‘ఎన్టీఆర్’ బయోపిక్‌లో టీడీపీ జెండా..అజెండా..!

news18-telugu
Updated: December 10, 2018, 5:47 PM IST
‘ఎన్టీఆర్’ బయోపిక్‌లో టీడీపీ జెండా..అజెండా..!
‘ఎన్టీఆర్’ బయోపిక్ మూవీలో సీన్
  • Share this:
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ నందమూరి తారక రామారావు జీవిత కథపై ఆయన తనయుడు బాలకృష్ణ నటిస్తూ నిర్మిస్తున్న ‘ఎన్టీఆర్’ బయోపిక్‌ మూవీపై  టాలీవుడ్‌లో భారీ అంచనాలే ఉన్నాయి. క్రిష్ దర్శకత్వంలో తెరెకెక్కుతున్న ఈ మూవీని రెండు భాగాలుగా రిలీజ్ చేస్తున్నారు.

మహానటుడు రామారావు జీవితాన్ని ఒకే సినిమాలో చూపించడం సాధ్యం కాదు కాబట్టి..ఎన్టీఆర్..సినీ ప్రస్థానాన్ని ..‘ఎన్టీఆర్..కథానాయకుడు’ పేరుతో రామారావు ఫస్ట్ టైమ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన జనవరి 9న సంక్రాంతి కానుకగా రిలీజ్ చేయనున్నారు.

అన్న ఎన్టీఆర్‌ల పంచ కట్టులో బాలకృష్ణ


మరోవైపు రామారావు...రాజకీయ ప్రస్థానాన్ని ‘ఎన్టీఆర్..మహానాయకుడు’ పేరుతో రిపబ్లిక్ డే కానుకగా జనవరి 24న 15 రోజుల వ్యవధిలో రిలీజ్ చేయనున్నారు. తాజాగా ఈ మూవీ నుంచి మరో లుక్‌ను రిలీజ్ చేసారు.ఎన్టీఆర్ బయోపిక్


ఈ లుక్‌లో ఎన్టీఆర్ గెటప్‌లో బాలయ్య...టీడీపీ జెండా అజెండాను గోడపై గీస్తున్న బొమ్మను రిలీజ్ చేసారు. అది కాలక్షేపంగానో ..హాబీగానో వేస్తున్న  బొమ్మ కాదు.. కొమ్ములు తిరిగిన ఉద్దండులు .. మేదావులు రోజుల తరబడి ఆలోచిస్తూ రూపొందించే రాజకీయ అజెండా. ఆ బొమ్మలో అన్న ఎన్టీఆర్...తాడిత, పీడిత, కార్మిక, కర్షక వర్గాల ప్రగతి కోసం ఎన్టీఆర్ రూపకల్పన చేసిన ప్రణాళిక.

ఎన్టీఆర్ బయోపిక్ నుంచి మరో సాంగ్ రిలీజ్
తాజాగా ఈ మూవీ నుంచి రాజశ్రీ అంటూ సెకండ్ సాంగ్ రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు. కానీ అనివార్య కారణాలతో ఈ పాటను ఈ నెల 12న ఉదయం 10.31 నిమిషాలకు రిలీజ్ చేయనున్నట్టు ప్రకటించారు.

 

టీడీపీ అజెండాను వివరిస్తోన్న బాలయ్య


మొత్తానికి పూటకో పోస్టర్‌తో ‘ఎన్టీఆర్’ బయోపిక్‌పై అంచనాలు పెంచేస్తున్నారు.


ఇది కూడా చదవండి 

రజనీకాంత్ దర్శకుని నిర్మాణంలో మరో సినిమా

షాకింగ్.. 50 సినిమాలు పూర్తి చేసిన హన్సిక మొత్వానీ..

మంచు మ‌నోజ్ రిటర్న్స్.. త్వరలోనే కొత్త సినిమా..

 
First published: December 10, 2018
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>