అక్కినేని హీరోగా చేసిన మొదటి సినిమా ‘శ్రీ సీతా రామ జననం’..

హీరోగా అక్కినేని మొదటి చిత్రం ‘శ్రీ సీతారామ జననం’ మూవీ (Twitter/Photo)

తెలుగు సినిమాకు బాలరాజు అతడే..బాలచంద్రుడతడే..దేవదాసు అతడే.తెలుగు చిత్ర పరిశ్రమలో ఆయనో బహుదూరపు బాటసారి. ఆయన చనిపోయేనాటికి తెలుగు సినిమాకు 83 ఏళ్లు. అన్నేళ్ల సినీ ప్రస్థానంలో 78 ఏళ్లు ఏఎన్నార్ తన ప్రస్థానాన్ని కొనసాగించారు. ఇక హీరోగా ఆయన ప్రస్థానం ప్రారంభించిన శ్రీసీతారామ జననం విడుదల రోజు సందర్భంగా స్పెషల్ స్టోరీ..

  • Share this:
తెలుగు సినిమాకు బాలరాజు అతడే..బాలచంద్రుడతడే..దేవదాసు అతడే..కాళిదాసు కూడాఅతడే...కబీరు..అతడే...క్షేత్రయ్య..అతడే..అర్జునుడతడే..అభిమన్యుడతడే...ఆయనొక చారిత్రక పురుషుడు... భక్తవరేణ్యుడు... జానపద కథా నాయకుడు... అమర ప్రేమికుడు. తెలుగు చిత్ర పరిశ్రమలో ఆయనో బహుదూరపు బాటసారి. ఆయన చనిపోయేనాటికి తెలుగు సినిమాకు 83 ఏళ్లు. అన్నేళ్ల సినీ ప్రస్థానంలో 78 ఏళ్లు ఏఎన్నార్ తన ప్రస్థానాన్ని కొనసాగించారు. అక్కినేని నాగశ్వరరావు వరించిన అవార్డులు, రివార్డులకు లెక్కేలేదు. 1941లో పి.పుల్లయ్య దర్శకత్వంలో తెరకెక్కిన 'ధర్మపత్ని' సినిమాతో నట ప్రస్థానాన్ని ప్రారంభించారు అక్కినేని నాగేశ్వర రావు. ఈ చిత్రంలో ఆయన 17 ఏళ్ల యువకుడి పాత్రలో నటించడం విశేషం.  ఆ తర్వాత 1944లో తన రెండో చిత్రం 'శ్రీ సీతారామ జననం' సినిమాలో శ్రీరామునిగా నటించడం ద్వారా కథానాయకుడిగా మారారు. ఈ చిత్రాన్ని ఘంటసాల బలరామయ్య తన స్వీయ దర్శత్వంలో నిర్మించారు. ఈ రోజే అక్కినేని హీరోగా శ్రీ సీతారామ జననం సినిమాతో నట జీవితాన్ని మొదలుపెట్టారు. అలా తన నట జీవితాన్ని శ్రీరాముడిగా ప్రారంభించిన నాగేశ్వరరావు ఆ తర్వాత ఏ సినిమాలో శ్రీరాముడు పాత్రలో నటించకపోవడం విశేషం. కానీ ‘చెంచులక్ష్మి’ ‘రామదాసు’  చిత్రంలో శ్రీ మహావిష్ణుగా మాత్రం  నటించారు.

బాలరాజు సినిమాలో అక్కినేని నాగేశ్వర రావు (File/Photo)


ఇక ‘చెంచు లక్ష్మి’లో నరసింహా స్వామి పాత్రలో నటించడం విశేషం. ఏడు దశాబ్దాల సినీ జీవితంలో ఏఎన్నార్ ఎన్నో బిరుదులు పొందారు. మరెన్నో అవార్డులు అందుకున్నారు. చలన చిత్ర రంగానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఇచ్చే అత్యున్నత పురస్కారం దాదా సాహెబ్ ఫాల్కే అవార్డును 1991లో అందుకున్నారు. దేశానికి సంబంధించి రెండో అత్యున్నత పౌర పురస్కారం ‘పద్మ విభూషణ్‌’ను సైతం పొందారు. తెలుగు చిత్రపరిశ్రమకు సంబంధించి ‘పద్మశ్రీ’, ‘పద్మభూషణ్’, ‘పద్మ విభూషణ్’ వంటి మూడు పద్మ పురస్కారాలు పొందిన నటుడు అక్కినేని మాత్రమే. ఆయన తర్వాత అమితాబ్ బచ్చన్ పద్మ పురస్కారాల్లో మూడు అందుకున్నారు. భారత దేశంలో తొలి పద్మ విభూషణ్ పురస్కారం అందుకున్న తొలి నటుడు కూడా అక్కేనేని నాగేశ్వరరావు సొంతం.
Published by:Kiran Kumar Thanjavur
First published: