షూటింగ్‌లో మరో ప్రమాదం.. తమిళనాడులోనే ఘటన..

మొన్నటికి మొన్న భారతీయుడు 2 సినిమా షూటింగ్‌లో జరిగిన ప్రమాదం గురించి ఎవరూ అంత త్వరగా మరిచిపోలేరు. ఈ ప్రమాదంలో ముగ్గురు చనిపోవడం సౌత్ ఇండస్ట్రీని విషాదంలో ముంచేసింది.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: February 29, 2020, 3:01 PM IST
షూటింగ్‌లో మరో ప్రమాదం.. తమిళనాడులోనే ఘటన..
తమిళనాడు షూటింగ్‌ సెట్‌లో మరో ప్రమాదం
  • Share this:
మొన్నటికి మొన్న భారతీయుడు 2 సినిమా షూటింగ్‌లో జరిగిన ప్రమాదం గురించి ఎవరూ అంత త్వరగా మరిచిపోలేరు. ఈ ప్రమాదంలో ముగ్గురు చనిపోవడం సౌత్ ఇండస్ట్రీని విషాదంలో ముంచేసింది. ఇది ఇంకా కళ్ల ముందు మెదలాడుతుండగానే మరో ప్రమాదం కూడా జరిగింది. ఈ సారి కూడా షూటింగ్‌లోనే జరగడంతో అంతా భయపడుతున్నారు. సినమా సెట్‌లో జరిగిన అగ్ని ప్రమాదంలో ప్రాణనష్టం జరగలేదు కానీ 20 లక్షల ఆస్తి నష్టం మాత్రం జరిగింది. ఈ ఘటన తమిళనాడులోనే జరిగింది. అక్కడి సాలిగ్రామం, వేలాయుధం కాలనీలో పారామౌంట్‌ అనే స్టూడియో ఉంది. దీనికి అక్కడ మంచి పేరు ఉంది. ఎక్కువగా సీరియల్స్ కోసమే ఈ స్టూడియో వాడుకుంటారు.
భారతీయుడు 2 షూటింగ్‌లో జరిగిన ప్రమాదానికి సంబంధించిన కేసును తమిళనాడు ప్రభుత్వం సీబీసీఐడీకి అప్పగించింది | Indian 2 accident, bharateeyudu 2 accident case, bharateeyudu 2 accident case to cbcid, tamil nadu, kamal hassan, Shankar, ఇండియన్ 2 యాక్సిడెంట్, భారతీయుడు 2 యాక్సిడెంట్ కేసు, సీబీసీఐడీ, తమిళనాడు, కమల్ హాసన్, శంకర్
దర్శకుడు శంకర్ ఇండియన్ 2 షూటింగ్‌లో ప్రమాదం (crane mishap 3)


అప్పుడప్పుడూ సినిమాలు కూడా ఇక్కడ చిత్రీకరిస్తుంటారు. షూటింగ్ కోసం ఇందులో అవసరమైన ఇళ్లు, భవనం వంటి సెట్స్‌ను పర్మినెంట్‌గా ఉంటాయి. దాన్ని కాస్త మార్చుకుని సినిమాలకు వాడేసుకుంటుంటారు. ఇదిలా ఉండగా ఫిబ్రవరి 28న ఇక్కడి పారామౌంట్‌ స్టూడియో వెనుక భాగంలో ఉన్న సినిమా సెట్‌కు సంబంధించిన వస్తువుల్లో అనుకోకుండా అగ్నిప్రమాదం జరిగింది. చిన్నగా మొదలైన పొగ కాస్తా పెద్దదిగా మారింది.
పారామౌంట్ స్టూడియోలో అగ్నిప్రమాదం
పారామౌంట్ స్టూడియోలో అగ్నిప్రమాదం

విషయాన్ని గమనించిన వాచ్‌మెన్‌ వెంటనే ఫైర్ ఇంజిన్‌కు వివరాలు తెలియజేసాడు. కోయంబేడు, అశోక్‌నగర్‌ నుంచి రెండు అగ్నిమాపక దళాలు, రెండు వాటర్ ట్యాంకర్లు వచ్చి మంటలు అదుపులోకి తీసుకొచ్చారు. అయితే అప్పటికే రెండు గంటల నుంచి మంటలు వస్తుండటంతో దాదాపు 20 లక్షల ఆస్తి అగ్గిపాలైపోయింది. ఈ క్రమంలోనే అక్కడ వేసిన కొన్ని సెట్స్‌తో పాటు కొన్ని సామాన్లు, ఓ చెట్టు అగ్నికి ఆహుతయ్యాయి. ఈ ఘటనపై పోలీసులు కూడా చర్యలు తీసుకుంటున్నారు.
Published by: Praveen Kumar Vadla
First published: February 29, 2020, 3:01 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading