• Home
  • »
  • News
  • »
  • movies
  • »
  • ANOTHER SHOCK TO VINK BEAUTY PRIYA PRAKASH VARRIER AND NITHIIN CHECK NOT HELPED FOR HER CAREER PK

Priya Prakash Varrier: పాపం ప్రియా వారియర్.. అనుకున్నదొక్కటి అయినదొక్కటి..!

ప్రియా ప్రకాష్ వారియర్ Photo : Instagram

Priya Prakash Varrier: ఇప్పుడు ప్రియా ప్రకాశ్ వారియర్‌ను చూస్తుంటే ఇదే అనిపిస్తుంది పాపం. ఎలా మొదలైన కెరీర్.. ఇప్పుడు ఎలా మారిపోతుందనేది కనీసం ఆమెకు కూడా అర్థం కావడం లేదు. నితిన్ హీరోగా వచ్చిన చెక్ సినిమాలో ప్రియా వారియర్..

  • Share this:
ఇప్పుడు ప్రియా ప్రకాశ్ వారియర్‌ను చూస్తుంటే ఇదే అనిపిస్తుంది పాపం. ఎలా మొదలైన కెరీర్.. ఇప్పుడు ఎలా మారిపోతుందనేది కనీసం ఆమెకు కూడా అర్థం కావడం లేదు. నితిన్ హీరోగా వచ్చిన చెక్ సినిమాలో ప్రియా వారియర్ నటిస్తుందంటే ఎంత పెద్ద పాత్ర చేస్తుందో అనుకున్నారంతా. కానీ కనీసం 15 నిమిషాలు కూడా లేని ఈ పాత్రలో ప్రియా మెరుపుతీగలా వచ్చి వెళ్లిపోయింది. అందులోనూ అది టెర్రరిస్ట్ పాత్ర కావడం గమనార్హం. సినిమాలో ఉన్నది 15 నిమిషాలే అయినా కూడా కెమెరా కళ్లన్నీ తనపైనే ఉండేలా అందాలన్నీ చూపించింది ప్రియా. కానీ ఏం లాభం సినిమా సక్సెస్ కాలేదు.. అందాలు ఆరబోసినా వర్కవుట్ కాలేదు. ప్రమోషన్స్‌లో ఎంత పాల్గొన్నా కూడా సినిమా విడుదలైన తర్వాత ఈమె పాత్ర గురించి పెద్దగా ఎవరూ చర్చించుకోవడం లేదు. పావుగంట పాత్రే చేసినా సినిమా ఒకవేళ హిట్ అయ్యుంటే అప్పుడు ప్రియా పాత్ర గురించి మాట్లాడుకునేవాళ్లేమో..? కానీ అటు సినిమా పోయే.. ఇటు ఈమె పాత్రకు పేరు రాకపాయే అన్నట్లుంది ఇప్పుడు పరిస్థితి. దాంతో ప్రియా వారియర్ కెరీర్ మరోసారి డైలమాలో పడిపోయింది. కన్నుగీటి ప్రపంచాన్ని వశం చేసుకున్నా.. ఆ తర్వాత మాత్రం ఆమె మాయలు కనిపించడం లేదు.. పని చేయడం లేదు. ఎంత త్వరగా ఫేమ్ తెచ్చుకుందో.. అంతే త్వరగా కింద పడిపోయింది ప్రియా వారియర్. ప్రస్తుతం ఈమె కెరీర్ నిలబడాలంటే అద్భుతాలు జరగాలి. కానీ జరిగేంత పరిస్థితి అయితే ఇప్పుడు కనిపించడం లేదు. ప్రస్తుతం తెలుగులో తేజ సజ్జ హీరోగా నటిస్తున్న ఇష్క్.. నాట్ ఏ లవ్ స్టోరీ సినిమాలో నటిస్తుంది ప్రియా.

ప్రియా ప్రకాశ్ వారియర్ హాట్ షో (priya prakash varrier/twitter)
నితిన్ చెక్ సినిమా (Nithiin Check movie)


ఈ సినిమాపైనే ఈమె కెరీర్ ఆధారపడి ఉంది. అయితే ఇలాంటి సినిమా వస్తున్నట్లు కూడా ప్రేక్షకులకు తెలియదు. అలాంటి సినిమాపై ప్రియా కెరీర్ ఆధారపడి ఉండటం అనేది కూడా చిత్రంగానే అనిపిస్తుంది. కానీ ఏం చేస్తాం.. ప్రస్తుతం తనను తాను నిరూపించుకోవాలంటే ప్రస్తుతం ఈమె చేతిలో ఉన్న ఒకే సినిమా ఇది. మరి ఇష్క్ సినిమాతో అయినా ప్రియా వారియర్ తానున్నానని గుర్తు చేస్తుందా లేదా చూడాలి.
Published by:Praveen Kumar Vadla
First published: