సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన అమ్మరాజ్యంలో కడప బిడ్డలు సినిమా బాక్సాఫీస్ దగ్గర పెద్దగా ప్రభావం చూపించడం లేదు. డిసెంబర్ 12న విడుదలైన ఈ చిత్రానికి టాక్ నెగిటివ్ రావడంతో..
సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన అమ్మరాజ్యంలో కడప బిడ్డలు సినిమా బాక్సాఫీస్ దగ్గర పెద్దగా ప్రభావం చూపించడం లేదు. డిసెంబర్ 12న విడుదలైన ఈ చిత్రానికి టాక్ నెగిటివ్ రావడంతో కలెక్షన్లు అసలే రావడం లేదు. ఈ సినిమా మొదలు పెట్టిన రోజు నుంచి వివాదాల్లో నిలిచింది. ఇప్పుడు విడుదలైన తర్వాత కూడా కలెక్షన్లు తీసుకురాలేకపోయినా కూడా కాంట్రవర్సీలు మాత్రం బాగానే తీసుకొస్తుంది. వర్మ తాజాగా సైబర్ క్రైమ్ పోలీసుల ముందు హాజరు కాబోతున్నాడు. డిసెంబర్ 16న ఈయన్ని విచారించబోతున్నారు పోలీసులు.
రామ్ గోపాల్ వర్మ, కేఏ పాల్ (Facebook/Photo)
కొన్ని రోజుల కింద ఈ చిత్రంపై ప్రముఖ క్రైస్తవ మత బోధకుడు.. ప్రజా శాంతి పార్టీ అధినేత కేఏ పాల్ హై కోర్టులో పిటిషన్ దాఖలు చేసారు. దాంతో పాటు సైబర్ క్రైమ్ పోలీసులకు కూడా ఫిర్యాదు చేసాడు. తన వ్యక్తిత్వాన్ని కించపరిచేలా ఈ సినిమాను రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించాడని కేఏ పాల్ ఆరోపించారు. తన ఫోటోలు మార్ఫింగ్ చేసి సినిమా ప్రమోషన్ కోసం వాడుకున్నాడంటూ ఆయన ఫిర్యాదు చేసారు. దాన్ని ఇప్పుడు సైబర్ డిపార్ట్మెంట్ విచారణ చేయబోతుంది. ఈ క్రమంలోనే వీళ్ళ ముందు హాజరు కాబోతున్నాడు వర్మ. మరోవైపు తాను కూడా కేఏ పాల్‌పై పరువునష్టం దావా వేస్తానని చెబుతున్నాడు ఆర్జీవీ.
Published by:Praveen Kumar Vadla
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.