో విడుదల కానుంది. దీంతో ఈ సినిమాకు సంబంధించి సెన్సార్ కూడా పూర్తి చేసుకుంది. అంటే సుందరానికి సెన్సార్ సభ్యులు క్లీన్ యూ సర్టిఫికెట్‌ను ఇష్యూ చేసినట్లు తెలుస్తోంది. ఇక సినిమా 2 గంటల 56 నిమిషాల నిడివి ఉంది. కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ సినిమా రిజల్ట్ మీద నాని చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాడు.

  అంటే సుందరానికీ సినిమా థియేట్రికల్ బిజినెస్ అదిరిపోయిందని తెలుస్తుంది. ఇక ఈ సినిమా డిజిటల్ బిజినెస్ కూడా అమేజాన్ ప్రైం కొనేసినట్టు టాక్ వినిపిస్తోంది. నాని కెరియర్ లో హయ్యెస్ట్ డిజిటల్ బిజినెస్ ఈ మూవీ చేసిందని తెలుస్తుంది. తెలుగుతో పాటుగా తమిళ, కన్నడ, మళయాళ భాషల్లో అంటే సుందరానికీ రిలీజ్ అవుతుంది. అందుకే అన్ని భాషల్లో డిజిటల్ బిజినెస్ భారీగా జరిగిందని సమాచారం. ఇక జూన్ 10న అంటే సుందరానికీ థియేట్రికల్ రిలీజ్ అవుతుండగా సినిమా ఓటీటీ రిలీజ్ కేవలం నాలుగు వారాల్లోనే ఉంటుందని అంటున్నారు సినీ వర్గాలు. సినిమాను బట్టి ఓటీటీల ఒప్పందం ఉంటుంది. నాని సినిమా నాలుగు వారాల తర్వాత ఓటీటీ రిలీజ్ చేసేలా నిర్మాతలతో డీల్ సెట్ చేసుకున్నారట. మొత్తానికి నాని అంటే సుందరానికీ అన్ని విషయాల్లో చాలా స్పీడ్ గా ఉన్నాడని తెలుస్తుంది.

  ఇప్పటికే ట్రైలర్ విడుదలైంది. సుందర్, లీలా థామస్ పాత్రల్లో నాని, నజ్రియా నజీమ్‌లు అదరగొట్టారు. ఏడు మహా సముద్రాలను దాటి USAలో అడుగుపెట్టిన సుందర్ అక్కడ ఎలా లీలా థామస్‌ను కలిసారు. ఆ తర్వాత ఏం జరిగింది. ఈ ఇద్దరి వల్ల రెండు ఫ్యామిలీల్లో ఎలాంటీ పరిణామాలు జరిగాయి, సుందర్, లీలాలు ఎలా తమ లవ్‌ను విజయవంతంగా పెళ్లి వరకు తీసుకెళ్లారు.. అనేది కథగా తెలుస్తోంది. తాజాగా విడుదలైన ట్రైలర్‌ ఓ ఫన్ రైడ్‌లా ఆకట్టుకుంటోంది. నాని, నజ్రీయాతో పాటు సహాయ నటీనటులు నరేష్, నదియా, హర్షవర్ధన్ తదితరులు తమ పాత్రల్లో వావ్ అనిపించారు.

  శ్యాం సింగ రాయ్ లాంటి సీరియస్ సినిమా తర్వాత నాని ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ తో మరో హిట్ తన ఖాతాలో వేసుకుంటాడని చెబుతున్నారు. గత యేడాది నాచురల్ స్టార్ నాని హీరోగా నటించిన మూవీ ‘శ్యామ్ సింగరాయ్’.(Shyam Singha Roy) మూవీతో మంచి సక్సెస్ అందుకున్నారు. అంతకు ముందు నాని నటించిన రెండు చిత్రాలు ‘వీ’(V), ‘టక్ జగదీష్’ (Tuck Jagadish) సినిమాలు ఓటీటీ వేదికగా విడుదలై ఓకే అనిపించుకున్నాయి..

  Published by:Sultana Shaik
  First published:

  Tags: Ante sundaraniki, Hero nani, Natural star nani

  ఉత్తమ కథలు