Rhea Chakraborty: రియా చక్రవర్తికి మరో షాక్.. అక్టోబర్ 6 వరకు జైల్లోనే..

Rhea Chakraborty: బాలీవుడ్ బ్యూటీ రియా చక్రవర్తికి కాలం అస్సలు కలిసి రావడం లేదు. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ చనిపోయిన తర్వాత ఈమెకు కూడా కష్టాలు మొదలయ్యాయి.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: September 22, 2020, 4:34 PM IST
Rhea Chakraborty: రియా చక్రవర్తికి మరో షాక్.. అక్టోబర్ 6 వరకు జైల్లోనే..
రియా చక్రవర్తి తల్లిదండ్రులు (rhea chakraborty parents)
  • Share this:
బాలీవుడ్ బ్యూటీ రియా చక్రవర్తికి కాలం అస్సలు కలిసి రావడం లేదు. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ చనిపోయిన తర్వాత ఈమెకు కూడా కష్టాలు మొదలయ్యాయి. కొన్ని రోజుల వరకు అది ఆత్మహత్యలాగే కనిపించినా కూడా ఇప్పుడు డ్రగ్స్ కుంభకోణం కూడా బయటికి వచ్చింది. దాంతో బాలీవుడ్ ప్రముఖులు చాలా మంది ఇప్పుడు భయపడుతున్నారు. ఎప్పుడు ఎవరి పేరు బయటికి వస్తుందో కూడా అర్థం కావడం లేదు. ఇదిలా ఉంటే ప్రస్తుతం రియా చక్రవర్తికి మరో షాక్ కూడా తగిలింది. సెప్టెంబర్ 9న ఈమె డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయింది.
రియా చక్రవర్తి (Twitter/rhea chakraborty)
రియా చక్రవర్తి (Twitter/rhea chakraborty)


అందులోనే సుశాంత్ కేసు కూడా కలిపి ఉంది. ఈమెతో పాటు సోదరుడిని కూడా అరెస్ట్ చేసారు నార్కోటిక్స్ అధికారులు. ప్రస్తుతం రియా ముంబై మహిళా జైల్లోనే ఉంది. అక్కడికి వెళ్లిన రెండో రోజే బెయిల్ కోసం అప్పీల్ చేసుకుంది రియా. కానీ సెషన్స్ కోర్ట్ దీన్ని నిరాకరించారు. ఆ తర్వాత ముంబై హై కోర్టుకు కూడా వెళ్లింది రియా చక్రవర్తి. ప్రస్తుతం ఉన్న పరిస్థితులు చూస్తుంటే ఇప్పట్లో రియా బయటికి వచ్చేలా కనిపించడం లేదు. అక్టోబర్ 6 వరకు ఈమె జైల్లోనే ఉండేలా కనిపిస్తుంది రియా చక్రవర్తి.
రియా చక్రవర్తి తండ్రి (rhea chakraborty)
రియా చక్రవర్తి తండ్రి (rhea chakraborty)

ఈమె బెయిల్ పిటిషన్‌పై సెప్టెంబర్ 23న ముంబై హై కోర్టులో విచారణ జరగనుంది. ఇదిలా ఉంటే సుశాంత్ కేసులో కూడా రియా ప్రధానంగా మారింది. ఇప్పటికీ ఈమెపై కోపంతో రగిలిపోతున్నారు అభిమానులు. మరికొందరు మాత్రం సుశాంత్ కేసును సైడ్ ట్రాక్ పట్టించడానికే డ్రగ్స్ కేసును తెరపైకి తీసుకొచ్చారని వాదిస్తున్నారు.
జైలుకు రియా చక్రవర్తి (rhea chakraborty)
రియా చక్రవర్తి (Twitter/rhea chakraborty)

ఈ విషయంలో అటు అధికార బిజేపీతో పాటు ఇటు ప్రతిపక్ష కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం జరుగుతుంది. ఇదిలా ఉంటే రియా విచారణలో సారా అలీ ఖాన్, శ్రద్ధా కపూర్‌తో పాటు రకుల్ ప్రీత్ సింగ్ పేర్లు కూడా బయటికి వచ్చినట్లు ప్రచారం జరుగుతుంది. వాళ్లకు కూడా ఈ వారం నార్కోటిక్స్ అధికారులు సమన్లు జారీ చేయనున్నారనే వార్తలు వస్తున్నాయి. మొత్తానికి రియా మాత్రం అక్టోబర్ 6 వరకు జైల్లోనే ఉండాల్సిన పరిస్థితి అయితే వచ్చింది. ఈమెపై నాన్ బెయిలబుల్ కేసు ఉంది.
Published by: Praveen Kumar Vadla
First published: September 22, 2020, 4:34 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading