Home /News /movies /

26 ఏళ్లకే చనిపోయిన నటి.. సీక్రెట్‌గా అంత్యక్రియలు

26 ఏళ్లకే చనిపోయిన నటి.. సీక్రెట్‌గా అంత్యక్రియలు

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

దక్షిణ కొరియాలో సినీతారలు చిన్న వయసులో మరణించడం సాధారణమైపోయింది. గతంలో చా ఇన్ హా, గూ హారా లాంటి నటులు 30 ఏళ్ల లోపే మృతి చెందారు. తాజాగా దక్షిణ కొరియా ప్రముఖ నటి సాంగ్ యూ మృతి చెందారు.

దక్షిణ కొరియాలో సినీతారలు చిన్న వయసులో మరణించడం సాధారణమైపోయింది. గతంలో చా ఇన్ హా, గూ హారా లాంటి నటులు 30 ఏళ్ల లోపే మృతి చెందారు. తాజాగా దక్షిణ కొరియా ప్రముఖ నటి సాంగ్ యూ మృతి చెందారు. 26 ఏళ్ల సాంగ్ యూ జంగ్ ఇటీవలే మరణించారని, సోమవారం నాడు కుటుంబ సభ్యుల నడుమే నిశ్శబ్దంగా అంత్యక్రియలు నిర్వహించారని నటి మేనేజ్మెంట్ ఏజెన్సీ అయిన సబ్ లైం ఆర్టిస్ట్ ప్రకటన విడుదల చేసింది. అయితే ఆమె చనిపోవడానికి గల కారణంపై స్పష్టత లేదు. ఈమె మోడల్ గా, సినీతారగా దక్షిణ కొరియాలో మంచి గుర్తింపు తెచ్చుకుంది. మోడలింగ్లో ఎస్టీలాడర్ తో కెరీర్ ప్రారంభించిన సాంగ్ యూ జంగ్ అనంతరం సినీ తెరకు పరిచయమైంది. ఎంబీసీ వారి గోల్డెన్ రెయిన్ బో చిత్రంతో తొలిసారి వెండితెరపై కనిపించింది. ఈ సినిమా 2013లో విడుదలైంది. మేక్ యువర్ విష్(2014), స్కూల్(2017) లాంటి డ్రామా చిత్రాలతో సాంగ్ యూ ప్రాచుర్యంలోకి వచ్చింది. అంతేకాకుండా కొన్ని పాపులర్ మ్యూజిక్ వీడియోల్లో కూడా కనిపించింది. గుడ్ బై రోడ్, కే పాప్ బ్యాడ్ లాంటి వీడియోలతో పాప్ ఐకాన్ గా గుర్తింపు తెచ్చుకుంది.

కొరియాలో వరుసగా యువ తారలు మరణిస్తున్నారు. చా ఇన్ హా 2019 డిసెంబరులో చనిపోగా.. కే-పాప్ గాయకుడు గూ హారా 28 ఏళ్ల వయులో మరణించారు. అనంతరం కొన్ని రోజులకే కే-పాప్ బృందంలో సహచర గాయకుడు సల్లీ కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. 25 ఏళ్ల సల్లీ 2019 అక్టోబరులో ఆత్మహత్త చేసుకుని మృతి చెందాడు.
Published by:Ashok Kumar Bonepalli
First published:

Tags: Hollywood News, South korea

తదుపరి వార్తలు