ANR NTR: ఆ సంఘటన ఎన్టీఆర్, ఏఎన్నార్ మధ్య విభేదాలకు కారణమైందా...

ANR NTR | తెలుగు చిత్ర పరిశ్రమకు ఎన్టీఆర్, ఏఎన్నార్ రెండు కళ్ల లాంటి వారు. వీళ్లు తెలుగు సినిమా ఇండస్ట్రీకి స్టార్‌డమ్ అంటే ఏమిటో పరిచయం చేసారు. అలాంటిది వీళ్ల మధ్య కూడా ఓ సంఘటన మనస్పర్ధలకు దారి తీసింది.

news18-telugu
Updated: September 20, 2020, 4:14 PM IST
ANR NTR: ఆ సంఘటన ఎన్టీఆర్, ఏఎన్నార్ మధ్య విభేదాలకు కారణమైందా...
అక్కినేని,కృష్ణ,మధ్యలో ఎన్టీఆర్ (Twitter/Photo
  • Share this:
తెలుగు చిత్ర పరిశ్రమకు ఎన్టీఆర్, ఏఎన్నార్ రెండు కళ్ల లాంటి వారు. వీళ్లు తెలుగు సినిమా ఇండస్ట్రీకి స్టార్‌డమ్ అంటే ఏమిటో పరిచయం చేసారు. వీళ్లిద్దరు ఎన్నో సినిమాల్లోకలిసి పనిచేసారు. అంతేకాదు వీళ్లిద్దరు స్టూడియోల నిర్మాణంతో తెలుగు నేలలో టాలీవుడ్ ఇండస్ట్రీ నిలదొక్కుకునేలా చేసారు. ఎంతో అన్యోన్యంగా ఉన్న వీళ్లిద్దరి మధ్య కూడా ఎన్నో మనస్పర్ధలు వచ్చాయి. అప్పట్లో వీళ్లిద్దరు మల్టీస్టారర్ సినిమాలు చేయకూడదనే నిర్ణయానికి వచ్చారు. ఎన్టీఆర్,ఏఎన్నార్ ఏదో ఇష్యూ వచ్చి జమునతో నటించకూడదనే నిర్ణయానికి వచ్చారు. అప్పట్లో నాగిరెడ్డి, చక్రపాణి.. ఎన్టీఆర్, ఏఎన్నార్, జమునల మధ్య రాజీ కుదిర్చి ‘గుండమ్మకథ’ లో  జమునను ఓ హీరోయిన్‌గా తీసుకున్నారు.

ఎన్టీఆర్, ఏఎన్నార్, ఎస్పీఆర్ (File/Photo)


ఆ సంగతి పక్కనపెడితే.. అల్లూరి సీతారామరాజు సినిమా విషయంలో ఎన్టీఆర్, కృష్ణ మధ్య విభేదాలు కూడా ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయింది. ఆ తర్వాత అల్లూరి సీతారామరాజు విడుదలైన కొన్ని రోజులకు ఈ సినిమా చేయాలనుకున్నారు. కానీ అప్పటికే కొంత మంది కృష్ణ చేసిన అల్లూరి సీతారామరాజు సినిమాను చూడమని చెప్పడంతో .. కృష్ణను పిలిపించి అల్లూరి సీతారామరాజు సినిమాను చూసి కృష్ణను అభినందించారు ఎన్టీఆర్.  కృష్ణ.. అప్పట్లో విజయ నిర్మలతో కలిసి ఏఎన్నార్ ఆల్ టైమ్ క్లాసిక్ .. దేవదేసు’ సినిమాను సినిమా స్కోప్‌లో రీమేక్ చేసారు. అదే టైమ్‌లో ఎన్టీఆర్‌కు చెందిన కొంత మంది వ్యక్తులు ..పాత దేవదాసు రైట్స్ తీసుకొని ఒక వారం ముందుగా మళ్లీ రీ రిలీజ్ చేసారు. మ్యూజికల్‌గా మంచి పాటలున్న కృష్ణ, విజయ నిర్మల దేవదాసు.. ఏఎన్నార్ దేవదాసు ముందు  బాక్సాఫీస్ దగ్గర చతికిల పడింది. ఇక ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వెళ్లిన తర్వాత కృష్ణ..కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయి.. ఎన్టీఆర్ పై ‘మండలాదీశుడు’,‘గండిపేట రహస్యం’, నా పిలుపే ప్రభంజనం’ వంటి పలు సెటైరికల్ మూవీస్ చేసి ఎన్టీఆర్‌కు సవాల్ విసిరారు.

balakrishna vs chiranjeevi tollywood issues before ntr anr krishna time,.balakrishna,chiranjeevi,balakrishna vs chiranjeevi,chiru,balayya,ntr,anr,ntr vs anr,ntr vs krishna,krishna,jr ntr,balakrishna youtube interview,balakrishna about jr ntr,balayya about jr ntr,balayya about jr ntr political entry,balayya youtube interview,janatha garage,balakrishna jr ntr janatha garage,rrr,rrr jr ntr,Simhadri,balakrishna jr ntr Simhadri,balakrishna rejected simhadri movie,rajamouli,balakrishna nandamuri ss rajamouli,vijayendra prasad,balakrishna facebook,balakrishna instagram,balakrishna twitter,rajamouli instagram,rajamouli twitter,rajamouli facebook,jr ntr,jr ntr twitter,jr ntr instagram,jr ntr facebook,ss rajamouli,#balakrishna,ss rajamouli about balakrishna,balakrishna nandamuri (film actor),s s rajamouli,rajamouli movies,ss rajamouli interview,balakrishna rajamouli,balakrishna movies,rajamouli sensational comments on balakrishna,balakrishna rajamouli movie,balakrishna meeting rajamouli,balakrishna new movies,balakrishna interview,balakrishna rajamouli movie latest updates,tollywood,telugu cinema,బాలయ్య,బాలకృష్ణ నందమూరి,బాలకృష్ణ రాజమౌళి,ఎస్ఎస్ రాజమౌళి,రాజమౌళి,జూనియర్ ఎన్టీఆర్,సింహాద్రి,సింహాద్రి ఎన్టీఆర్ బాలకృష్ణ,టాలీవుడ్ న్యూస్,తెలుగు సినిమా,జనతా గ్యారేజ్,బాలకృష్ణ జూనియర్ ఎన్టీఆర్ జనతా గ్యారేజ్,ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీపై బాలకృష్ణ ఆసక్తికర వ్యాఖ్యలు,ఎన్టీఆర్ రాజకీయ ఆరంగేట్రంపై బాలయ్య వ్యాఖ్యలు,బాలకృష్ణ ఎన్టీఆర్,ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీ పై బాలకృష్ణ కామెంట్స్,చిరంజీవి,ఎన్టీఆర్,ఏఎన్నార్,ఎన్టీఆర్ వర్సెస్ ఏఎన్నార్,అక్కినేని వర్సెస్ నందమూరి,కృష్ణ వర్సెస్ ఎన్టీఆర్
ఎన్టీఆర్‌తో కృష్ణ (Twitter/Photo)


ఇక ఎన్టీఆర్ ముఖ్యమంత్రి అయిన కొత్తలో ఏఎన్నార్‌తో అన్నపూర్ణ స్టూడియో  ప్రభుత్వం స్థలాన్ని ఆక్రమించి కట్టారనే విషయంలో పెద్ద ఇష్యూ నడిచింది.  అప్పట్లో సీఎంగా ఉన్న ఎన్టీఆర్.. అక్కినేనికి సంబంధించిన అన్నపూర్ణ స్టూడియోకు సంబంధించి ప్రభుత్వ స్థలంలో ఉన్న గోడలను బుల్డోజర్‌తో పడగొట్టించిన సందర్భాలున్నాయి. ఆ తర్వాత ఎన్టీఆర్,ఏఎన్నార్ విభేదాలు పక్కన పెట్టి మళ్లీ ఒకటైపోయారు. ఇక ఎన్టీఆర్, కృష్ణ కూడా ఆ తర్వాత మళ్లీ కలిసిన సందర్భాలున్నాయి. ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణ మధ్య ఎన్ని గొడవలు ఉన్న వీళ్లు సినిమాల్లో కలిసి నటించిన సందర్భాలున్నాయి. తాజాగా బాలకృష్ణ, చిరంజీవి మధ్య ఉన్న గొడవలు కూడా అలాంటివే.  ఇక బాలయ్యకు, నాగార్జునకు కూడా ఓ విషయంలో విభేదాలు వచ్చాయి. గత  కొన్నాళ్లుగా వీళ్లు అంత సఖ్యంగా లేరనే మాట ఇండస్ట్రీలో వినబడుతోంది. మొత్తంగా తెలుగు ఇండస్ట్రీలో  ఉన్న ఈ విభేదాలన్ని టీ కప్పులో తుపాను లాంటివే. ఈ విభేదాలు తెలుగు ఇండస్ట్రీకి కొత్తేం కాదు. మొత్తంగా చూసుకుంటే ఈనాటి విభేదాలు ఏనాటివో అనే చెప్పాలి.
Published by: Kiran Kumar Thanjavur
First published: September 20, 2020, 4:14 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading