పడకగదికి పిలిచి ఆడిషన్ అన్నాడు.. హీరోయిన్ సంచలన వ్యాఖ్యలు..

మాన్వీ గాగ్రూ ఫైల్ ఫోటో

మీటూ.. ఇండస్ట్రీ ఏదైనా కూడా హీరోయిన్లకు మాత్రం తప్పని బాధ ఇది. ఎక్కడ చూసినా కూడా ఇప్పుడు మీటూ బాధలు రోజుకొకటి బయటకు వస్తూనే ఉన్నాయి. తాజాగా మరో హీరోయిన్ కూడా తనకు..

  • Share this:
మీటూ.. ఇండస్ట్రీ ఏదైనా కూడా హీరోయిన్లకు మాత్రం తప్పని బాధ ఇది. ఎక్కడ చూసినా కూడా ఇప్పుడు మీటూ బాధలు రోజుకొకటి బయటకు వస్తూనే ఉన్నాయి. తాజాగా మరో హీరోయిన్ కూడా తనకు జరిగిన అన్యాయం గురించి చెప్పుకొచ్చింది. కెరీర్ మొదట్లో తాను ఓ ఆడిషన్‌కు వెళ్తే ఆ దర్శక నిర్మాతలు తనతో వెకిలి వేషాలు వేసారని చెబుతుంది బాలీవుడ్ హీరోయిన్ మాన్వీ గాగ్రూ. ఈమె కొన్ని హిందీ సినిమాలతో పాటు సీరియల్స్ కూడా చేసింది. తనకు ఎదురైన ఛేదు అనుభవాన్ని గుర్తు చేసుకుంది ఈమె. తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో సంచలన విషయాలు బయటపెట్టింది మాన్వి. ఓ సినిమాలో అవకాశం కోసం తాను ఆడిషన్స్‌కు వెళ్లానని.. చెత్తగా ఉన్న ఓ ఆఫీసులో తనను అత్యాచారయత్నం సన్నివేశంలో నటించమని అడిగారని చెప్పింది మాన్వి.
Another Metoo Incident in Bollywood and actress Maanvi Gagroo shared her experience pk మీటూ.. ఇండస్ట్రీ ఏదైనా కూడా హీరోయిన్లకు మాత్రం తప్పని బాధ ఇది. ఎక్కడ చూసినా కూడా ఇప్పుడు మీటూ బాధలు రోజుకొకటి బయటకు వస్తూనే ఉన్నాయి. తాజాగా మరో హీరోయిన్ కూడా తనకు.. Maanvi Gagroo,Maanvi Gagroo twitter,Maanvi Gagroo casting couch,nana patekar tanushree dutta,me too bollywood,me too campaign bollywood,bollywood gossips,#metoo,bollywood me too campaign,#metoo bollywood,me too movement,casting couch,casting couch in bollywood,casting caouh,female casting couch,dirty casting couch scandal,sri reddy about casting couch,hollywood casting couch satan's playground,hindi cinema,మాన్వీ గాగ్రూ,మాన్వీ గాగ్రూ క్యాస్టింగ్ కౌచ్,తనుశ్రీ దత్తా,నానా పటేకర్,నానా పటేకర్‌కు క్లీన్ చిట్,సాక్ష్యాలు లేకపోవడంతో నానా పటేకర్‌కు క్లీన్ చిట్,తెలుగు సినిమా,క్యాస్టింగ్ కౌచ్,మీటూ నానా పటేకర్ తనుశ్రీ దత్తా
మాన్వీ గాగ్రూ ఫైల్ ఫోటో

అక్కడ కేవలం ఇద్దరు వ్యక్తులు మాత్రమే ఉన్నారని.. అక్కడ వాతావరణం చూసినపుడే తనకు తేడా కొట్టిందని తెలిపింది ఈమె. ఆ గదిలో పడక మంచం కూడా ఉందని.. అది చూసినపుడే అక్కడ్నుంచి భయంతో వెంటనే బయటికి వచ్చేసానని చెప్పింది ఈ ముద్దుగుమ్మ. ఆ మంచం.. రేప్ సీన్ ఇవన్నీ తలుచుకుంటే తనకు భయంతో నిద్ర కూడా రాదని చెబుతుంది మాన్వి. ఉజ్డా చమన్‌ సినిమాతో మాన్వి గాగ్రూ గుర్తింపు తెచ్చుకొంది. మొత్తానికి మీటూపై ఇన్ని కథనాలు బయటికి వస్తున్నా కూడా ఎవరూ పెద్దగా స్పందించకపోవడం గమనార్హం.
Published by:Praveen Kumar Vadla
First published: