హోమ్ /వార్తలు /సినిమా /

Prakash Raj - Bandla Ganesh: అన్న అన్న అంటూనే.. ప్రకాశ్ రాజ్‌కు పోటీగా ‘మా’లో పోటీకి బండ్ల గణేష్..

Prakash Raj - Bandla Ganesh: అన్న అన్న అంటూనే.. ప్రకాశ్ రాజ్‌కు పోటీగా ‘మా’లో పోటీకి బండ్ల గణేష్..

బండ్ల గణేష్ వర్సెస్ ప్రకాశ్ రాజ్ (Bandla Ganesh Vs Prakash Raj)

బండ్ల గణేష్ వర్సెస్ ప్రకాశ్ రాజ్ (Bandla Ganesh Vs Prakash Raj)

Prakash Raj - Bandla Ganesh: మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్‌లో (MAA) పరిస్థితులు ఎప్పుడు ఎలా మారుతున్నాయో చెప్పడం కష్టంగా మారిపోయింది. మొన్నటి వరకు అన్నా అన్నా అంటూ ప్రకాశ్ రాజ్‌కు సపోర్ట్ చేసిన బండ్ల గణేష్ (Prakash Raj - Bandla Ganesh).. ఇప్పుడు రూట్ మార్చాడు. ఆయనకే వ్యతిరేకంగా మారిపోయాడు.. పోటీకి కూడా సిద్ధమైపోయాడు.

ఇంకా చదవండి ...

మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్‌(MAA)లో పరిస్థితులు ఎప్పుడు ఎలా మారుతున్నాయో చెప్పడం కష్టంగా మారిపోయింది. మొన్నటి వరకు అన్నా అన్నా అంటూ ప్రకాశ్ రాజ్‌కు (Prakash Raj) సపోర్ట్ చేసిన బండ్ల గణేష్ (Bandla Ganesh).. ఇప్పుడు రూట్ మార్చాడు. ఆయనకే వ్యతిరేకంగా మారిపోయాడు.. పోటీకి కూడా సిద్ధమైపోయాడు. అక్టోబర్‌లో జరగబోయే ఎన్నికల గురించి ఇప్పటి నుంచే చర్చ మొదలైంది.. హాట్‌గా నడుస్తుంది కూడా. ఇప్పుడు మరోసారి ఈ ఎన్నికలు హాట్‌ టాపిక్ అవుతున్నాయి. తాజాగా బండ్ల గణేష్ చేసిన పనితో సంచలనంగా మారుతున్నాయి మా ఎలక్షన్స్ (MAA Elections). బండ్ల ఎంట్రీ తర్వాత మా అసోసియేషన్‌లో మళ్లీ గొడవలు బాగానే జరుగుతున్నాయని.. అక్కడ వర్గ పోరు బాగానే జరుగుతున్నాయని బహిర్గతమైపోయింది. తానేంటో చూపిస్తానంటూ సవాలు విసురుతున్న బండ్ల గణేష్ వ్యాఖ్యలు అందరికీ షాక్ ఇస్తున్నాయి. ముఖ్యంగా వీటిపై మా ఎన్నికల్లో చర్చ జరుగుతుంది.

బండ్ల గణేష్ సవాల్‌పై జీవితా రాజశేఖర్ (Jeevitha Rajasekhar) కూడా స్పందించింది. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల్లో బండ్ల గణేష్ ప్యానల్ మారిన తర్వాత మరింత రసవత్తరంగా మారిపోయింది పరిస్థితి. అంతేకాదు.. ఎవరూ ఊహించని విధంగా ఇప్పుడు పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. నిన్నటి వరకు ప్రకాష్ రాజ్ అయితే అంతా బాగా చేస్తాడు.. ఆయనైతేనే మంచి చేస్తాడని నమ్ముతున్నానంటూ చెప్పిన బండ్ల గణేష్.. ఇప్పుడు ఆయన ప్యానల్‌లో జీవితా రాజశేఖర్ రాకను వ్యతిరేకిస్తూ కామెంట్ చేసాడు.

Payal Rajput: పాయల్ రాజ్‌పుత్ సెన్సేషనల్ షో.. పొట్టి డ్రెస్సులో అందాల ఆరబోత..


మా ఎన్నికల్లో ఆమెకు పోటీగా జనరల్ సెక్రటరీగా పోటీ చేసి గెలుస్తానని సవాలు విసిరాడు బండ్ల గణేష్. ఇప్పటి వరకూ ప్రకాశ్ రాజ్‌కు మద్దతిస్తూ ప్యానల్ సభ్యుడిగా ఉన్న బండ్ల గణేష్.. జీవిత వచ్చిన తర్వాత మారిపోయాడు.. పూర్తిగా యూ టర్న్ తీసుకున్నాడు. ఇప్పుడు వాళ్లలో వాళ్ళకే పడటం లేదు. జీవితా రాజశేఖర్‌కు వ్యతిరేకంగా కామెంట్స్ చేయడంతో ఏం జరగబోతుందో ఊహించడం కూడా కష్టమే అవుతుంది. జీవితా రాజశేఖర్‌కు పోటీగా జనరల్ సెక్రటరీగా పోటీ చేసి.. తానేంటో చూపిస్తా అంటూ సవాల్ చేసాడు. అయితే ఇంత సీరియస్‌గా కామెంట్ చేస్తున్న బండ్ల గణేష్ వ్యాఖ్యలను జీవిత పెద్దగా పట్టించుకున్నట్లు కనిపించడం లేదు. ఆయనతో తనకెలాంటి విభేదాలు లేవని తెలిపింది జీవిత.

Nani @ 13 Years: నాని కెరీర్‌కు 13 ఏళ్ళు.. ఎమోషనల్ అయిన న్యాచురల్ స్టార్..


అంతేకాదు మా అసోసియేషన్‌లో సభ్యులుగా ఉన్నవాళ్ళు ఎవరు ఎవరిపై అయినా పోటీ చేయొచ్చు.. ఆ అధికరం అందరికీ ఉందంటూ కామెంట్ చేసింది. ఎన్నికల్లో తాను గెలిచినా ఓడినా అసోసియేషన్ అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపింది జీవిత. బండ్ల గణేష్ కూడా అందుకే పోటీ చేస్తున్నాడని.. ఆయన కూడా మా అభివృద్ధికే పోటీ చేస్తున్నాడని భావిస్తున్నట్లు జీవిత తెలిపింది. తనకు వ్యతిరేకంగా ఆయన పోటీ చేస్తున్నట్టు బావించడం లేదని.. ఇది కేవలం ఎన్నికలు మాత్రమే అనేది మరోసారి గుర్తు చేసింది జీవితా రాజశేఖర్. ప్రస్తుతం టాలీవుడ్‌లో మా ఎన్నికల గురించే చర్చ బాగా జరుగుతుంది.

Published by:Praveen Kumar Vadla
First published:

Tags: Actor prakash raj, Bandla Ganesh, MAA Elections, Telugu Cinema, Tollywood

ఉత్తమ కథలు