హోమ్ /వార్తలు /సినిమా /

ANR Birth Anniversary : తెలుగు సినీ ఇండస్ట్రీలో ఆ రికార్డు ఒక్క అక్కినేని నాగేశ్వరరావుకు మాత్రమే సాధ్యమైంది..

ANR Birth Anniversary : తెలుగు సినీ ఇండస్ట్రీలో ఆ రికార్డు ఒక్క అక్కినేని నాగేశ్వరరావుకు మాత్రమే సాధ్యమైంది..

ANR Birth Anniversary | అక్కినేని నాగశ్వరరావు వరించిన అవార్డులు, రివార్డులకు లెక్కేలేదు. 1941లో తెరకెక్కిన 'ధర్మపత్ని' సినిమాతో నట ప్రస్థానాన్ని ప్రారంభించి ఆ తర్వాత 1944లో తన రెండో చిత్రం 'శ్రీ సీతారామ జననం' సినిమాలో శ్రీరామునిగా నటించడం ద్వారా కథానాయకుడిగా మారారు. ఏడు దశాబ్దాల సినీ జీవితంలో ఏఎన్నార్ ఎన్నో బిరుదులు పొందారు. మరెన్నో అవార్డులు అందుకున్నారు. ఈ రోజు అక్కినేని నాగేశ్వరరావు జయంతి..

ఇంకా చదవండి ...

ANR Birth Anniversary: తెలుగు సినిమాకు బాలరాజు అతడే..బాలచంద్రుడతడే..దేవదాసు అతడే..కాళిదాసు కూడా అతడే...కబీరు అతడే...క్షేత్రయ్య అతడే.. అర్జునుడతడే..అభిమన్యుడతడే...ఆయనొక చారిత్రక పురుషుడు... భక్తవరేణ్యుడు... జానపద కథా నాయకుడు... అంతకు మించి అమర ప్రేమికుడు. తెలుగు చిత్ర పరిశ్రమలో ఆయనో బహుదూరపు బాటసారి. ఆయన చనిపోయేనాటికి తెలుగు సినిమాకు 83 ఏళ్లు. అన్నేళ్ల సినీ ప్రస్థానంలో 78 ఏళ్లు ఏఎన్నార్ తన సినీ ప్రస్థానాన్ని కొనసాగించారు. తెలుగు చిత్ర పరిశ్రమ బహుదూరపు బాటసారి అక్కినేని నాగేశ్వరరావు వరించిన అవార్డులు, రివార్డులకు లెక్కేలేదు. 1941లో తెరకెక్కిన 'ధర్మపత్ని' సినిమాతో నట ప్రస్థానాన్ని ప్రారంభించి ఆ తర్వాత 1944లో తన రెండో చిత్రం 'శ్రీ సీతారామ జననం' సినిమాలో శ్రీరామునిగా నటించడం ద్వారా కథానాయకుడిగా మారారు.

ఏడు దశాబ్దాల సినీ జీవితంలో ఏఎన్నార్ ఎన్నో బిరుదులు పొందారు. మరెన్నో అవార్డులు అందుకున్నారు. చలన చిత్ర రంగానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఇచ్చే అత్యున్నత పురస్కారం దాదా సాహెబ్ ఫాల్కే అవార్డును 1991లో అందుకున్నారు.

అక్కినేని నాగేశ్వర రావు (File/Photo)

దేశానికి సంబంధించి రెండో అత్యున్నత పౌర పురస్కారం ‘పద్మ విభూషణ్‌’ను సైతం పొందారు. తెలుగు చిత్రపరిశ్రమకు కాదు.. కాదు.. భారతీయ చిత్ర పరిశ్రమకు సంబంధించి ‘పద్మశ్రీ’, ‘పద్మభూషణ్’, ‘పద్మ విభూషణ్’ వంటి మూడు పద్మ పురస్కారాలు పొందిన తొలి నటుడు అక్కినేని మాత్రమే. ఆయన తర్వాత అమితాబ్ బచ్చన్ , దివంగత ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పద్మ పురస్కారాల్లో మూడు  అందుకున్నారు. భారత దేశంలో తొలి పద్మ విభూషణ్ పురస్కారం అందుకున్న తొలి నటుడు కూడా అక్కినేని నాగేశ్వరరావు.

బాలరాజు సినిమాలో అక్కినేని నాగేశ్వర రావు (File/Photo)

ఆయనకు రాకుండా మిగిలి ఉన్న గొప్ప పురస్కారం ఏదైనా ఉన్నదంటే అది 'భారతరత్న' మాత్రమే. అక్కినేనిని ఎవరైనా ప్రసావించాలంటే 'నట సమ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు' అనే ప్రస్తావిస్తారు. ఆ బిరుదును 1957 ఆగస్ట్‌లో అప్పటి రాష్ట్ర ఆర్థిక మంత్రి బెజవాడ గోపాలరెడ్డి చేతుల మీదుగా బెజవాడలోనే ఏఎన్నార్ అందుకున్నారు.

ANR Birth Anniversary : అక్కినేని నాగేశ్వరరావు జయంతి సందర్భంగా ఏఎన్నార్ అరుదైన చిత్రాలు..

ఆయన అందుకున్న బిరుదుల్లో 'నట సార్వభౌమ', 'నట రాజశేఖర', 'కళాప్రవీణ', 'అభినయ నవరస సుధాకర', 'కళా శిరోమణి', 'అభినయ కళాప్రపూర్ణ', 'భారతమాత ముద్దుబిడ్డ' వంటివి ఉన్నాయి.

మూడు తరాలను అలరించిన నాగేశ్వరరావు (File/Photo)

ఆయన అందుకున్న ముఖ్యమైన అవార్డులు:

1967లో కేంద్ర ప్రభుత్వం నుంచి పద్మశ్రీ పురస్కారం

1988లో కేంద్ర ప్రభుత్వుం నుంచి పద్మభూషణ్..

1990 రఘుపతి వెంకయ్య అవార్డ్ : ఏప్రిల్ 1990 (ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం)

దాదాసాహెబ్ ఫాల్కే : మే 1991 (కేంద్ర ప్రభుత్వం)

అన్న అవార్డ్ : నవంబర్ 1995 (తమిళనాడు ప్రభుత్వం)

ఎన్టీఆర్ జాతీయ చలనచిత్ర అవార్డ్ : నవంబర్ 1996 (ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం)

కాళిదాస కౌస్తుభ : నవంబర్ 1996 (మధ్యప్రదేశ్ ప్రభుత్వం)

చిత్తూరు వి. నాగయ్య అవార్డ్ : మార్చి 2009 (ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం)

2011లో కేంద్రం నుంచి ‘పద్మ విభూషణ్’ అవార్డు అందుకున్నారు.

ANR Attachment With Annapurna Studio
అన్నపూర్ణ స్టూడియో, ఏఎన్నార్ (ఫేస్‌బుక్ ఫోటో)

ఇవి కాకుండా ఆంధ్ర విశ్వవిద్యాలయం, నాగార్జున విశ్వవిద్యాలయం, దక్షిణ భారత హిందీ ప్రచారసభ నుంచి గౌరవ డాక్టరేట్‌లు అందుకున్నారు. అక్కినేని భారతీయ చలన చిత్ర రంగానికి చేసిన సేవలకు గుర్తింపుగా 2010లో సుబ్బరామిరెడ్డి మిలీనియం అవార్డును కూడా అందుకున్నారు. అలాగే తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా (తానా) నుంచి జీవిత సాఫల్య పురస్కారాన్ని (2012) పొందారు.

ఏఎన్నార్ (File/Photo)

'మేఘ సందేశం' (1982), 'బంగారు కుటుంబం' (1994) చిత్రాల్లో ప్రదర్శించిన నటనకు గాను రెండు సార్లు ఉత్తమ నటుడిగా నంది అవార్డును అప్పటి ఉమ్మడి ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి అందుకున్నారు.

Love Story Pre Release Event : నాగ చైతన్య ‘లవ్ స్టోరీ’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో అదిరిన చిరు, సాయి పల్లవిల డాన్స్ మూమెంట్స్..

మరోవైపు 'మరపురాని మనిషి' (1973), 'సీతారామయ్యగారి మనవరాలు' (1991), 'బంగారు కుటుంబం' (1994) చిత్రాలకు గాను ఉత్తమ నటునిగా ఫిల్మ్‌ఫేర్ అవార్డులు సాధించారు.

First published:

Tags: Akkineni nageshwar rao, ANR, Tollywood

ఉత్తమ కథలు