షారుఖ్ ‘జీరో’ మూవీ నుంచి మరో సాంగ్ విడుదల: పాటలో రెచ్చిపోయిన కత్రినా

ఒకప్పుడు బాలీవుడ్ బాక్సాఫీస్‌లను తిరగరాసిన ఈ బాద్షా...ఇపుడు ఒక్క హిట్టు కోసం కిందా మీదైతున్నాడు. తాజాగా షారుఖ్..ఆనంద్ ఎల్ రాయ్ దర్శకత్వంలో ‘జీరో’ మూవీ చేసాడు. ఈ మూవీలో కింగ్‌ఖాన్ ఫస్ట్ టైమ్ మరుగుజ్జు పాత్రలో నటించాడు. తాజాగా  మూవీ నుంచి ‘హస్న్ పర్చమ్’ అనే సాంగ్‌ను రిలీజ్ చేసారు.

news18-telugu
Updated: December 12, 2018, 4:16 PM IST
షారుఖ్ ‘జీరో’ మూవీ నుంచి మరో సాంగ్ విడుదల: పాటలో రెచ్చిపోయిన కత్రినా
షారుఖ్ జీరో మూవీ
  • Share this:
ఒకప్పుడు బాలీవుడ్ బాక్సాఫీస్‌లను తిరగరాసిన ఈ బాద్షా...ఇపుడు ఒక్క హిట్టు కోసం కిందా మీదైతున్నాడు. తాజాగా షారుఖ్..ఆనంద్ ఎల్ రాయ్ దర్శకత్వంలో ‘జీరో’ మూవీ చేసాడు. ఈ మూవీలో కింగ్‌ఖాన్ ఫస్ట్ టైమ్ మరుగుజ్జు పాత్రలో నటించాడు.

ఇప్పటికే విడుదలైన ఈ మూవీ టీజర్, ట్రైలర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. అంతేకాదు ఇప్పటికే విడుదలైన ఇష్క్‌బాజ్ పాటకు మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా  మూవీ నుంచి ‘హస్న్ పర్చమ్’ అనే సాంగ్‌ను రిలీజ్ చేసారు.

ఈ పాటలో కత్రినా రెచ్చిపోయి అందాల ప్రదర్శన చేసింది. బాలీవుడ్‌లో ఇపుడిపుడే ఎదుగుతున్న హీరోయిన్స్‌లా లిమిట్స్ క్రాస్ చేసి మరి స్కిన్ షో చేసింది. ఈ మూవీలో కూడా క్రతినా..బబితా అనే కథానాయిక పాత్రను పోషించడం విశేషం. ఆమె అభిమాని షారుఖ్ నటించాడు.

మరోవైపు ఈ మూవీలో శ్రీదేవి, కరిష్మా సహా పలువురు బాలీవుడ్ నటీమణులు గెస్ట్ పాత్రలో కనిపించనున్నారు. ఆనంద్ ఎల్ రాయ్ డైరెక్ట్ చేస్తోన్న ఈ మూవీని రెడ్డీ చిల్లీస్ బ్యానర్‌లో గౌరీ ఖాన్ ప్రొడ్యూస్ చేసింది. ఈ మూవీని డిసెంబర్ 21న క్రిస్మస్ కానుకగా రిలీజ్ చేయనున్నారు. మరి ఈ మూవీతోనైనా షారుఖ్ సక్సెస్ ట్రాక్ ఎక్కుతాడా లేదా అనేది చూడాలి.


ఇది కూడా చదవండి #HBD:‘పేట్టా’ టీజర్ రిలీజ్: మరో బ్లాక్ బస్టర్‌కు తలైవా ఫ్యాన్స్ రెడీ

#HappyBirhtDay:సూపర్ స్టార్ రజినీకాంత్

తెలంగాణ ఎన్నికల్లో వెలవెలపోయిన సినీ గ్లామర్
Published by: Kiran Kumar Thanjavur
First published: December 12, 2018, 4:14 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading